twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5
    హైదరాబాద్: మూడేళ్ల క్రిందట మా అన్నయ్య బంగారం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో రాజశేఖర్ చాలా గ్యాప్ తీసుకుని 'మహంకాళి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన రాజశేఖర్‌కు 'అంకుశం' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా 'మహంకాళి' చిత్రం ఉంటుందని మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు.

    యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన 'మహంకాళి' చిత్రానికి కొన్ని కమర్షియల్ అంశాలు జోడించారు. ఈ చిత్రానికి జీవిత దర్శకత్వం వహించగా, రాజశేఖర్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఎస్ చిన్నా సంగీతం అందించారు. యేలూరు సురేందర్ రెడ్డి, ఎ. పరంధామ రెడ్డి నిర్మాతలు.

    కథలోకి వెళితే...
    మహంకాళి(రాజశేఖర్) ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. హైదరాబాద్ వరుస బాంబు పేలుళ్లలో పలువురు చనిపోతారు. ఈ కేసును డీల్ చేయడానికి మహంకాళిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా నియమిస్తారు. ఇన్వెస్టిగేషన్లో మహంకాళి అనేక విషయాలు తెలుసుకుంటాడు. హర్షద్ భాయ్(ప్రదీప్ రావత్) దుబాయ్ లో నివసిస్తూ హైదరబాద్లో తన అనుచరులైన జయక్క(నళిని), లడ్డూ లను ఉపయోగించుకొని దందా నడుపుతుంటాడు. మర్డర్లు సెటిల్ మెంట్లే కాక టెర్రరిజం పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలతో చేతులు కలిపి హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ లు చేస్తుంటడని తేలుతుంది. ఈ క్రమంలోనే తన విధినిర్వహణలో భాగంగా తనీషా(మధురిమ)ను కాపాడు తాడు. దీంతో ఆమె మహింకాళి ప్రేమలో పడుతుంది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా మహంకాళి జైలు కెలుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తర్వాతి కథ.

    మిగతా వివరాలు స్లైడ్ షోలో...

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    దర్శకురాలు జీవిత కొంత వరకు తన బాథ్యత బాగానే నెరవేర్చినా... పూర్తిగా సఫలం కాలేక పోయారు. ఫస్టాఫ్ ఫర్వాలేదు. సెకండాఫ్ బోరింగ్ గా ఉంటుంది.

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    యాంగ్రీ యంగ్ మేనర్ గా రాజశేఖర్ మరోసారి తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు.

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    హీరోయిన్ మధురిమ పాత్ర చిన్నది కావడంతో ఆమె నటనకు అవకాశం లేకుండా పోయింది. అయితే గ్లామర్ పరంగా ఆకట్టుకుంది.

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    ప్రదీప్ రావత్, సుప్రీత్, వినోద్ కుమార్, అన్నపూర్ణ, సలీమ్ పండా తమ పాత్రలకు తగిన విధంగా నటించారు.

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    ఎస్ చిన్సా సంగీతం ఆకట్టుకోలేక పోయినా... బ్యాగ్రౌండ్ సోరు మాత్రం బాగుంది.

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    యాక్షన్ సీన్లలో కొరియోగ్రఫీ బాగుంది.

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    పిక్చరైజేషన్ ఫర్వాలేదనిపించినా... ఎడిటింగ్ పై మరింత దృష్టి పెడితే బాగుండేది అనిపిస్తుంది.

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    ఓవరాల్ గా సినిమా ఎలా ఉందనే విషయానికొస్తే... యావరేజ్ మూవీ. కొత్త దనంలేని కథ, కథనం. ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే. అయితే రాజశేఖర్ అభిమానులకు మాత్రం కాస్త రుచిస్తుంది.

    ‘మహంకాళి’ మూవీ రివ్యూ...

    నిర్మాతలు: యేలూరు సురేందర్ రెడ్డి, ఎ. పరంధామ రెడ్డి
    దర్శకత్వం: జీవితరాజశేఖర్
    నట వర్గం: డాక్టర్ రాజశేఖర్, మధురిమ, ప్రదీప్ రావత్, సుప్రీత్, వినోద్ కుమార్, అన్నపూర్ణ, సలీమ్ పండా
    సంగీతం: చిన్నా
    విడుదల: మార్చి 8, 2013

    English summary
    Three years after the release of Maa Annayya Bangaram, Dr Rajasekhar, who is known as angry young man, has made a grand comeback with the Telugu movie Mahankali. The actor has already appeared in police getup in several movies but his role and performance in Ankusam (1990) has been the best so far. Many film goers were expecting his latest outing to be even better than Ankusam and it truly meets their expectations. Mahankali is an action entertainer with some commercial elements and Dr Rajasekhar's electrifying performance is the main attraction in the movie. S Chinna's music and background score, Jeevitha's interesting screenplay, wonderful picturisation, well-choreographed action and chase sequences are other highlights of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X