twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5
    తమిళ హీరో కార్తీ చిత్రాలకు తెలుగులో మొదట నుంచి మంచి మార్కెట్టే ఉంది. అతని చిత్రాలు తమిళనాట ప్లాప్ అయినవి కూడా ఇక్కడ హిట్టై, మంచి కలెక్షన్స్ తెచ్చి పెట్టాయి. ఈ నేపధ్యంలో అక్కడ డిజాస్టర్ సినిమా అలెక్స్ పాండ్యన్ ని తెలుగులోకి డబ్బింగ్ చేసి వదిలారు. రొట్టకొట్టుడు కథ, రొటీన్ కథనం చిరాకుపరిచినా,యాక్షన్ ఎలిమెంట్స్,అనుష్క గ్లామర్, సంతానం కామెడీ తెలుగు ప్రేక్షకుడుకి ఖచ్చితంగా నచ్చుతాయనే నమ్మకంతో విడుదల చేసినట్లు అనిపిస్తుంది. వారి నమ్మకానికి తగ్గట్లే బి, సి సెంటర్లును ఆకట్టుకునే వాతావరణం కనపడుతోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం... కార్తీ, సూర్య సినిమాలకు ఇక్కడ ఆడటానికి ప్రధాన కారణం.. వారి చిత్రాల్లోని కథ, కథన వైవిధ్యం... అయితే ఎప్పుడయితే తెలుగు వారిని టార్గెట్ చేస్తూ వారికి నచ్చాలని తమ ఒరిజనాలిటిని ఒదిలేసి సినిమాలు రూపొందించటం మొదలుపెట్టారో అప్పటినుంచే ఈ అన్నదమ్ములు ఇక్కడ మార్కెట్ ని సైతం కోల్పోతున్నారు.

    చిన్న చిన్న దొంగతనాలు చేసుకు బ్రతికే అలెక్స్ పాండ్యన్(కార్తీ) కి ఓ ఎన్నారై బిజినెస్ మ్యాన్ అల్విన్ (మిలింద్ సోమన్) నుంచి ఓ ఆఫర్ వస్తుంది. హెల్త్ మినిస్టర్ కుమార్తె దివ్య(అనుష్క)ని కిడ్నాప్ చెయ్యాలని. పది లక్షలు కోసం ఆ టాస్క్ కి ఒప్పుకుని ఆమెను కిడ్నాప్ చేసి అడవులుకు వెళ్లిపోతాడు. అక్కడ ఆమెతో మెల్లిగా ప్రేమలో పడి మారతాడు. ఆ తర్వాత అసలు ఈ కిడ్నాప్ వెనక ఉన్న కుట్రను తెలుసుకుంటాడు. ఆ కుట్ర ఏమిటి... ఎలా ఛేథించాడు... వారి ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా కథ.

    తెలుగు వారు ఎనభైల్లో చూసిన సినిమాను ఇప్పటి టెక్నాలిజీ కలిపి వదిలినట్లున్న ఈ చిత్రం కథ, కథనాలు పరంగా పెద్దగా ఆసక్తి రేపదు. అయితే మొదటే చెప్పుకున్నట్లుగా సినిమాలో మాస్ ఎలిమెంట్స్, అనుష్క గ్లామర్, సంతానం కామెడీ అలరిస్తాయి. అవి విడివిడిగా చూసినంతవరకూ బాగానే ఉంటాయి. ఏక మొత్తంగా సినిమా రూపంలో చూడాలంటేనే ఇబ్బంది పెడతాయి. కార్తీ ఈ సినిమాలో పూర్తి మాస్ క్యారెక్టర్ తో చెలరేగిపోయాడు. అనుష్క కూడా తన అందాల ప్రదర్శనకు పెద్దగా మొహమాటపడలేదు. నిర్మాత కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రిచ్ గానే తీసాడు. అయితే సంగీత దర్శకుడు దేవి మాత్రం తన మార్క్ కి తగిన సంగీతం ఇవ్వలేకపోయాడు. మిగతా సాంకేతిక వర్గం... వంక పెట్టలేని విధంగా తమ పని చేసుకుపోయారు. అయితే కథ, కథన లోపమే వారి ప్రతిభను మరుగుపరిచేసింది.

    మిగతా రివ్యూ... స్లైడ్ షో లో..

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    అనుష్కకు తెలుగులో మంచి క్రేజ్ ఉండటం సినిమాకు ప్లస్ అయ్యి.. మంచి ఓపినింగ్స్ తెచ్చిపెట్టింది.

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    సినిమా మొత్తం కార్తీ భుజాలపై మోసాడంటే అతిశయోక్తి కాదు. యాక్షన్ సీన్స్ లో అయితే సూపర్బ్ అనిపిస్తాడు. కామెడీ సీన్స్ లోనూ తనదైన ఈజ్ చూపించాడు.

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    అనుష్క, కార్తీల మధ్య కెమిస్ట్రి ముఖ్యంగా పాటల్లో బాగా వర్కవుట్ అయ్యింది.

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    సంతానం మంచి టైమింగ్ తో చేసిన కామెడీ బాగా నవ్విస్తుంది. కానీ కొన్ని చోట్ల పంచ్ లు పేలలేదు.

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    సంతానం చెల్లెల్లుగా చేసిన అమ్మాయిలు కూడా మంచి ఫెరఫార్మెన్స్ తో అలరించారు. కాని విలన్ గా చేసిన మిలింద్ సోమన్ మాత్రం మైనస్ గా మారారు.

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    సినిమా ప్రమోషన్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఉపయోగపడినంతగా సినిమాకు ఉపయోగపడలేదు.

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    ఎస్‌.శరవణన్‌ కెమెరా వర్క్ సినిమాలో మలో హైలెట్. ఎడిటింగ్ కూడా బాగుంది.

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    సినిమా హైలెట్స్ లో మొదటిగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీన్స్... ముఖ్యంగా ఛేజ్ సన్నివేశాలు సినిమాకు ప్రాణంగా నిలిచాయి.

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    కథ విషయంలో తప్ప దర్శకుడు అన్ని విషయాల్లోనూ తన ప్రతిభ చూపించాడు.

    వెరీ.... ‘బ్యాడ్ బోయ్’ (రివ్యూ)

    బ్యానర్‌: స్టూడియో గ్రీన్‌
    నటీనటులు: కార్తీ, అనుష్క, సంతానం, సుమన్, మిలింద్ సోమన్ తదితరులు.
    సంగీతం: దేవిశ్రీప్రసాద్‌,
    ఫొటోగ్రఫీ: ఎస్‌.శరవణన్‌,
    మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి,
    కో-ప్రొడ్యూసర్స్‌: ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎన్‌.ఆర్‌.ప్రభు,
    నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా,
    దర్శకత్వం: సురాజ్‌.
    విడుదల తేదీ: మార్చి 22, 2013

    ఏదైమైనా రొటిన్ చిత్రాలు చూడటానికి అలవాటు పడిన వారు ఓ కాలక్షేప చిత్రంగా దీన్ని చూడవచ్చు. అయితే ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తే ఎక్కువ నిరాసపడే ప్రమాదం ఉంది.

    English summary
    Eight months after the release of Sakuni, Tamil actor Karthi has made his comeback to Tollywood with Alex Pandian Telugu version Bad Boy. This movie does not have a solid story, but its masala elements and rich production values are its strengths. Its biggest drawbacks are tried-and-tested story and predictable plot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X