twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘విశ్వరూపం’ రివ్యూ...(ఎన్నారై పాఠకుడి రివ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కమల్ హాసన్ భారీ బడ్జెట్ మూవీ 'విశ్వరూపం' వివిధ కారణాలతో తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల కాక పోయినా విదేశాల్లో మాత్రం యదావిధిగా అనుకున్న డేట్ ప్రకారం ఈ రోజు విడుదలైంది. దాదాపు 3 సంవత్సరాల విరామం తర్వాత కమల్ హాసన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'విశ్వరూపం' చిత్రాన్ని కమల్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నిర్మించడంతో పాటు ఇందులో హీరోగా చేసాడు. తొలినాళ్లలో సెల్వరాఘవన్ దర్శకుడిగా ఈ సినిమా మొదలు పెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల సెల్వరాఘవన్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను భుజానేసుకున్నారు కమల్ హాసన్.

    విశ్వరూపం చిత్రం తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి రూపొందించారు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 95 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. దక్షిణాదిలో రజనీకాంత్ 'రోబో' తర్వాత భారీ బడ్జెట్ చిత్రం ఇదే. 'విశ్వరూపం' చిత్రాన్ని న్యూజెర్సీలో వీక్షించిన వన్ ఇండియా పాఠకుడు 'ప్రవీణ్ కుమార్' తన అభిప్రాయ కోణంలో సినిమా ఎలా ఉందనే విషయమై ఓ రివ్యూను రాసి పంపారు. దానిపై ఓ లుక్కేయండి...

    సినిమా అమెరికాలో మొదలవుతుంది. విశ్వనాథ్(కమల్ హాసన్) కథక్ నృత్య శిక్షకుడు. విశ్వనాథ్ తన దగ్గరికి వచ్చే అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటూ ఉంటాడు. ఆ అమ్మాయిల్లో ఆండ్రియా ఒకరు. దీంతో విశ్వనాథ్ భార్య డాక్టర్ నిరుపమ(పూజా కుమార్) తన భర్త క్యారెక్టర్ పై అనుమానం పెంచుకుంటుంది. ఈ వ్యవహారం తేల్చుకునేందుకు ఓ డిటెక్టివ్‌ను నియమిస్తుంది. అయితే ఆ డిటెక్టివ్ ఆల్ ఖైదా గ్రూపు టెర్రరిస్టులచే చంపబడతాడు.

    ఆల్ ఖైదా ఉగ్రవాదులు న్యూయార్కులో న్యూక్లియర్ బాంబు పేల్చేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉండటం వల్ల ఈ విషయం గురించి కమల్ హాసన్ కు తెలుస్తుంది. ఓమర్(రాహుల్) నాయకత్వంలోని టెర్రరిస్టు గ్రూపుతో గతంలో సంబంధం కలిగి ఉంటాడు కమల్ హాసన్. మరి ఉగ్రవాద గ్రూపులు తాము అనుకున్న మిషన్ కంప్లీట్ చేసారా? కమల్ హాసన్ రోల్ ఏంటి? అతను టెర్రరిస్టా? అండర్ కవర్ ఏజెంటా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    సినిమా నెమ్మదిగా ప్రారంభం అయినా...కథలో గ్రిప్ ఉంది. సినిమా తొలి భాగం మొత్తం యూఎస్ లోనే షూట్ చేసారు. తొలి భాగం చూస్తే సెకండాఫ్ ఏమిటి? అనే దానిపై ఉత్సుకత పెరుగుతుంది. సెకండాఫ్ వివరాల్లోకి వెళితే...సెకండాప్ కొంత సాగదీసినట్లు ఉన్నప్పటికీ కొంత వరకు ఫర్వాలేదనిపిస్తుంది.

    మిగతా వివరాలు స్లైడ్ షోలో...

    ‘విశ్వరూపం’ రివ్యూ...(ఎన్నారై పాఠకుడి రివ్యూ)

    విశ్వరూపం స్టోరీ వండర్ ఫుల్ గా ఉంది. యక్షన్, సినిమాటోగ్రఫీ లాంటి టెక్నికల్ అంశాలు చాలా బాగున్నాయి. పాటలు కూడా ఫర్వాలేదు

    ‘విశ్వరూపం’ రివ్యూ...(ఎన్నారై పాఠకుడి రివ్యూ)

    ఇప్పటికే పాత్రల విషయంలో ఎన్నో ఎక్సపర్మెంట్స్ చేసిన కమల్ హాసన్ గొప్పనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో కూడా కమల్ హాసన్ తాను పోషించిన పాత్రలు అద్బుతంగా చేయడంతో పాటు, వైవిద్యతను చాటాడు. డాన్సర్ పాత్రలో స్క్రీ లక్షణాలు ఉన్న వాడిగా, అదే విధంగా టెర్రరిస్టు పాత్రలో టెర్రిఫిక్ లుక్ లో కనిపించాడు.

    ‘విశ్వరూపం’ రివ్యూ...(ఎన్నారై పాఠకుడి రివ్యూ)

    ఈచిత్రం ద్వార కొత్తగా ఎంటరైన పూజా కుమార్ సెక్సీగా కనిపించడంతో పాటు సినిమాకు కాస్త గ్లామర్ అద్దింది. ఆండ్రియా పాత్రకు చాలా చిన్నది, మరియు పెద్దగా ప్రాధాన్యం లేనిది. రాహుల్ బోస్ టెర్రరిస్టు పాత్రలో జీవించాడు. శేఖర్ కపూర్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    ‘విశ్వరూపం’ రివ్యూ...(ఎన్నారై పాఠకుడి రివ్యూ)

    టెక్నికల్ అంశాల వివరాల్లోకి వెళితే...సాను సినిమాటోగ్రఫీ టాప్ అని చెప్పొచ్చు. సినిమాలో కొన్ని రేరెస్టు లొకేషన్లతో పాటు, ఆప్ఘనిస్థాన్ సన్ని వేశాలను అద్భుతంగా చూపించాడు. శంకర్-ఎస్సాన్-లాయ్ సంగీతం గురించి మాట్లాడుకుంటే రెండు పాటలు బాగా కంపోజ్ చేసాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. జెట్ ఫైటర్ సీన్లో ఏరో 3డి సౌండ్ ఫార్మాట్ ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది. మహేష్ నారాయణ ఎడిటింగ్ ఫర్వాలేదు.

    ‘విశ్వరూపం’ రివ్యూ...(ఎన్నారై పాఠకుడి రివ్యూ)

    ఒక అభిమానిగా...నేను సినిమాను బాగా ఎంజాయ్ చేసాను. సినిమా హాలీవుడ్ స్టాండర్స్ తో ఉంది. నా రేటింగ్ 3.5/5

    English summary
    The wait is over. Kamal Hassan's biggest-ever film Viswaroopam, which has been delayed for one or the other reason, has seen the light of day in foreign countries but not in Tamil Nadu and other Southern states as the High Court has stayed the release after several Muslim groups raised objection. After a gap of three years, Kamal Hassan is back with Viswaroopam, which is written, directed and produced by himself. The film was supposed to be directed by Selvaraghavan but as the director walked out of the film due to other commitments, Kamal took the responsibility of directing the film. The film is simultaneously made in Tamil, Telugu and Hindi. It is made with the budget of Rs 95 crore, which is the second highest budget Tamil film after Rajinikanth's blockbuster Endhiran. What does the multilingual action-thriller has to offer? A reader named Praveen Kumar from New Jersey reviewed the film, as the movie was not released here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X