twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ ‘సత్య-2’(రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.0/5
    హైదరాబాద్: మాఫియా, అండర్ వరల్డ్ నేపథ్యం ఉన్న సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట. గతంలో ఆయన తెరకెక్కించిన 'సత్య' చిత్రం పెద్ద విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం 'సత్యం-2'. సమాజంలో క్రైం అనేది ఎప్పటికీ చావదు...దాని రూపం మార్చుకుంటుంది, రాయల సీమ ఫ్యాక్షనిస్టులు, బెడవాడ రౌడీలు, హైదరాబాద్ గుండాల కాలం పోయింది. కొత్తరకం క్రైం చూపెట్టాం అని ప్రచారం చేసిన వర్మ.....ఈ చిత్రంతో ఏమేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం. హిందీలో వెర్షన్లో ముంబై అండర్ వరల్డ్ నేపథ్యాన్ని తీసుకున్నారు. పునీత్ సింగ్ రత్న్ సత్య పాత్రలో నటించాడు. తెలుగు వెర్షన్లో హైదరాబాద్ నేపథ్యం తీసుకున్నారు. శర్వానంద్ సత్య పాత్రలో నటించాడు.

    కథ విషయానికొస్తే...సత్య(శర్వానంద్) అండర్ వరల్డ్‌కు రారాజు కావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వస్తాడు. తనదైన ఆలోచన విధానంతో ముందుకు సాగుతుంటాడు. తక్కువ టైంలోనే సత్య తన టాలెంట్ తో ఓ కంపెనీని మొదలు పెడతాడు. ఈ కంపెనీ పేరుతో కొంతమంది ప్రముఖులను చంపుతూ ఉంటారు. ప్రజలను భయ పెట్టి వేల కోట్లు సంపాదించాలనే టార్గెట్ పెట్టుకుంటాడు. కంపెనీ ఈ మాఫియ దేశం మొత్తం వ్యాపిస్తుంది. అదే సమయంలో కంపెనీ వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోడానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ని నియమిస్తుంది. ఈ క్రమంలో సినిమా అనుకోని మలుపు తిరుగుతుంది. మరి సత్య అలా ఎందుకు మారాడు? సత్య కథ ఎలా ముగిసింది అనేది తెరపై చూడాల్సిందే.

    సత్య పాత్రలో శర్వానంద్ ఫర్వాలేదనిపించాడు. డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్ విషయంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అనైక సోతి ఏ విషయంలోనూ ఆకట్టుకోలేక పోయింది. అయితే సినిమాకు కథ పెద్ద మైనస్ పాయింటుగా మారింది. కొత్త రకం క్రైం అంటూ చెప్పిన వర్మ సినిమాలో కొత్తదనం ఏమీ చూపించలేక పోయాడు. స్క్రీన్ ప్లే కూడా మరీ దారుణంగా ఉంది. ఒక రకంగా ఈ సినిమా బిజినెస్ మేన్ సినిమాకు దగ్గరగా అనిపిస్తుంది. అసలు కథలో క్లారిటీ లేకుండా పోయింది. డైరెక్షన్ చెత్తగా ఉంది. సినిమా అర్థం కావాలంటే మిగిలిన భాగం చూడాల్సిందే అనే విధంగా....'సత్య 3'లో అసలు విషయం చెబుతామంటూ క్లైమాక్స్ లో ప్రకటించాడు.

    తొలిభాగం కాస్త చూడొచ్చు కానీ...సెకండాఫ్ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ఉంటుంది. సినిమాలో శర్వానంద్ తప్ప అంతా హిందీ వారే కావడం కూడా ఇక్కడి ప్రేక్షకులకు రుచించడం లేదు. టెక్నికల్ అంశాల విషయంలో ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. అమర్ మొహిలే సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇతర విభాగాలు కూడా సోసో అన్నట్లుగా ఉన్నాయి. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వర్మ సినిమాలు ఇష్టపడే వారి గురించి చెప్పలేం కానీ...సాధారణ సగటు ప్రేక్షకుడు ఈ సినిమాను భరించడం కష్టమే.

    దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ
    నిర్మాత : సమంత్ కుమార్ రెడ్డి
    సంగీతం : అమర్ మొహిలే, కారి అరోరా
    నటీనటులు :శర్వానంద్, అనైక సోతి, అర్చన గుప్త తదితరులు

    English summary
    Ram Gopal Varma is known for his gangster movies in the past. Especially with his ground-breaking 1998 crime thriller Satya, the filmmaker has bagged six Filmfare and four Star Screen awards, besides setting a new trend in the genre.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X