twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాట్ బ్యాడ్, బట్...(‘రన్ రాజా రన్’ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    హైదరాబాద్ : శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మించిన "రన్ రాజా రన్'' ఈ రోజు విడుదలైంది. చాలా కాలంగా సరైన హిట్టు లేని శర్వానంద్ ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. సినిమా ఎలా ఉందనే విషయం రివ్యూలో చూద్దాం...

    కథ విషయానికొస్తే....హైదరాబాద్ నగరంలో ఓ ముఠా చేసే కిడ్నాపులు సంచలనం సృష్టిస్తుంటాయి. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి కిడ్నాపర్స్‌ను పట్టుకునే బాధ్యత కమీషనర్ దిలీప్ (సంపత్)కు అప్పగిస్తారు. మరో వైపు చాలా బ్రేకప్స్ అయిన రాజా హరిశ్చంద్ర ప్రసాద్ (శర్వానంద్) కమీషనర్ కూతురు ప్రియ(సీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. కమీషనర్ దిలీప్ కుమార్‌కు వీరి ప్రేమ ఇష్టం లేకున్నా ఇష్టమున్నట్లు నటిస్తాడు. కానీ కిడ్నాప్ డ్రామా ఆడాలని మెలిక పెడతాడు. రాజా కూడా ఒప్పుకున్నట్లు నటిస్తాడు. వీరి లవ్ స్టోరీకి, కిడ్నాప్ ముఠాకి సంబంధం ఏమిటి? రాజా ఎలాంటి ట్విస్ట్ లు ఇచ్చాడు, సంపత్ ఏం చేసాడు అనేది తెరపై చూడాల్సిందే.

    మిగతా వివరాలు స్లైడ్ షోలో...

    హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్

    హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్


    పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే...శర్వానంద్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసాడు. పెర్ఫార్మెన్స్ బాగుంది. తన పాత్రలోని వేరియేషన్స్ బాగా పండించాడు. సినిమాకు అతని నటన బాగా ప్లస్సయింది. ఇక హీరోయిన్ సీరిత్ కపూర్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ఆమె పాత్ర ప్రకారం నటనకు పెద్దగా అవకాశం దక్కక పోయినా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది.

    ఇతర నటీనటులు

    ఇతర నటీనటులు


    నటుడు సంపత్ కూడా గత సినిమాలతో పోలిసతే డిఫరెంట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. గతంలోలా సీరియస్ కాకుండా ఈ చిత్రంలో ఆయనలో కామెడీ టైంమింగ్ చూడొచ్చు. తమిళ నటుడు జయప్రకాష్ ప్రత్యేకమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. అడివి శేష్ నటన బాగుంది. కోట శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వెన్నెల కిషోర్, జబర్దస్త్ శంకర్ అక్కడక్కడ నవ్వించారు. ఇతర నటీనటుల తమ తమ పాత్రలకు తగిన విధంగా నటించారు.

    టెక్నికల్

    టెక్నికల్


    టెక్నికల్ విషయాల్లోకి వెళితే...రన్ రాజా రన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక గిబ్రాన్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలెట్. బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం మాధి అందించిన సినిమాటోగ్రఫీ. సినిమాలోని ప్రతి ఫ్రేమును అద్భుతంగా చూపెట్టారు. అయితే ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.

    దర్శకుడి స్టామినా

    దర్శకుడి స్టామినా


    దర్శకుడి పని తీరు గురించి మాట్లాడుకుంటే.... దర్శకుడు సుజీత్ కథను వినోదాత్మకంగా నడిపించడంలో కొంతమేరకు సఫలం అయ్యాడు. కానీ సెకండాఫ్‌లో సినిమాను బాగా సాగదీసాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. కథ రొటీన్‌గా ఉన్నా ట్విస్ట్‌లు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి.

    ఫైనల్‌గా...

    ఫైనల్‌గా...


    అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించడం వల్ల సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ అవ్వడం అనుమానమే. యూత్‌కు నచ్చే అంశాలు ఉండటం ప్లస్సనే చెప్పొచ్చు. ఫన్ యాంగిల్‌లో ఆలోచిస్తే ఓవరాల్‌గా ‘రన్ రాజా రన్' ఒకే అని చెప్పొచ్చు.

    ఫైనల్‌గా...
    అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించడం వల్ల సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ అవ్వడం అనుమానమే. యూత్‌కు నచ్చే అంశాలు ఉండటం ప్లస్సనే చెప్పొచ్చు. ఫన్ యాంగిల్‌లో ఆలోచిస్తే ఓవరాల్‌గా ‘రన్ రాజా రన్' ఒకే అని చెప్పొచ్చు.

    ఇతర విషయాలు

    ఇతర విషయాలు


    బ్యానర్: యు.వి. క్రియేషన్స్
    నటీనటులు: శర్వానంద్, సీరత్‌కపూర్, అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తదితరులు
    సంగీతం: ఘిబ్రాన్ ఎం.
    ఛాయాగ్రహణం: మధి
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్
    లైన్ ప్రొడ్యూసర్: సందీప్
    నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజిత్
    విడుదల తేది: 01,ఆగస్టు, 2014

    English summary
    Sujeeth has made debut as a director with Sharwanand and Seerat Kapoor starrer Telugu movie Run Raja Run. He has become the youngest filmmaker in Telugu film industry. His first directorial venture, which has been produced by Pramod Uppalapati and Vamsi Krishna Reddy under the banner UV Creations, has released in theatres across the globe today (August 1, 2014).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X