twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సార్..క్లాస్ పీకారు ...( సారొచ్చారు రివ్యూ)

    By Srikanya
    |

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    Rating:
    2.0/5
    నిజానికి సారొచ్చారు.. ఓ క్లీన్ సినిమా... అంటే... ఎక్కడా అసభ్యత, మితిమీరిన శృంగారం లేకపోవటమని మాత్రమే కాదు... ఈ సినిమాలో చెప్పుకోవటానికి కూడా ఏమీ లేదని.... పెళ్లికి ముందు తన మీద చూపించే ప్రేమ, అభిమానం, పెళ్లయ్యాక కనిపించటం లేదని.. చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న అమ్మాయిలు కంప్లైంట్స్ చేస్తూంటారు... అదే పాయింట్ ని బేస్ చేసుకుని తీసిన ఈ చిత్రం పెళ్లి అయ్యాక అంతకు ముందులా ప్రేమని కురిపించటం కష్టమేనని, భాధ్యతలు వాటిని డామినేట్ చేస్తాయని, అది ఆడవాళ్లు పెళ్లికి ముందే అర్దం చేసుకుని, పెళ్లిచేసుకోమని చెప్తుంది. అయితే ఈ పాయింట్ ని అండర్ కరెంట్ గా చెప్పకుండా దర్శకుడు డైలాగ్స్ పై ఆధారపడటంతో... చాలా చోట్ల క్లాసు పీకుతున్న పీల్ కలుగుతుంది. రవితేజ సినిమా... కామెడీ ఉంటుంది.. మాస్ మసాలాలు ఉంటాయి అని ఆశించకుండా వెళితే ఓకే అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు... అజిత్, ఎస్ జె సూర్య చిత్రం 'వాలి' స్క్రీన్ ప్లే గుర్తు వస్తే మీ తప్పుకాదు.

    సంధ్య(కాజల్) పూర్తిగా కార్తిక్(రవితేజ)తో ఒన్ సైడ్ లవ్ లో పడిపోయి ఓ రోజు ప్రపోజ్ చేస్తుంది. అయితే అతను తనకు అంతకుముందే వసు(రిచా గంగోపాధ్యాయ)తో ప్రేమ వివాహం జరిగిందని, కానీ పెళ్లికి ముందు చూపించినంత ప్రేమను తర్వాత భాథ్యతలు, కెరీర్ ఒత్తిడిలో పడి తాను చూపించలేకపోతున్నాను అంటూ తన భార్య కోపంతో విడిపోయి విడాకులకు అప్లై చేసిందని.. తన గతం చెప్తాడు. అతని ప్రేమ వివాహం కథ విన్న సంధ్య షాక్ అవుతుంది. అయినా అతనిపై ప్రేమను వదులుకోలేకపోతుంది. అప్పుడు కార్తీక్ మరో ఊహించని ట్విస్ట్ రివిల్ చేస్తాడు.... ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి... సంధ్య, వసు ప్రేమ కథ ముగింపుకి ఎలా వచ్చింది. సంధ్య పరిస్ధితి ఏమిటి.... అలాగే ఈ సినిమాలో గౌతమ్(నారా రోహిత్) పాత్ర ఏమిటి.. తెలియాలంటే... చిత్రం చూడాల్సిందే.

    బ్యానర్: త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రై.లి.పై
    సమర్పణ: వైజయంతి మూవీస్
    నటీనటులు: రవితేజ, కాజల్‌, రిచా గంగోపాధ్యాయ, జయసుధ, చంద్రమోహన్‌, రవిప్రకాష్‌, యం.ఎస్‌.నారాయణ, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు
    ఛాయాగ్రహణం: విజయ్‌ కె.చక్రవర్తి,
    ఫైట్స్‌: రామ్‌, లక్ష్మణ్‌.
    సంగీతం: దేవిశ్రీప్రసాద్
    కథ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: పరుశరామ్
    నిర్మాత: ప్రియాంక దత్

    దర్శకుడు పరుశరామ్ కి బలం డైలాగులు... బలహీనత కథనం... అని గత చిత్రాలు సోలో, ఆంజనేయులు నిరూపించాయి. సారొచ్చారు చిత్రం కూడా అదే పంధాలో వెళ్లింది. డైలాగులు బాగున్నా... అవే చాలా చోట్ల ఎక్కువై కథ, కథనం బలహీనమైంది. దర్శకుడు... రచయిత ఒకటైనప్పుడు విజువల్స్ తగ్గిపోయి.. వొకాబ్లరీ ఎక్కువుదంటారు. అదే ఈ చిత్రానికి జరింగిందనిపించింది. ఇక సినిమా ఎత్తుగడ, స్క్రీన్ ప్లే కోసం తీసుకున్న మెలిక బాగానే ఉన్నా.... ఇంటర్వెల్ కి ఇవ్వాల్సిన ట్విస్టుని ప్రీ క్లైమాక్స్ దాకా సీరియల్ లాగినట్లు లాగాడు. దాంతో కథనం పలచబడిపోయింది. దాదాపు ఇలాంటి స్క్రీన్ ప్లేతో వచ్చిన ప్రబాస్ డార్లింగ్ లో ఇంటర్వెల్ కి స్క్రీన్ ప్లే ట్విస్ట్ ఓపెన్ చేసేసి... సెకండాఫ్ ..తర్వాత జరిగే పరిణాలతో కథనం అల్లడానికి అవకాసం ఇచ్చి కథనం పరుగెత్తించి హిట్ కొట్టారు. ఇక్కడ అదే మిస్సైంది. దాదాపు సినిమా ప్రీ క్లైమాక్స్ వచ్చేవరకూ హీరో... తన ప్లాష్ బ్యాక్ రివిల్ చేయటం... దానితో పాటు వచ్చే ట్విస్ట్ రివిల్ చేయటమే సరిపోతుంది. ట్విస్ట్ రివిల్ చేసాక మాత్రమే హీరో సమస్యలో పడతాడు. దాంతో అప్పటిదాకా హీరో.... కేవలం కథ చెప్పుకుంటూ కారు డ్రైవ్ చేయటం మాత్రమే చేస్తూంటాడు. హీరో చెప్పే ప్లాష్ బ్యాక్ కథలు వినటానికి జనం వెళ్లరు కదా.... అతను రియల్ టైమ్ లో ఏం చేసాడో అని చూడ్డానికి వెళ్తారు. అదే ఇక్కడ మిస్తైంది. పోనీ హీరో ప్లాష్ బ్యాక్ గా చెప్పే కథ ఏమన్నా ఇంట్రస్టింగా ఉండి... సినిమాకు కీలకమై ఉంటుందా.... (భాషా స్క్రీన్ ప్లే తరాహాలో) అంటే అదే ఉండదు. హీరో చెప్పే కథ సినిమాకు పనికి వచ్చేది కాదు... అంటే హీరోని యాక్టివ్ చేసేది కాదు. అలాగని ఆ ట్విస్టుకి ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడే సిట్యువేషన్ కూడా కనపడదు.

    దీనికి తోడు రవితేజ.. వయస్సు మీద పడటం వల్లనో మరేమో కానీ.. పాత్ర ప్రకారం పెళ్లై విడాకులకు రెడీగా ఉన్నాడంటే నిజమనిపిస్తుంది... దానికితోడు ఈ చిత్రానికి క్లాస్ లుక్ ఇవ్వాలనుకుని... రవితేజ రెగ్యులర్ గా చేసే కామెడీకి దూరం చేసారు. దాంతో రవితేజ నుంచి సమ్ థింగ్ ఆశించివచ్చే వారికి నిరాశే. ఇక కాజల్ ఈ చిత్రంలో బాగా ఒళ్లు చేసి కనపడింది. కానీ కళ్లు మాత్రం ఎక్సప్రెసివ్ గా చాలా సీన్స్ లో బాగా ఉపయోగించి.. మార్కులు కొట్టేసింది. రిచా గంగోపాద్యాయ ని భార్య పాత్రలో చూసినా పెద్ద ఎబ్బెట్టుగా అనిపించలేదు... కరెక్టుగా సూటైనట్లుంది. ఆమె కూడా తగ్గకపోతే భార్య పాత్రలనుంచి ఆంటీ పాత్రలకు వెళ్ళిపోతుంది. నారా రోహిత్ పాత్ర విషయానికి వస్తే.... ఆ పాత్ర దాదాపు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు అన్నిటిలో కనపడే త్యాగం చేసే సెకండ్ హీరో పాత్రే. తను ఇష్టపడి పెళ్లిచేసుకుందామనుకునే అమ్మాయిని..తన చేతులతోనే ఆమె ప్రేమించివారికి.. కట్టబట్టి... త్యాగశీలివయ్యా అనిపించుకునే పాత్ర. ముఖ్యంగా ఆ పాత్ర.. కుచ్ కుచ్ హోతా హై చిత్రం క్లైమాక్స్ లో వచ్చే సల్మాన్ ని గుర్తు చేస్తుంది. అయితే నారా రోహిత్ బాగా చేసాడు.

    సహజనటి జయసుధ.. సహజంగానే చేసింది. శ్రీనివాస రెడ్డి.. సేమ్ ఎక్సప్రెషన్స్.. మొహమాటానికి కూడా ఏ సినిమాలోనూ ఆ ఎక్సప్రెషన్స్ ని మార్చటానికి ఇష్టపడడు. ఎమ్.ఎస్ నారాయణ కనపడిన కాస్సేపు బాగానే నవ్వించారు. సినిమాకు పెద్ద మైనస్... క్లైమాక్స్. అప్పటివరకూ ఫరవాలేదు... అనుకున్న సినిమా కూడా అక్కడకి వచ్చేసరికి రొటీన్ అయ్యిపోయి డ్రాప్ అయ్యిపోయింది. అప్పటికీ నారా రోహిత్.. తన భుజాల మీద క్లైమాక్స్ ని కాపు కాద్దామని చూసాడు కానీ ఫలితం లేదు. ఇక సినిమాలో రెండు ఫైట్స్ పెట్టారు. అవి తీసేసినా... చిన్న మెత్తు మార్పు కూడా సినిమాలో రానంతగా కథకు సంభంధం లేకుండా.. కావాలని పెట్టినట్లు ఉన్నాయి. సినిమా కథ విని... దేవిశ్రీ.. టోన్ కి తగినట్లు డల్ మ్యూజిక్ ఇచ్చినట్లున్నాడు... దేవి స్ధాయిలో ఊపొచ్చే పాటలు లేవు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఉన్నంతలో కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్.... చాలా సీన్స్ కట్ చేస్తే కాస్త స్పీడు వచ్చేదనిపించింది.

    ఏదైమైనా రవితేజ రెగ్యులర్ కామెడీ,యాక్షన్ సినిమాలుకు వెళ్లి ఎంజాయ్ చేసేవారికి ఈ చిత్రం పెద్దగా కిక్ ఇవ్వదు..... ఫ్యామిలీలకు వీకెండ్ లో ఈ చిత్రం మంచి ఆఫ్షనే. అద్బుతం కాకపోయినా ఓకే అనిపిస్తుంది. ప్రేమలో ఉండి త్వరలో పెళ్లి చేసుకుందామనుకునే వాళ్లు అయితే ఒకసారి ఈ చిత్రం చూస్తే ఏమన్నా ఉపయోగపడే అవకాసం ఉంది. వాళ్లో లుక్ వేయండి...

    English summary
    Sarocharu is a romantic entertainer starring mass raja Ravi Teja, Kajal Aggarwal and Richa Gangopadhyay. The film is directed Parasuram (Bujji) and produced by Priyanka Dutt under Vyjayanthi Movies banner. Ravi Teja will be playing the role of a football coach in this film, which will be in a sports backdrop. Ravi Teja will be essaying the role of a football coach mentoring kids for an Ooty-based school. How the actor mentors them, instills confidence and eventually withers the storm forms the rest of the story. This is the first time that Ravi Teja has worked on a sports backdrop script, putting besides his regular masala flicks. The film, which was shot in the locales of Ooty, Switzerland and other parts of Europe, has music provided by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X