Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

‘అలియాస్ జానకి’ రివ్యూ..

Posted by:
Published: Friday, July 26, 2013, 16:20 [IST]

Rating:
1.5/5

హైదరాబాద్ : మెగా ఫ్యామిలీ బంధువైన వెంకట్ రాహుల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘పంజా' నిర్మాత నీలిమ తిరుమలశెట్టి నిర్మించిన చిత్రం ‘అలియాస్ జానకి'. దయా. కె దర్శకత్వం వహించిన ఈచిత్రం ఈ రోజు విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది విషయాన్ని సమీక్షిద్దాం...

జానకి రామ్(వెంకట్ రాహుల్) హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. తండ్రి(నాగబాబు) ఉపాధ్యాయుడు కావడంతో చిన్నప్పటి నుంచి జనకి రామ్ క్రమ శిక్షణగా పెరుగుతాడు. నీతిగా, న్యాయంగా ఉండే మనిషి. ఓసారి చైత్ర (అనీషా అంబ్రోసే) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది.

లాలాగుడలో పేదల భూములు కబ్జా చేసిన వాసుదేవ్ మైసా (శత్రు) అనే రౌడీతో జానకిరామ్ గొడవ పడతాడు. నీతికి, న్యాయానికి కట్టుబడి ఆ భూమి పేదలకే చెందాలని అతనికి వ్యతిరేకంగా పోరాడుతాడు. ఈ గొడవల కారణంగా చైత్ర అతనికి దూరం అవుతుంది. జానకి రామ్ అనేక సమస్యల్లో ఇరుక్కుంటాడు. సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్న జానకి రామ్ లైఫ్ లోకి ప్రియదర్శిని(శ్రీ రమ్య) ఎంటరవుతుంది. మరి ప్రియదర్శిని ఎవరు? వాసుదేవ్ మైసాను జానకి రామ్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది తర్వాతి కథ.

హీరో వరస్ట్...హీరోయిన్ బెస్ట్


హీరోగా పరిచయం అయిన వెంకట్ రాహుల్ పెర్ఫార్మెన్స్ పరంగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోయాడు. ముఖ్యంగా అతనిలో హీరో క్వాలిటీలే ఏ మాత్రం కనిపించలేదు. అయితే అయితే హీరోయిన్ అనీషా ఆంబ్రోసె మాత్రం గ్లామర్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. శ్రీరమ్య కూడా పర్‌ఫెక్టుగా తన పాత్రకు న్యాయం చేసింది. వెంకట్ రాహుల్ తండ్రి పాత్రలో నాగబాబు, జాయింట్ కమీషనర్ ముకుందం పాత్రలో తనికెళ్ల భరణి తమ తమ పాత్రల్లో ఇమిడి పోయారు.

దర్శకుడు విఫలం


సినిమాలోని ఇతర అంశాలను పరిశీలిస్తే సామాజిక దృక్పథం పరంగా చూస్తే కథాంశం బాగానే ఉంది కానీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను తెరకెక్కించలేక పోయాడు దర్శకుడు దయా.కె. స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకులను నిరాశ పరిచే విధంగా ఉంది. సినిమాలో అసలు ఎంటర్టెన్మెంట్ లేక పోవడం మరో మైనస్ పాయింట్.

ఈ విషయాల్లో ఓకే...


అయితే సినిమాలోని పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది. సినిమా ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారు. డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇవన్నీ బాగున్నా ప్రేక్షకులకు కావాల్సిన అసలు విషయం సినిమాలో లేదు. దీనికి తోడు సినిమా ఆద్యంతం స్లోగా సాగడం ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తుంది.

చివరగా చెప్పేదేమంటే..


ఫైనల్ గా ఈ చిత్రాన్ని పరమ బోరింగ్ చిత్రంగా చెపక తప్పదు. సామాజిక బాధ్యతలను సినిమాలో ఫోకస్ చేసినప్పుడు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం పాటు వినోదం పాళ్లు కూడా కలపాల్సి ఉంది. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకుని వచ్చిన వెంకట్ రాహుల్‌పై ఎంతోకొంత అంచనాలు ఉంటాయి. కానీ అతనే సినిమాకు పెద్ద మైనస్ అయి కూర్చున్నాడు.

నటీనటులు, సాంకేతిక విభాగం


బ్యానర్: సంఘమిత్ర ఆర్ట్స్
నటీనటులు: వెంకట్ రాహుల్, అనీషా అంబ్రోస్, శ్రీ రమ్య, నాగబాబు, తనికెళ్ల భరణి, శివ నారాయణ, భరణి శంకర్, శత్రు, వంశీ రెడ్డి, రమేష్ వేంపల్లి, మీనా కుమారి తదితరులు.
సంగీతం: శ్రావణ్
కెమెరా: సుజిత్ సారంగ్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
ఆర్ట్: హరి వర్మ
మాటలు: వంశీ కృష్ణ గద్వాల, వశిష్ట శర్మ, అర్జున్, సుమన్ చిక్కల
సహ నిర్మాత: విక్రమ్.ఎస్
సమర్పకుడు: తారా అరుళ్‌రాజ్
నిర్మాత: నీలిమ తిరుమలశెట్టి
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దయా.కె

English summary
Telugu action-drama Alias Janaki released today. Directed by debutant Dayaa K, Alias Janaki features Rahul Venkat and Anisha Ambrose in the lead roles. Alias Janaki has nothing for anyone.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice