twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పిజ్జా’ మూవీ రివ్యూ...

    By Bojja Kumar
    |

    విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్ జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిన తమిళ చిత్రం 'పిజ్జా'. తమిళంలో ఈచిత్రం విజయవంతం కావడంతో ఎస్.కె. పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకుని విడుదల చేసారు. థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందిన 'పిజ్జా' సినిమా రుచి ఎలా ఉందో చూద్దాం...

    దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్
    నిర్మాత : సురేష్ కొండేటి
    సంగీతం : సంతోష్ నారాయణన్
    నటీనటులు : విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్, నరేన్, పూజా, జైకుమార్, వీరసేతురామన్ తదితరులు

    Pizza

    కథ : మైఖేల్(విజయ్ సేతుపతి) పిజ్జా డెలివరీ బాయ్. తన గర్ల్ ఫ్రెండ్ అను(రమ్య నంబీసన్)తో కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తుంటాడు. అనుకి దెయ్యాలపై నమ్మకం ఎక్కువ. దయ్యాలపై నవల రాసేందుకు అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. కానీ మైఖేల్‌కి ఇలాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదు. ఈ క్రమంలో పిజ్జా రెస్టారెంట్ ఓనర్ షన్ముగం(నరేన్)కూతురుకి దెయ్యం పడుతుంది. అప్పటి నుంచి అతనిలో దెయ్యాలంటే భయం మొదలవుతుంది. ఓ సారి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లిన మైఖేల్ భయానక పరిస్థితులు ఎదుర్కొంటాడు. అదే సమయంలో అను మిస్సవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ప్రేక్షకులకు సస్పెన్స్, థ్రిల్లింగ్ అనుభూతినిస్తాయి.

    హీరో విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అతని నటన సినిమాకు హైలెట్ గా చెప్పొచ్చు. హారర్ నావెలిస్ట్‌గా రమ్య నంబీసన్ లుక్స్ కూల్ గా ఉండటంతో పాటు నటన పరంగా కూడా ఆకట్టుకుంది. అయితే ఆమె మేకప్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుడేంది. ఇతర నటీనటులు నరేన్, పూజా, జైకుమార్, వీరసేతు రామన్ కూడా వారి పాత్రలకు తగిన విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

    సంతోష్ నారాయణ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్సయింది. సీన్లకు, స్క్రీన్ ప్లేకి తగిన విధంగా మ్యూజిక్ ఇచ్చాడు. కొన్ని హారర్ సీన్లకు బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా సూటయింది. గోపీ అమర్నాథ్ పిక్చరైజేషన్ సినిమాకు మరో హైలెట్. ఇతర సాంకేతిక విభాగాలు కూడా బాగా పని చేసాయి.

    ఇండియన్ బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో 'పిజ్జా' కూడా చోటు దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వండర్ పుల్ స్టోరీలైన్ తో పాటు దానికి తగిన విధంగా స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. కమర్షియల్ అంశాలను ఆశించకుండా హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

    English summary
    Karthik Subbaraj's debut directorial venture Pizza starring Vijay Sethupathi and Remya Nambeeshan in leads, is a Tamil suspense thriller, which has been critically acclaimed movie, besides being a big success at the TN Box Office. Now, the makers of the film have it dubbed and released in Telugu today (February 15). It is sure to impress Telugu audience too. Pizza is one of the finest Indian thrillers and debutant Vijay Sethupathi's 
 excellent performance is the main highlight in the film. Karthik Subbaraj's clever screenplay, Santhosh Narayanan's excellent background score, Gopi Amarnath's amazing cinematography are other attractions of the movie. There are no big drawbacks except uninteresting songs. The flick does not have commercial elements and it lacks Telugu nativity, which can be called drawbacks as per Telugu viewers' taste.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X