twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవ్వుతూ..భయపడతూ....('ప్రేమ కథా చిత్రమ్‌'రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    3.0/5

    ఈ రోజుల్లో, బస్ స్టాఫ్ చిత్రాల మారుతి చిత్రం అంటే అది పక్కా బూతు చిత్రం అని ఫిక్స్ అయిన వారికి,తానేంటో..తన అసలు టాలెంట్ ఏంటో చూపించాలని మారుతి ఫిక్సైనట్లున్నాడు. అందుకు తగినట్లుగా కొత్త జనర్ తీసుకుని, ద్వంద్వార్దాలు తగ్గించి(నిరాసపడొద్దు..అసలు లేకుండా పోలేదు).. తీసిన సినిమా ఇది. హర్రర్,కామెడీ మిక్స్ చేసిన ఈ సినిమా టిక్కెట్ గిట్టుబాటునిపిస్తుంది.

    సుధీర్(సుధీర్ బాబు),నందిత(నందిత),ప్రవీణ్(ప్రవీణ్) వీళ్లు ముగ్గరూ వేరు వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అవుతారు. వీళ్లంతా కలిసి ఊరు చివర ఉన్న ఓ గెస్ట్ హౌస్ కి వెళ్లి అఖ్కడ తామకు ఇష్టమైన విధంగా చనిపోవాలని అనుకుంటారు. ఈ ప్రాసెస్ లో వీళ్లకు మరో వ్యక్తి గిరి (గిరి)తోడవుతాడు.

    ఇక సుధీర్ తన గర్ల్ ప్రెండ్ మోసం చేయటంతో తను జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటాడు. అయితే నందిత అతన్ని సీక్రెట్ గా ప్రేమిస్తూంటుంది. ..ఆమెకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉండదు. దాంతో ఇది గమనించిన సుధీర్ ప్రెండ్ ప్రవీణ్ సలహాతో ఆమె అతని మైండ్ మార్చటానికి వస్తుంది. అక్కడ నుంచి ప్రవీణ్ సూసైడ్ టైమ్ ని ప్రొలాంగ్ చేయటానికి ప్రయత్నిస్తూంటాడు...నందిత...సుధీరక్ లో మార్పు తేవటానికి ప్రయత్నిస్తూంటుంది. టైమ్ తక్కువుంటుంది. ఈ లోగా ఓ ట్విస్టు..అదే కథని మలుపు తిప్పుతుంది... ప్రాణాలు పోగొట్టుకుందామనుకున్న వాళ్లు ప్రాణాలు రక్షించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. అప్పుడేమయింది అనేది మిగతా కథ.

    ఈ సినిమాకు స్క్రిప్టు ప్రాణమై నిలిచింది. మొదటి ఇరవై నిముషాలు టేకాఫ్ తీసుకునే పార్ట్ బోర్ అనిపించినా తర్వాత ఊపందుకుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో దయ్యిం వచ్చి నందితలో ప్రవేశించాక అసలు కథ మొదలయ్యింది. అక్కడ నుంచి కథ ఊపందుకుంది. ఎక్కడా బిగి సడలకుండా సీన్స్ అల్లుకున్నారు. అయితే క్లైమాక్స్ వీక్ చేసేసారు. కానీ అప్పటికే ప్రేక్షకులు సాటిస్ ఫై అయ్యే పరిస్ధితి ఉండటంతో ఇబ్బందిలేదు.

    మిగతా రివ్యూ... స్లైడ్ షో లో...

    నవ్వుతూ..భయపడతూ...

    సుధీర్ బాబు ...తన మొదటి చిత్రం కన్నా మెరుగైన నటన కనపరిచాడు. ముఖ్యంగా భయం, ఆశ్చర్యం వంటి ఎమోషన్స్ ని బాగా పలికించగలిగారు. అంతేకాదు తనకు డాన్స్ పై గ్రిప్ ఉన్నదని మరోసారి నిరూపించాడు.

    నవ్వుతూ..భయపడతూ....

    హీరోయిన్ నందిత..తన మొదటి చిత్రం నీకు ..నాకు డాష్ డాష్ లోనే అదరకొట్టింది. ఈ సినిమాలోనూ ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. తనకు ఇచ్చిన రోల్ కి వందకి వంద శాతం న్యాయం చేసిందనే చెప్పాలి.

    నవ్వుతూ..భయపడతూ....

    హర్రర్ సినిమాలకు సినిమాటోగ్రఫీ ముఖ్యం. దర్శకుడే ...ఛాయాగ్రాహకుడు కావటంతో కెమెరా వర్క్ చాలా బాగా కుదిరింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ని లేపింది. సౌండ్ మిక్సింగ్ సూపర్.

    నవ్వుతూ..భయపడతూ....

    ప్రవీణ్ గోదావరి యాసతో సినిమాని నవ్వులతో నింపాడు. అతను లేకపోతే సినిమా లేదన్నట్లుగా నిలిచాడు.

    నవ్వుతూ..భయపడతూ....

    మంచి ఎంటర్టైనర్ గా ప్రేమ కథా చిత్రం నిలుస్తుంది. డైలాగ్స్ కూడా హిలేరియస్ గా పేలాయి. ఇంటర్వల్ అయితే ఎవరూ ఊహించలేరు.

    నవ్వుతూ..భయపడతూ....

    దర్శకుడుగా ప్రభాకర్ రెడ్డి మొదటి చిత్రంతోనే మంచి డైరక్టర్ గా ప్రూవ్ అయ్యారు. 24 క్రాఫ్ట్ లను సమర్ధవంతంగా వినియోగించుకున్నాడు.

    నవ్వుతూ..భయపడతూ....

    లీడ్ క్యారెక్టర్స్ రెండింటిమధ్యా కెమిస్ట్రీ బాగా పండింది. ఇద్దరికీ ఇది రెండో చిత్రం అంటే నమ్మబుద్ది కాదు...అంతబాగా దర్శకుడు చేయించుకున్నాడు.

    నవ్వుతూ..భయపడతూ....

    నిరాశ పరచని థ్రిల్లర్ మిక్స్ చేసిన హర్రర్ కామెడీగా ఈ చిత్రం నిలిచిపోతుంది.

    నవ్వుతూ..భయపడతూ....

    బ్యానర్ :ఆర్.పి.ఎ. క్రియేషన్స్, మారుతీ టాకీస్
    నటీనటులు: సుధీర్ బాబు, నందిత, ప్రదీప్, హాసిక, అదుర్స్ రఘు, ఏలూరు శ్రీను, రణధీర్ తదితరులు .
    ఆర్ట్: గోవింద్,
    సంగీతం: జేబీ,
    ఎడిటింగ్: ఉద్ధవ్,
    నిర్మాతలు: మారుతి, సుదర్శన్ రెడ్డి,
    కథ-స్క్రీన్ ప్లే, మాటలు: మారుతి,
    సినిమాటోగ్రఫీ- దర్శకత్వం: జె. ప్రభాకర్ రెడ్డి.

    కాస్సేపు నవ్వుకోవటానికి ఈ చిత్రం మంచి ఆప్షన్...మిస్ చేసుకోవద్దు.

    English summary
    The film Prema Katha Chithram, an unexpected love story, from the first look, seems like a routine youngster love-story. But even from the first scene the film establishes itself to have quite a lot of action and thriller elements, justifying its tag line.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X