twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూస్తే లాస్ ...('అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.0/5

    ఇప్పుడొస్తున్న సినిమాల్లో కాస్త మసాలా ఉంటే కానీ ఆడదేమో అనే డౌట్ దర్శక,నిర్మాతలకు పట్టుకుంది. అందుకు తగ్గట్లుగా యూత్ పేరు చెప్పి బూతు సినిమాలు వస్తున్నాయి. కొద్దో గొప్పో పేరు ఉన్న హీరోలు సైతం ఈ తరహా సినిమాలు ఆడటంతో ఇదే రూట్ లో ప్రయాణం పెట్టుకుంటున్నారు. తాజాగా వరణ్ సందేశ్... రొమాన్స్ ని రంగరిస్తూ ...చేసిన ప్రయోగం భాక్సాఫీస్ వద్ద వికటించింది. లవ్ స్టోరీలలో చూసిన వరుణ్ సందేశ్ ని ఈ తరహా చిత్రాలలో చూడటానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదు.

    దానికి తోడు వరుణ్ సందేశ్ నటించిన సినిమాలు మొహమాటం లేకుండా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొడుతూ...భాక్స్ లు వెళ్తూన్నాయి. అయితే ఎలాగైనా హిట్ కొట్టి తిరిగి తన గత వైభవాన్ని పొందాలని వరుణ్ సందేశ్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలా వరుణ్ సందేశ్ అమాయకుడి పాత్రలో, 'పిల్ల జమిందార్' ఫేం హరిప్రియ వేశ్యగా, ఫుల్ మాస్ పాత్రలో చేసిన సినిమా 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్'. హీరోయిన్ మంచి మార్కులే వేయించుకుంది కానీ ఫలితం లేదు.

    హాలీవుడ్ చిత్రం ప్రెట్టీ వుమెన్ స్పూర్తితో వచ్చిన ఈ చిత్రం ఓ వేశ్యకి, హీరోకి మధ్య జరగే కథగా సాగుతుంది. హీరోయిన్ కాస్త హుషారుగా సీన్స్ ని పరుగెత్తించే ప్రయత్నమైతే చేసింది కానీ...హీరో అదే డల్ ఫేస్ తో రొటీన్ ఎక్సప్రెషన్ తో వచ్చి రాని తెలుగుతో...అసలు ఆకట్టుకోలేకపోయాడు. దర్శకుడు సైతం కథ,దర్శకత్వం రెండు విషయాల్లోనూ దారుణంగా ఫెయిలయ్యాడు. ఎక్కడా కథకు అవసరమైన ఫీల్ వర్కవుట్ చెయ్యలేకపోయాడు. మిగతా డిపార్టమెంట్ లు దానికి తగినట్లే సాగాయి.

    కథ,మిగతా రివ్యూ...స్లైడ్ షోలో...

    కథేంటి...

    కథేంటి...

    చిన్నప్పటినుంచీ తల్లితండ్రులు లేకపోవటంతో భామ్మ(శ్రీ లక్ష్మి) దగ్గరే పెరిగిన శ్రీ(వరుణ్ సందేశ్) కి పెంపక లోపంతో అమ్మాయిలు అంటే భయం. వారని చూస్తే పారిపోతూంటాడు. అలాంటి శ్రీకి అంజలి అనే అమ్మాయి ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్దితులు ఏర్పడతాయి. అప్పటివరకూ అమ్మాయిలకు దూరంగా ఉండే శ్రీ ...ఈ పెళ్లిలోపు తనకు అమ్మాయిలంటే ఉన్న భయం పోగొట్టుకోవాలి ఫిక్స్ అవుతాడు. అందుకోసం కొద్ది రోజులు ఒకమ్మాయితో గడపాలనుకుంటాడు. ఆ క్రమంలో నీరు(హరిప్రియ)ని కలుస్తాడు. ఆమె ఓ వేశ్య. కాంట్రాక్ట్ మీద కొన్ని రోజులు తన ఇంటికి తెచ్చుకుంటాడు. తర్వాత శ్రీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఏమిటా మార్పులు అనేది మిగతా కథ.

    హరిప్రియ షో...

    హరిప్రియ షో...

    ఈ చిత్రం హరిప్రియ షో అనే చెప్పాలి. సినిమాని ఆ కాస్సేపయినా చూడగలిగామంటే దానికి హరిప్రియ ఫెరఫార్మెన్స్, అందం కారణం అని చెప్పుకోవాలి. ఈ సినిమా ద్వారా ఆమె మరిన్ని మంచి పాత్రలు సాధించే అవకాసం ఉంది. వరుణ్ సందేశ్ కు ప్లస్ కాకపోయినా హరిప్రియకు మాత్రం ఈ సినిమా బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా ‘మై హూనా' పాటలో అదుర్స్ అనిపించింది. మొదటి నుంచి వేశ్య పాత్రలో కనిపించి చివరిలో సంప్రదాయ లుక్ లో కూడా ఆడియన్స్ ని మెప్పించింది.

    మిగతా పాత్రలు..టెక్నీషియన్స్

    మిగతా పాత్రలు..టెక్నీషియన్స్

    శ్రీనివాస్ రెడ్డి ఒకరి రెండు సార్లు నవ్వించడానికి తనవంతు ప్రయత్నం చేసాడు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా తమ పరిధిలో రక్తి కట్టించారు. కాశీ విశ్వనాధ్ సైతం తన పాత్రలో ఒదిగిపోయారు. కహాని చిత్రం గుర్తు చేసే ఆ పాత్ర సినిమాకు మాత్రం పెద్ద ఉపయోగపడలేదు. సినిమాలో పెద్ద విషయం లేకపోవటమే మైనస్ గానీ ఆర్టిస్టులు లోపం ఏమీ లేదు. టెక్నికల్ గా ఓకే. కెమెరా వర్క్ అద్బుతం కాదు కానీ బాగానే ఉంది. ఎడిటింగ్ మరింత ట్రిమ్ చేసి ఉంటే ప్రేక్షకులుకు కాస్త శ్రమ తప్పేదనిపిస్తుంది.

    ఐటం సాంగ్ బాగుంది

    ఐటం సాంగ్ బాగుంది

    ‘లిరిల్ సోపుతో' ఐటెం సాంగ్ లో కౌష తన అందాలతో ముందు బెంచ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అలాగే ‘మనసులోన' పాటని గోవా లోని అందమైన లోకేషన్స్ లో బాగా షూట్ చేసారు. మిగతా పాటలు సోసోగా ఉన్నాయి. మొదట్లో వరుణ్ సందేశ్ చిత్రాల్లో పాటలు బాగుండేవి. రాను రాను ఆ విభాగాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనపడటం లేదు.

    ఈ చిత్రం టీమ్ ఇదే..

    ఈ చిత్రం టీమ్ ఇదే..

    నటీనటులు : వరుణ్ సందేశ్, హరిప్రియ,కాశీ విశ్వనాథ్ ..తదితరులు
    మాటలు: సాయికృష్ణ,
    పాటలు: భాస్కర్ భట్ల,
    సంగీతం: శేఖర్ చంద్ర,
    ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కౌషన్ మహ్మద్ సిద్దిఖి,
    లైన్ ప్రొడ్యూసర్: అనిల్ కుమార్.ఎమ్.,
    సహ నిర్మాతలు: శేఖర్ క్యాదారి, కె.వి.ఆర్. కుమార్ (రఘు)
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోనేటి శ్రీను.
    నిర్మాత: లక్ష్మణ్ కేదారి,

    English summary
    Varun Sandesh who was last seen in Chammak Challo, has pinned lot of hopes on his latest outing Abbai Class Ammayi Mass (ACAM) relesed with negitive talk. Directed by Koneti Srinu, the movie has a cliched storyline. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X