twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూడ్డానికి తోడుండాలి! ('నీజతగా నేనుండాలి' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    హిందీ సినిమాని తీసుకుని గబ్బర్ సింగ్ అంటూ రీమేక్ చేస్తే పెద్ద హిట్టైంది కదా అని అదే నిర్మాతను పట్టుకుని ఓ హిందీ సూపర్ హిట్ ని రీమేక్ చేసేస్తే ఆడుతుందా...ఏమో... హీరో కమ్ దాదాపు నిర్మాత అయిన సచిన్ అలాంటి ఆలోచనే వచ్చింది. హిందిలో సూపర్ హిట్ అయిన 'ఆషికీ-2' సినిమా రైట్స్ తీసేసుకుని అర్జెంటుగా తెలుగులోకి దిగిపోయాడు. అంతేకానీ అసలు కథ లో మన తెలుగుకు పనికి వచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయా...అక్కడ జరిగిన మ్యాజిక్ ని ఎంత వరకూ రిపీట్ చేయగలం అనే ఆలోచన కొంచెం కూడా చేయకుండా చేసినట్లు లేరు. దర్శకుడు సైతం రీమేక్ చేయమంటే పొరపాటున అనువాదం చేయమన్నారమో అని విన్నట్లున్నాడు. క్లైమాక్స్ తప్ప...ఒరిజనల్ లోని సీన్స్ ని మక్కికి మక్కీ దింపేసాడు. అయితే ఏ సినిమాలు లేని ఈ వారంసినిమా రిలీజ్ అవటం, పబ్లసిటీ బాగా చేయటం అనే అంశాలు ప్లస్ అయ్యి...సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చాయి.

    తాగుడుకి బానిసై తన పేరంతా పోగొట్టుకున్న యువ గాయకుడు రాఘవ్ జైరాం(సచిన్ జోషి). ఆ పరిస్ధితుల్లో అతని జీవితంలోకి గాయిత్రీ నందన(నజియా) ప్రవేశిస్తుంది. ఆమె పాడిన విని పరవసించిన రాఘవ్..ఆమెను పెద్ద గాయని చేస్తానని మాట ఇస్తాడు. మాట నిలబెట్టుకునేందుకు పెద్ద కంపెనీలలో అవకాసాలు ఇప్పిస్తాడు. దాంతో ఆమె కూడా టాప్ సింగర్ గా ఎదుగుతుంది...దాంతో పాటే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించి పెరుగుతుంది. కానీ రాఘవ్ మాత్రం ప్రేమకైనా దూరం అవుతాను కానీ త్రాగుడు మానలేను అన్నట్లు ఉంటాడు. దాంతో గాయిత్రి తన కెరీర్ ని ప్రక్కన పెట్టి తనకు లైఫ్ ఇచ్చిన రాఘవ్ ని మామూలు మనిషిని చేయటానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది.. అప్పుడు రాఘవ్ ఏం చేసాడు.. వారి ప్రేమ కథ ఏమైంది అన్నది మిగతా కథ.

    నిజానికి రీమేక్ సినిమాల హిట్టైనా,ప్లాఫైనా ఒరిజనల్ తో పోల్చి చూసే సమస్య ఎప్పుడూ ఉంటుంది. నిర్మాత అంత డబ్బు ఖర్చు పెట్టి కొన్నాం కదా అని ఉన్నది ఉన్నట్లు మార్చకుండా తీయమని అంటూంటారు. దర్శకుడు అలాగే తీస్తే అతని క్రియేటివిటీ ఏమీ కనపడదు. ఇక 'ఆషికీ-2'సినిమా అక్కడ ఆడటానికి ఏకైక కారణం పాటలు సూపర్ హిట్ అవటం. కథ,కథనాలు చాలా సాదాసీదాగా ఉంటాయి. పెద్దగా చెప్పుకోతగ్గ మలుపులు ఉండవు. అలాంటి కథలేని సినిమాను తీసుకుని రీమేక్ చేయాలంటే అక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ మ్యాజిక్ జరగాలి. ఆద్బుతం ఆవిష్కరించాలంటే దానికి తగ్గ నటీనటులు, వనరులు ఉండాలి. అవేమీ 'ఆషికీ-2'తో పోలిస్తే తెలుగులో కనపడవు. కేవలం ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రమే రిచ్ గా కనపడతాయి.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో

    ఏం మారలేదు

    ఏం మారలేదు

    హీరోగా సచిన పదేళ్ల క్రిందట ఎలా నటించాడో ఇప్పూడూ అదే స్ధాయిలో నటించాడు. బాలీవుడ్ కి వెళ్లి నటించి ఇక్కడకు వచ్చినా పెద్దగా మార్పేమీ ఈ సినిమాలో కనపడదు. ఒరేయ్ పండు నాటి హీరోనే మన కళ్ళ ఎదురుగా కనపడుతూంటాడు. త్రాగుబోతుగా అతని నటన చాలా కృతకంగా ఉంటుంది. నిజంగా తాగించి సీన్స్ తీసినా బాగుండును అనిపిస్తుంది

    అమ్మాయే బెస్ట్

    అమ్మాయే బెస్ట్

    హీరోయిన్ గా తెలుగు తెరకు కొత్త అయిన నజినా నే హీరో కన్నా బాగా చేసిందనే చెప్పాలి. ఫెరఫార్మెన్స్ వైజ్ ఫరవాలేదు అనిపిస్తుంది. అయితే ఆషికీ 2 ని ఒకటికి నాలుగుసార్లు చూసిందేమో అన్నట్లు అందులో హీరోయిన్ ని అనుకరిస్తూ ఉంటుంది. దర్శకుడు అలాగే చెప్పారేమో ...

    దర్శకత్వ ప్రతిభ

    దర్శకత్వ ప్రతిభ

    దర్శకుడు జయ రవీంద్రకు ఏమని చెప్పారో కానీ ఎక్కడా ఒక్క ఫ్రేమ్ కూడా సొంతం ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా తెలుగుదనం అద్దాలన్న ఆలోచన కూడా చేయలేదు. కాబట్టి అతని దర్శకత్వ ప్రతిభ గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవటానికి ఏమీ లేదు.

    సంగీతం

    సంగీతం

    మూల చిత్రం ఆషికీ 2 హిట్ కారణం ...సంగీతం..పాటలు అక్కడ పెద్ద హిట్. దాంతో అవే పాటలను ఇక్కడ లిరిక్స్ రాయించి వదిలారు. అయితే ఆడియో ఇక్కడ మనవాళ్లకు ఎక్కలేదు. కాబట్టి అదీ ఈ రీమేక్ కు ప్లస్ కాలేకపోయింది

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    కెమెరా వర్క్ చాలా రిచ్ గా ఉంది. ఉన్న లొకేషన్స్ ని బాగా వాడుకుని, ప్రతీ ఫ్రేమ్ ని అందంగా చూపారు. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. మిగతా విభాగాలు సినిమాకు తగ్గట్లే సోసోగా ఉన్నాయి.

    ఎవరెవరు

    ఎవరెవరు

    పతాకం: పరమేశ్వర ఆర్ట్స్
    నటీనటులు: సచిన్, నజియా, రావు రమేష్, శశాంక్, కాశీ విశ్వనాధ్, పృధ్వీ, రవివర్మ, అనితా చౌదరి తదితరులు
    మాటలు:మధుసూదన్,
    పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు,
    కెమెరా:ఎ.వసంత్,
    సంగీతం: అంకిత్ తివారి,
    నిర్మాత: బండ్ల గణేష్,
    దర్శకత్వం: కె.రవీంద్ర.
    విడుదల తేదీ: ఆగస్టు 22, 2014

    'ఆషికీ-2' ని రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేస్తే బాగుండేది అని మరోసారి ఖచ్చితంగా అనిపిస్తుంది.

    English summary
    
 Sachin Joshi, Nazia Hussain starrer ‘Nee Jathaga Nenundali’ released today with average talk. This poignant tale of two musicians is the re-telling of the hit 2013 film Aashiqui 2. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X