పోసాని సిన్మాపై కాంగ్రెస్ ఫిర్యాదు

శనివారం, మార్చ్ 21, 2009, 17:03 [IST]
Posani Krishna Murali
హైదరాబాద్‌: పోసాని కృష్ణమురళి నిర్మిస్తున్న 'రాజా గారి చెరువులో చేపలు' చిత్రంపై కాంగ్రెస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న పోసాని... కాంగ్రెస్‌ను దెబ్బతీసెలా ఈ చిత్రం రూపొందిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. ఈ చిత్రం పేరు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా ఉందని...కాంగ్రెస్‌ ఎంపీ ఎం.ఎ.ఖాన్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం కల్గించేలా ఉన్న ఈ సినిమా సెన్సార్‌ బోర్డు అనుమతి ఇవ్వకుండా ఆపాలని కాంగ్రెస్‌ ఎన్నికల సంఘాన్ని కోరింది.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST