twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాంటిక్ బాణి ("రాజా రాణి'' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను... రీమేక్ చేస్తే ఒరిజినల్ లో ఉన్న ఫీల్ మిస్సవుతుంది అని భావించినప్పుడు కానీ, బడ్జెట్ పరంగా అంత పెట్టి నిర్మించలేని స్ధితిలో కానీ తెలుగులో డబ్ చేసి వదలుతూంటారు. అయితే అక్కడ హిట్టైన డబ్బింగ్ అయి వచ్చిన ప్రతీ చిత్రం ఇక్కడ వర్కవుట్ అవుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే మన భావోద్వేగాలు,సంప్రదాయాలు వేరు...కానీ కొన్ని భాష,ప్రాతాలకు అతీతమైన కథ,కథనాలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా అవి సంచలన విజయం సాధించి,మరిన్ని డబ్బింగ్ లకు ప్రోత్సాహానిస్తూంటాయి.

    దానికి తోడు ఆ డబ్బింగ్ లలో తెలిసున్న ఫేస్ లు ఉంటే మరీను...తమిళంలో యాభై కోట్లు సాధించిన సినిమా, హాలీవుడ్ ఐదు వందల కోట్లు కొల్లగొట్టిన చిత్రం అంటూ పబ్లిసిటీ హోరిత్తించి మరీ స్ట్రైయిట్ సినిమాలకు పోటీగా వదిలి ఓపినింగ్స్ రాబడుతూంటారు. అదే కోవలో వచ్చిన ఈ "రాజా రాణి'' ట్రైలర్స్ ఆకట్టుకునే లా ఉండటం, నయనతార వంటి స్టార్ హీరోయిన్ ఉండటం ప్లస్ అయ్యింది. దర్శకుడు మురగదాస్ ప్రమోషన్ కూడా ఇక్కడ అందరినీ ఈ చిత్రం వైపుకు చూసేలా చేసింది. ఆర్య ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు అలవాటు పడుతున్నాడు. తమిళ కమిడియన్ సంతాకం కూడా తెలుగు డబ్బింగ్ లతో మెల్లిగా ఫిమిలియర్ అవుతున్నాడు. దాంతో వీరిని కలిపి రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు వారికి సైతం నచ్చేటట్లే కనపడుతోంది. పెద్ద అరవ అతి లేకుండా తీర్చి దిద్దిన ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకులును ఆకట్టుకునే విధంగా ఉంది.

    కొత్తగా పెళ్లైన జేమ్స్(ఆర్య),రెజీనా(నయనతార) కి ఒక్క క్షణం కూడా పడదు. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దవి చేసి అంటీ ముట్టనట్లు మసులుతూంటారు. ఈ క్రమంలో ఓ రోజు జేమ్స్ తాగి ఇంటికి వచ్చినప్పుడు రెజీనా ఫిట్స్ తో బాధపడుతూ కనపడితుంది. దాంతో ఆమెను వెంటనే హాస్పటిల్ లో జాయిన్ చేస్తాడు. డాక్టర్ ఆమె మెడికల్ హిస్టరీ గురించి అడిగినప్పుడు ...ఆమె గురించి తనకేమీ తెలియదనే విషయం అర్దం చేసుకుంటాడు. దాంతో ఆమెతో తొలిసారి మనస్సు విప్పి మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఆమె గతం లో ఉన్న ఫెయిల్యూర్ ప్రేమ కథ తెలుసుకుంటాడు. ఆమె తనతో ఎందుకు అంటీ ముట్టనట్లు ఉంటోందో అర్దం చేసుకుంటాడు. చలించిన జేమ్స్ కూడా తన విఫల ప్రేమ కథను ఆమెకు చెప్పి ఓదారుస్తాడు. ఇలా ఇద్దరూ తమకు వేరు వేరు ఫెయిల్యూర్ ప్రేమ కథలు ఉన్నాయని తెలుసుకున్నాక వీరిద్దరి జీవితంలో ఏం మార్పు వచ్చింది. వారి కాపురం చక్కబడిందా అనేది మిగతా కథ.

    మిగతా రివ్యూ స్లైడ్ షో లో..

    లైటర్ వీన్ నేరేషన్ తో...

    లైటర్ వీన్ నేరేషన్ తో...

    ప్రియురాలిని కోల్పోయిన హీరో, ప్రియుడిని కోల్పోయిన హీరోయిన్ వీరిద్దరికి అనుకోని పరిస్థితిలో పెళ్ళి జరుగుతుంది. వారి పాత ప్రేమలను మరచి పోలేని వారిద్దరి మధ్య దాంపత్య జీవితం ఎలా సాగింది అనే కథ చెప్పుకోవటానికి పెద్ద గొప్పగా అనిపించకపోయినా దర్శకుడు చాలా జాగ్రత్తగా లైటర్ వీన్ నేరేషన్ తో ఫన్ ఎలిమెంట్స్ తో దాన్ని తీర్చి దిద్ది విజయం సాధించాడు.

    సెంటిమెంట్ ప్లే...

    సెంటిమెంట్ ప్లే...

    ఊహకు అందే కథే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం తయారుచేసుకోవటంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తితో తెరకెక్కించాడు. అన్యోన్యత కోల్పొయిన భార్య భర్తల మధ్య సాగే సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. రొటీన్ గావస్తున్న చిత్రాలకు చాలా భిన్నంగా ఈ రాజా రాణి చిత్రం ఉంది. స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టుబుల్ గా నడిచింది. సినిమా ప్రారంభమైన పది నిముషాలకే క్లైమాక్స్ ఊహించేటట్లు ఉంది. అయితే సీన్స్ తో ఆ లోటు తెలియనీయకుండా చేసాడు.

    దర్శకుడు...

    దర్శకుడు...

    మేకింగ్ పరంగానూ దర్శకుడు ప్రతీ ఫ్రేమ్ ని కలర్ ఫుల్ గా తీర్చి దిద్దాడు. చాలా చోట్ల విజువల్స్ చాలా రిచ్ గా ఉండి...దర్శకుడు,కెమెరామెన్ పనితనంని పట్టిస్తాయి. సినిమా హైలెట్స్ లో విజువల్ సెన్స్ తో తీసిన సీన్స్ ఒకటి.

    పోటీపడి...

    పోటీపడి...

    నటన పరంగా ఆర్య,నయనతార పోటీ పడి నటించారనే చెప్పాలి. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తగా,ఫ్లాష్ బ్యాక్ లో ఓ అమ్మాయి వెనక పడే ప్రేమికుడుగా అతను చాలా బాగా చేసాడు. నయనతార ఫ్లాష్ బ్యాక్ సైతం చాలా బాగా డీల్ చేసాడు. మిగతా ఇద్దరు నజ్రియా,జై కూడా నయనతార, ఆర్యలని డామినేట్ చేసే విధంగా చేసి ఆకట్టుకున్నారు. నయనతార తండ్రిగా సత్యరాజ్, సంతానం ఓకే. సంతానం కామెడీనే పెద్దగా లేదు.

    క్లైమాక్స్ లో...

    క్లైమాక్స్ లో...

    ఏ సినిమాకైనా చివరి ఇరవై నిముషాలు ప్రాణం అనిచెప్తూంటారు. అదే విషయం ఈ దర్శకుడు వంటబట్టించుకున్నాడు. సినిమా క్లైమాక్స్ బాగా పాతగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లే హీరో,హీరోయిన్స్ తో ప్లాన్ చేసినా చాలా బాగా పండింది. అలాగే చిన్న పాటి ట్విస్ట్ ను కూడా అమర్చి దర్శకుడు తనవైపుకి తిప్పుకున్నాడు. ప్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ స్టోరీలు కూడా చాలా ఫ్రెష్ గా ఉండటం ఫ్లస్ అయ్యింది.

    సంగీతం...

    సంగీతం...

    సంగీతం పరంగా మైనస్ అయ్యింది. పాటలు ఏవీ ఇంప్రెసివ్ గా లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. కొన్నిసార్లు అసలు ఆ పాటలు లేకుండా బాగుండును అనిపిస్తుంది.

    కామెడీ తక్కువే...

    కామెడీ తక్కువే...

    సౌత్ లో ఇప్పుడు కామెడీ ట్రెండ్ నడుస్తోంది. కామెడీనే ఎంటర్టైన్మెంట్ అని భావిస్తే అది తక్కువనే చెప్పాలి. అయితే దర్శకుడు ఎక్కడా లోటు రానివ్వకుండా నడుపుతాడు. సంతానం పెద్దగా ఉపయోగపడలేదు.

    సాంకేతికంగా...

    సాంకేతికంగా...

    సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మొదటే చెప్పుకున్నట్లు సినిమా హైలెట్స్ అదే మెయిన్ గా చెప్పుకోవాలి. ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని చోట్ల బోర్ మూమెట్స్ ని ఎందుకు వదిలేసాడా అనిపిస్తుంది. డైలాగులు బాగున్నాయి. డబ్బింగ్ లాగ కనిపించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.

    నిర్మాణ విలువలు...

    నిర్మాణ విలువలు...

    చిత్రం కాన్సెప్టు తగ్గట్లుగా చాలా రిచ్ గా తీయటంలో ఎక్కడా రాజీ పడలేదని అర్దమవుతుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు చాలా ఆకట్టుకునేలా తీయటంలో సఫలీకృతులయ్యారని చెప్పాలి.

    తెర వెనక,ముందు

    తెర వెనక,ముందు

    సంస్థ: ట్వంటీ యత్ సెంచరీ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
    నటీనటులు: ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీమ్, సత్యరాజ్, సంతానం, మనోబాల, సత్యన్, ధన్య బాలకృష్ణన్ తదితరులు
    ఛాయాగ్రహణం: జార్జి సి. విలియమ్స్,
    పాటలు: అనంత శ్రీరామ్
    కూర్పు: ఆంథోనీ ఎల్. రూబెన్,
    స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్.
    సంగీతం: జీవీ ప్రకాశ్
    సమర్పణ: ఎ.ఆర్. మురుగదాస్
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అట్లీ కుమార్
    విడుదల తేది: 14,మార్చి 2014

    ఫైనల్ గా ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోకపోయినా మల్టిప్లెక్స్ ,ఎ సెంటర్లలను వారికి నచ్చే అవకాసం ఉంది. ఎక్కడా అసభ్యత,హింస లేని ఈ చిత్రం ఫ్యామిలీస్ కు కూడా మంచి ఆప్షనే.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Raja Rani is romantic comedy entertainer and lead actors' performances are the main attractions in the film. Released in theatres across Andhra Pradesh today (March 14), it will also win the heart of film goers in the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X