twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్క్రీన్ ప్లే ‘మాయ’కానీ... (రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    మనుషుల్లో వుండే అతీంద్రియ దృష్టి (ఇఎస్‌పి- ఎక్స్‌ట్రా సెన్సరీ పెర్‌సెప్షన్) చుట్టూ అల్లిన కథలు మనకు తెలుగులో చాలా చాలా అరుదు. హాలీవుడ్ లో రెగ్యులర్ గా వచ్చే ఇలాంటి కాన్సెప్టు ఫిల్మ్ లు ఇక్కడ తీయటానికి ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో మనకు ఇక్కడ రావటం లేదు. అయితే నీలకంఠ ఇలాంటి అరుదైన కథతోనే ముందుకు వచ్చారు. దానికి తగ్గ స్క్రీన్ ప్లే ను సమకూర్చుకున్నారు. ఫస్టాఫ్ సోసో గా అనిపించినా క్లైమాక్స్ ...చివరి ఇరవై నిముషాలు తమ మ్యాజిక్ చేసి చివరి వరకూ కూకర్చోబెట్టారు. అయితే ఇలాంటి థ్రిల్లింగ్ కథాంశాలకు పాటలు మధ్యలో వచ్చి డిస్ట్రబ్ చేస్తాయనే విషయం మర్చిపోయారు. అలాగే ఇలాంటి సీరియస్ గా సాగే సబ్జెక్టులకు ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ లు పెట్టకపోయినా రిలీఫ్ కోసం...అక్కడక్కడా డైలాగుల్లో అయినా ఫన్ ని వచ్చేలా చూసుకుంటారు. అదీ వదిలేసారు. ఫస్టాఫ్ సోసోగా ఉన్నా...సెకండాఫ్ బాగానే ఎంగేజ్ చేసిన ఈ చిత్రం మంచి థ్రిల్లరే. రెగ్యులర్ కమిర్షియల్ ఎలిమెంట్స్ కొరవడిన ఈ థ్రిల్లర్ ...ఎంత మంది ప్యూర్ థ్రిల్లర్ అభిమానులు ఉన్నారనే విషయంపై విజయం రేంజి ఆధారపడి ఉంటుంది.

    ఓ టీవీ ఛానెల్ లో ఫీచర్ కరస్పాండెంట్ గా పనిచేసే మేఘన(అవంతిక) కు అతీంద్రియ దృష్టి (ఇఎస్‌పి- ఎక్స్‌ట్రా సెన్సరీ పెర్‌సెప్షన్) కు ఉండటంతో భవిష్యత్ దర్శనం చేయగలుగుతుంది. అయితే ఆమె దురదృష్టమో,అదృష్టమో కానీ అన్నీ చావు సంఘటనలే కనిపిస్తూంటాయి. చిన్నప్పుడే తల్లి చావుని ముందే చూడగలిగిన ఆమె దాన్ని ఆపలేకపోయానని భాధపడుతుంది. ఆమె ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఆమెకు ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్ధ వర్మ(హర్ష వర్దన్ రానే) కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఇద్దరూ ఒకరితో మరొకరు ప్రేమలో పడతారు. ఈ లోగా ఆమెకు తన చిన్ననాటి స్నేహితురాలు పూజ(సుష్మా రాజ్)తో అతనికి ఎంగేజ్ మెంట్ అయ్యిందనే నిజం తెలుస్తోంది. ఏం చేయాలో అర్దంకాక డైలమోలో ఓ రకమైన డిప్రెషన్ లో ఉన్న ఆమెకు మరోసారి భవిష్యత్ దర్శకనం జరుగుతుంది. ఈ సారి ఆమె అతీంద్రియ దృష్టి ద్వారా చూసిన దృశ్యం... ఆమెను పూర్తిగా భయపెడుతుంది. ఇంతకీ ఆమెకు భవిష్యత్ లో ఏ జరగబోతోందని తెలిసింది. దాన్ని తప్పించటానికి ఆమె ఏం చేసింది...చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ కాదు...కథనం.

    దర్శకుడు నీలకంఠకు మొదటి చిత్రం షో నుంచీ స్క్రీన్ ప్లే బాగా చేయగల దర్శకుడుగానూ, వైవిధ్యమైన కథాంశాలు ఎన్నుకునే కథకుడుగానూ పేరు ఉంది. అయితే అదే ఆయనకు ప్లస్, మైనస్ అవుతూ వస్తోంది. చాలా సార్లు ఆయన ప్ర్తత్యేకమైన స్క్రీన్ ప్లే సినిమా చేసి ఉంటారని ఎక్సపెక్టేషన్ తో ...తాము ఊహించినంత అక్కడ కనపడక నిరాశతో సినిమాలు నచ్చకపోయినవారూ ఉన్నారు. ఆ విషయం గమనించారేమో ఈ సినిమా విషయంలో మినిమం జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆయన తన స్క్రీన్ ప్లే తో కట్టిపాడేసే ప్రయత్నం చేసారు. కాకపోతే...ఆయన రాసుకున్న స్టోరీ లైన్ ని కథావసరాన్ని బట్టి ఆయనే బ్రేక్ చేయటం లాంటివి జరిగాయి. అలాగే...రెగ్యులర్ గా థ్రిల్లర్ తరహా కథాంశాలు చూసేవారికి ఈ సినిమాలో హీరోయిన్ కు ఉన్న ఇఎస్‌పి లక్షణం వచ్చినట్లుగా...కీలకం అనుకున్న ట్విస్ట్ ముందే ఊహించేస్తారు. (అయితే అలాంటప్పుడు మనం అనుకున్న ట్విస్ట్ తెరమీద జరుగుతోందా లేదా అనేది చూస్తూ కూర్చూంటాం అనుకోండి..అలాగే అలా ఊహించటం కొంతమందికే పరిమితం).

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    ఇంటర్వెబ్యాంగ్ కాదు బాబూ అది..

    ఇంటర్వెబ్యాంగ్ కాదు బాబూ అది..

    ఈ సినిమా ఇంటర్వెల్ కరెక్టు ప్లేస్ లో ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ సాధారణ ప్రేక్షకుడు కూడా అరక్షణం కూడా ఆలోచించకుండా చెప్పగలిగేదే. థ్రిల్లర్ సినిమా కాబట్టి మన ఇండియన్ సినిమాకు కీలకమైన ఇంటర్వెల్ లో కూడా ఊహకు అందని ట్విస్ట్ ఏదన్నా పెట్టుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.

    ఫస్టాఫ్ లో..మరీ...

    ఫస్టాఫ్ లో..మరీ...

    ఈ సినిమా కథంతా సెకండాఫ్ కు దర్శకుడు దాచేయటంతో ఫస్టాఫ్ లో ఏమీ జరిగినట్లు కనపడదు. కేవలం హీరోయిన్ కి అతీంద్రియ శక్తులు ఉన్నాయి..ఆమె కుటుంబం ఇది.. లవర్ ఫలానావాడు అని సెటప్ ఎస్టాబ్లిష్ చేయటనికే సరిపెట్టారు. దాంతో ఎక్కడా కథలోకి వచ్చినట్లు కనపడదు. మొదటి మలుపు ఇంటర్వెల్ కు కానీ రాదు. స్క్రీన్ ప్లే లో మాస్టర్ అని కొనియాడబడే...నీలకంఠ సినిమాలో ఇలాంటిది ఊహించలేము.

     హైలెట్స్:

    హైలెట్స్:

    తెలుగుకు కొత్త కథ, కథనం ఉత్కంఠతో నడిపే కథనం. అలాగే తీసుకున్న కాన్సెప్టు పరిథిలోనే కథ,కథనాలను నడిపించటం. అలాగే కథకు తగ్గ ప్రధాన పాత్రల ఎంపిక. అన్నిటికన్నా ముఖ్యంగా కథలో ఉత్కంఠను పెంచిన రీరికార్డింగ్. సినిమా చివరి ఇరవై నిముషాలు..క్లైమాక్స్.

    మైనస్ లు..

    మైనస్ లు..

    మనకు సస్పెన్స్ థ్రిల్లరైనా, హర్రర్ అయినా ..సాధారణ ప్రేక్షకుడు స్ధాయికి తెచ్చి, వారికి నచ్చే అంశాలు సమకూరుస్తూ స్క్రిప్టు చేయగలిగితేనే విజయం వరిస్తుంది. ముఖ్యంగా వినోదం ఇప్పుడు ప్రతీ సినిమాలోనూ అత్యవసరమైన అవసరంగా మారింది. దాన్ని వదిలేసారు నీలకంఠ.

    పాటలు, రీరికార్డింగ్

    పాటలు, రీరికార్డింగ్

    ఈ సినిమాకు నిజానికి పాటలు అనవసరం. రీరికార్డింగ్ ప్రాణం. పాటలు ఈ చిత్రం టెన్షన్ ని తగ్గించేస్తూ సినిమా లక్ష్యాన్నిదెబ్బ తీయటం తప్ప ఎందుకూ పనికిరాలేదు.

    ఫెరఫార్మెన్స్...

    ఫెరఫార్మెన్స్...

    ఈ చిత్రంలో ఎక్కువ మార్కులు హీరోయిన్ అవంతక కే వేయాలి. ముఖంలో అమాయకత్వం...సమస్య ఎదురైనప్పుడు పడే టెన్షన్. అతీంద్రియ శక్తుల ను ఇముడ్చుకున్న అమ్మాయిగా ఆమె చాలా బాగా చేసింది. ఇక హీరోగా చేసిన హర్ష వర్దన్ రానే మంచి ఆర్టిస్టే కానీ తెలుగులో సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఈ సినిమా అతనిలోని నటనాకోణాలని బాగా ప్రెజెంట్ చేయగలగింది.మిగతా వాళ్లు సోసో.

    దర్శకుడుగా

    దర్శకుడుగా

    దర్శకుడుగా నీలకంఠ ..అప్ టు ద మార్క్ చేయలేదనిపిస్తుంది. చాలా చోట్ల అనవసరమైన స్లో గా నడవటం, ఫస్టాఫ్ ని సమర్ధవంతంగా డీల్ చేయలేకపోవటం చేసారు.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    బ్యానర్ : షిరిడి సాయి కంబైన్స్
    నటీనటులు: హర్షవర్థన్‌రాణే, అవంతిక, సుష్మారాజ్, నందిని రాయ్, నాగబాబు,నాగబాబు, ఝాన్సీ, అనితాచౌదరి, వేణు తదితరులు
    సంగీతం: శేఖర్‌ చంద్ర,
    ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి,
    కూర్పు: నవీన్‌,
    కళ: గొట్టపల్లి బాబ్జి.
    నిర్మాతలు:ఎం.వి.రెడ్డి, మధుర శ్రీధర్,
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:నీలకంఠ.
    విడుదల తేది: 01,ఆగస్టు, 2014.

    ఫైనల్ గా నీలకంఠ మాయ...బి,సి సెంటర్లకు వెళ్లటం కష్టమనిపిస్తోంది. మల్టిప్లెక్స్ లు..ఎ సెంటర్లు టార్గెట్ చేసిన ఈ చిత్రం..అక్కడ ఇలాంటి సినిమాలు అనేకం చూసిన ఆ ప్రేక్షకులను ఎంత వరకూ అలరిస్తుంది అనే విషయం పై విజయం రేంజి ఆధారపడి ఉంటుంది. ఇక థ్రిల్లర్ అభిమానులు ఈ చిత్రం మిస్ చేసుకోవద్దు.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Maaya movie based on extra-sensory perception (ESP) released today with positive note. In this story the lead character gets visions of the future events that are set to happen with her. It is thriller with a strong romantic angle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X