twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎగరటం కష్టమే ( ‘గాలిపటం’రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5

    ---- సూర్య ప్రకాష్ జోశ్యుల

    యూత్ ని టార్గెట్ చేస్తూ వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు...వారు తీసుకుంటున్న బోల్డ్ స్టెప్ లు,వాటి పర్యవసనాలు, సమాజం వాటికి స్పందించే తీరు వీటిన్నటినీ చర్చిస్తూ సినిమా అంటే ఆసక్తికరమే. అయితే ఇలాంటి మోడ్రన్ టచ్ ఉన్న కథలని అంతకన్నా మోడ్రన్ మేకింగ్ తో చెప్పాల్సి ఉంటుంది. అయితే దర్శకుడు దానికి రివర్స్ లో వెళ్లి పేద రాసి పెద్దమ్మ కథలాగ ఎక్కడక్కడకి సబ్ ప్లాట్ లు ఇరికిస్తూ..ప్రతీ క్యారెక్టరూ ప్రాసతో కూడిన పంచ్ డైలాగులు వేస్తూ... సాధ్యమైనంత సాగతీస్తూ... షార్ట్ ఫిలిం కూడా కాకుండా టెలీఫిలిం చూస్తున్న ఫీల్ తీసుకువచ్చాడు. ఇప్పటి యూత్ అంటే కేవలం ఎప్పుడూ తాగుతూంటారు...బ్రేకప్ లు చేసుకుంటూంటారు అనే భావన మాత్రం కలిగించగలిగాడు. దానికి తోడు సినిమా సెకంఢాఫ్ ఎత్తుకున్న కథకు సీన్స్ లేక కామెడీ పేరుతో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగ స్కిట్ లు పేర్చుకుంటూ పోయి ప్రేక్షకుడు సహనానికి పరీక్ష పెట్టాడు. ఈ సినిమాలో కొద్దో గొప్పో బాగున్న అంశం...అక్కడక్కడా పేలిన డైలాగులు...సినిమా బేసిక్ ప్లాట్ మాత్రమే.

    తాము బెస్ట్ కపుల్ గా సెలక్ట్ అయిన సందర్బంగా కార్తీక్(ఆది),శ్వేత(ఎరికా ఫెర్నాండెజ్)లు సెలబ్రేట్ చేసుకుంటూంటారు. ఆ సందర్బంలో ఇద్దరూ బాగా తాగి చిన్న మాట తేడా తో తమ గతాలను, గతం తాలూకు 'ఆ' అనుభవాలను బయిటపెట్టుకుంటారు. ఆ రాత్రి బాగా ఆలోచించి...తమ మధ్యన ప్రేమ లేనప్పుడు పెద్దలుకోసం కలిసి ఉండటం అనవసరమని నిర్ణయించుకుని విడిపోవటం ఉత్తమం అని తీర్మానించుకుని విడాకులుకు అప్లై చేసి, తమ పాత ప్రేమలకు ఆహ్వానం పలుకుతారు. ఆ పైన ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్ ప్లే అందించిన సంపత్ నంది...తొలి చిత్రం ఏమైంది ఈవేళ కూడా ఇలాంటి కాన్పెప్ట్ తోనే హిట్ కొట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆ సినిమాకు రాసుకున్న మరో వెర్షన్ లా ఈ గాలిపటం కథ అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా ఒకే పాయింట్ మీద వెళ్లకుండా రకరకాల విషయాలను తలకెత్తుకోవటంతోనే కన్ఫూజన్ స్టార్టైంది. పెళ్లికి ప్రేమలు...పెళ్లయ్యాక ఏర్పడే అక్రమ సంభందాలు, సిటీలో గే కల్చర్, వయస్సులో పెద్దవాళ్లను పిల్లలు వదిలేసి వెళ్లిపోవటం ఇలా లెక్కకు మించిన ఎలిమెంట్స్ ని ఒకే కథలో ఇమిడ్చి చెప్పాలన్న తాపత్రయమే ఈ కథను పూర్తిగా దెబ్బకొట్టింది. దాంతో ఏ పాయింటూ మీదా డెప్త్ కు వెళ్లిలేక సీరియస్ లేని సీరియస్ సినిమాగా మారిపోయింది. ముఖ్యంగా దర్శకుడు ఈ కథని తెరకెక్కించటంలో విఫలమయ్యాడనిపించింది. స్లో నేరేషన్, ఎప్పుడు చూసినా పాత్రలు మాట్లాడుకుంటూ ఉండటం వంటివి సాధ్యమైనంత తగ్గించుకోవాల్సింది.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    హీరో

    హీరో

    ఆది ఏం చూసి ఈ పెళ్లైన హీరో కథ ఒప్పుకున్నాడా అని అనుమానం వస్తుంది. అతను ఎక్కడా తన నటనను చూపించించుకోవటానికి అవకాసం లేదు. అతనూ ట్రై చేయలేదు. ఎంతసేపూ చిరంజీవిని ఇమిటేట్ చేయటానికి చేసే ప్రయత్నమే కానీ ఆయనలా డైలాగు మాడ్యులేషన్ లో వేరియేషన్ చూపిద్దాం, బాడీ లాంగ్వేంజ్ తో కన్వీన్స్ చేద్దాం వంటివి మొహమాటానికి కూడా పెట్టుకోలేదు.

    హీరోయిన్స్

    హీరోయిన్స్

    వీరి విషయానికి వస్తే నో కామెంట్స్..హీరోయిన్స్ అని అనుకోవాలి తప్పితే మనం ఫీలవటానికి ఏమీ లేదు.(పెద్ద మైనస్)

     సంగీతం

    సంగీతం

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజితో సహా అంతా దారుణంగా ఇచ్చాడు. కేవలం కైలాస్ ఖేర్ పాడిన పాట మాత్రం మినహాయింపు.

    సినిమాటోగ్రఫీ

    సినిమాటోగ్రఫీ

    ఏదో బిసీ కాలంనాటి సినిమా చూస్తున్న ఫీలింగ్ తీసుకురావటంలో సఫలీకృతులయ్యాడు. (భయ్యా ఇది డిజిటల్ యుగం...నువ్వు వాడింది డిజటల్ కెమెరా)

    కథ,స్క్రీన్ ప్లే, డైలాగులు

    కథ,స్క్రీన్ ప్లే, డైలాగులు

    ఎత్తుకున్నకథ బాగానే ఉన్నా దానికి అల్లుకున్న కథనం, ఆ కథనానికి వాడిన విపరీతమైన ప్రాసతో కూడిన మాటలు అబ్బో... మాటల్లో చెప్పలేము

    దర్సకత్వం

    దర్సకత్వం

    కథ,స్క్రీన్ ప్లే, డైలాగులు ఈ రేంజిలో ఉన్నప్పుడు ఆయనేం చేయగలరు. బ్యాడ్

    నిర్మాణ విలువులు

    నిర్మాణ విలువులు

    ఎంత చీప్ గా చుట్టాద్దామనే ఆలోచనే తప్ప...కనీసం ఈ నిర్మాణ విలువలతో అయినా ప్రేక్షకుడుని రంజింప చేద్దాం అన్న ఆలోచన ఎక్కడా లేనట్లు తీసారు

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    బ్యానర్: సంపత్‌నంది టీమ్‌ వర్క్స్‌
    నటీనటులు: ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, పోసాని కృష్ణమురళి, భరత్‌రెడ్డి, కార్తీక్, ప్రాచి, సప్తగిరి, చంద్ర, దువ్వాసి, శివన్నారాయణ, హేమ, ప్రగతి, శకుంతల, గీతాంజలి తదితరులు
    కెమెరా: బుజ్జి,
    సంగీతం: భీమ్స్,
    నిర్మాతలు: సంపత్‌నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి,
    కథ,స్క్రీన్ ప్లే మాటలు :సంపత్ నంది
    దర్శకత్వం: నవీన్ గాంధి.

    ఫైనల్ గా...చెప్పాలనుకున్నది తిన్నగా చెప్పకుండా...నానా చెత్తా చెదారం కలిపి , ఇలా వంకర టింకరగా చెప్తే..ప్రేక్షకుడు మన బెండు తీసి డిక్కీలో తొంగో పెట్టేయగలడు

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Aadi is trying his luck again with ‘Gali Patam’. But It failed to make its mark. The farfetched drama is what made the film unpalatable for the audience. could have definitely left an impression if the writing was not so ground level and if the two main leads could have acted better. The bottom line is that a good lot of potential has been wasted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X