twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నక్సలిజమే కాదు...నవ్వులు కూడా! (దళం రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    హైదరాబాద్ : అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర తెలుగులో నటించిన రెండో చిత్రం 'దళం'. నక్సలిజం బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈచిత్రంలో పియా బాజ్‌పాయ్ హీరోయిన్. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం విశేషాలేమిటో చూద్దాం...

    పీడిత జనానికి ఏదైనా చేద్దామనే లక్ష్యంతో శత్రు(కిషోర్), అభి(నవీన్ చంద్ర) నక్సలైట్లోకలుస్తారు. నాగబాబు నేతృత్వంలోని దళంలో పని చేస్తుంటారు. ఈ క్రమంలో పోలీసుల ఎన్‌కౌంటర్లో అంతా పిట్టల్లా రాలిపోతుంటారు. పిరికి పందలు, సహాయగుణం లేని ఈ జనం కోసం పోరాడటం వ్యర్థమని వాదిస్తాడు శత్రు. ఇష్టం లేకుంటే వెళ్లిపోండని నాగబాబు చెప్పడంతో....శత్రు, అభి, మరికొందరు(తాగుబోతు రమేష్, కృష్ణుడు, దన్ రాజ్ తదితరులు) లొంగిపోతారు. కోర్టు వారికి సాధారణ జైలు శిక్ష విధిస్తుంది. శిక్ష పూర్తయిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోదామనే ఆశతో ఉంటారంతా...

    ఈలోపే వీరిలో ఒకరిని పోలీసులు చంపేస్తారు. ఎందుకు చంపేసారని ప్రశ్నిస్తే పాతకక్షలు... మిమ్మలి కూడా రోజుకొకరి చొప్పున చంపేస్తాం అంటూ బెదిరిస్తాడు ఇన్స్‌స్పెక్టర్. ఈ లోగా వీరి తరుపు లాయర్ వచ్చి బెయిల్ పై విడుదలైన దళం సభ్యుల్లో ఒకరిని నక్సలైట్లు చంపేసారనే విషయం తెలియజేస్తాడు.

    జైల్లో ఉంటే పోలీసులు, బయటకి వెళితే నక్సలైట్లు....ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డీజీపీ వీరికి ఒక ఆఫర్ ఇస్తాడు. డీజీపీ చెప్పిన ప్రకారం పోలీసు డిపార్ట్‌మెంట్ లీగల్‌గా చేయలేని పనులను చేస్తుంటారు. డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు డిపార్ట్ మెంట్‌కు తలనొప్పిగా మారిన క్రిమినల్స్‌ను చంపేస్తుంటారు. అయితే లోకల్ ఎమ్మెల్యే అయిన జెకె(నాజర్) వీరిని సొంత పనులకు వాడుకుంటాడు. దీంతో శత్రు గ్యాంగ్ ఇబ్బందుల్లో పడుతుంది. ఓ డీల్ విషయంలో శృతి(పియా) తండ్రి శత్రు గ్యాంగ్‌కు హ్యాండ్ ఇచ్చి డబ్బుతో పారిపోతాడు. దీంతో శృతిని కిడ్నాప్ చేసి తమ వద్ద బంధిస్తారు శత్రు గ్యాంగ్.

    అప్పుడే సిటీలోకి ఎంటరైన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ లడ్డా(అభిమన్యుసింగ్) శత్రు గ్యాంగ్‌లో ఇద్దరి లేపేస్తాడు. శత్రు గ్యాంగ్ మనకు అనుకూలంగా పని చేస్తున్నారని డీజీపీ చెప్పినా లడ్డా వినిపించుకోడు. జెకె కారణంగా శత్రు గ్యాంగ్ మరింత ఇబ్బందుల్లో పడుతుంది. చివరకు గవర్నమెంట్ వీరిపై షూటింగ్ ఆర్డర్స్ జారీ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో శత్రు గ్యాంగ్ ఏం చేసింది? అనేది తర్వాతి కథ.

    నవీన్ చంద్ర పాత్రకు తగిన విధంగా సీరియస్‌, ఎమోషనల్‌గా నటించి ఆకట్టుకున్నాడు. పియా బాజ్‌పాయ్ పాత్ర నిడివి తక్కువే అయినా కీలకమైన పాత్రలో ఉన్నంతలో ఆకట్టుకుంది. గ్యాంగ్ లీడర్ శత్రు పాత్రలో కిషోర్ సినిమా మొత్తం ఒకే ఎక్స్‌ప్రెషన్ సీరియస్‌గా కనిపించాడు. ఆ పాత్ర తీరు కూడా అంతే. యాదగిరి అలియాస్ యాదవ్ పాత్రలో తాగు బోతు రమేష్, ఎకె 47 పాత్రలో ధన్ రాజ్, వంటోడు భద్రం పాత్రలో కృష్ణుడు మంచి కామెడీ పండించారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ లడ్డా పాత్రలో అభిమన్యు సింగ్ పర్ ఫెక్ట్‌గా సూటయ్యాడు. జర్నలిస్టు పాత్రలో సాయి కుమార్ మంచి పాత్రలో కనిపించినప్పటికీ...అతని పెర్ఫార్మెన్స్‌కు అవకాశం లేకుండా పోయింది. ఎమ్మెల్యే జెకె పాత్రలో నాజర్ తన పాత్రకు తగిన విధంగా నటించారు.

    టెక్నికల్ అంశాల విషయానికొస్తే...కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లాంటి కీలక విభాగాలను సమన్వయం చేస్తూ తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా జీవన్ రెడ్డి మంచి మార్కులు కొట్టేసాడు. ఒకసారి తుపాకి పట్టిన తర్వాత దాన్ని వదులుదామన్నా అది వారిని వదలదు అనే పాయింటుని సీరియస్‌గా చెబుతూనే ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా ఎంటర్టెన్మెంట్ జొప్పించి సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌తో పోల్చుకుంటే సెకండాఫ్‌లో సినిమా స్లో అయింది. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని అధిగమనిస్తే దర్శకుడికి మంచి భవిష్యత్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ ఓకే.

    చివరగా చెప్పేదేమంట....
    నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌ కాబట్టి కేవలం సీరియస్ నెస్సే కాకుండా స్క్రీన్ ప్లేలో ఎంటర్టెన్మెంట్ జోడించడం వల్ల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది

    English summary
    Naveen Chandra, who turned actor with SS Rajamouli's maiden production Andhala Rakshasi, is back with his second movie Dalam, which hit the marque on August 15. The actor is at his best again and sure to rock the film goers with his electrifying performance in his latest outing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X