ముఖం చాటేసిన మెగాస్టార్ ఫ్యామిలి !

బుదవారం, అక్టోబర్ 14, 2009, 19:52 [IST]
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు చలనచిత్ర పరిశ్రమ తన వంతు సాయం చేయడం ఎప్పటి నుంచో చేస్తూనే వస్తున్నది. స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు జోలె పట్టి డబ్బు ప్రోగు చేసి బాధితులను ఆదుకున్న వైనాన్ని ఏ తెలుగు హృదయం మరిచిపోదు. అప్పట్లో సినీ పరిశ్రమ అంతా తారతమ్య భేదాలను వదిలి అంతా ఒక్కటిగా చేరి ఆపన్న హస్తం ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు. ఇదిలావుంటే.. నిన్న మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనివ్వాలన్న అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన 'స్టార్ నైట్"కార్యక్రమ మీడియా సమావేశంలో నటుల మధ్య ఉన్న గ్రూపులు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. నాగార్జున, చిరంజీవి, ఆయన ఫ్యామిలీ హీరోలు మినహా దాదాపు టాలీవుడ్ హీరోలంతా హాజరయ్యారు. మరి ఇప్పుడో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ గొడుగు కింద ఉన్న తెలుగు చలనచిత్ర రంగంలో అడుగడుగునా గ్రూపులు, గ్రూపు రాజకీయాలు, ఒకరంటే ఒకరికి గిట్టని దౌర్భాగ్యం నేడు తెలుగు సినీ పరిశ్రమలో దాపురించిందని సీనియర్ తెలుగు నటులు వాపోతున్నారు. ఆయా అగ్రశ్రేణి నటుల మధ్య ఉన్న భేదాభిప్రాయాల వల్ల చిన్న నటులు ఏదో ఒక గ్రూపులోకి వెళ్లాల్సిన అగత్యం. ఎవరి కార్యక్రమానికి హాజరవ్వాలో ఎవరి కార్యక్రమానికి వెళ్లకూడదోనన్న గందరగోళంలో నూతన నటులు ఉంన్నట్లు సమాచారం.

నటుడు మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎటొచ్చీ పరిశ్రమలో హీరోగా రాజకీయాల్లోకి రాకముందు వరకూ దాదాపు పాతికేళ్లు అగ్రాసనం అలంకరించిన చిరంజీవి, ఆయన ఫ్యామిలీకి చెందిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తో పాటు యువహీరోలందరితో చక్కటి స్నేహసంబంధాలున్న అల్లు అర్జున్ హాజరుకాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సహజంగానే ఇది పరోక్ష, ప్రత్యక్ష అంశంగా చర్చకు కూడా దారి తీసింది. సమావేశానికి గైర్హాజరైన మెగాస్టార్ చిరంజీవి అండ్ పార్టీని ఉద్దేశించేలా మోహన్ బాబు, రాజశేఖర్ ప్రసంగం సాగింది. ఇలాంటి సమావేశాలకు రాని వారిని పక్కన పెట్టాలని మోహన్ బాబు అన్నారు. అయితే రాజశేఖర్ మాత్రం దూరంగా ఉంచడం మంచిది కాదని, అందరూ కలిసి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు మురళీ మోహన్ కాకుండా బాలయ్య ముందు ఉండి నడిపించడం వల్లనే ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబానికి సంబంధించిన నటులు రాలేదని పలువురు అనుకోవడం కనిపించింది. కొందరు హీరోలు షూటింగ్ వల్ల రాలేకపోతున్నామని తనకు చెప్పారనీ, వారంతా స్టార్ నైట్ కు పూర్తిగా సహకరిస్తామని మాట ఇచ్చారంటూ బాలకృష్ణ హుందాగా వ్యవహరించడం మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. అన్నట్టు చిరంజీవి వరద బాధిత ప్రాంతాల పర్యటనలో ఉండగా, నాగార్జున గోవాలో జరుగుతున్న షూటింగ్ లో ఉన్నారనటంలో ఎంత మాత్రం సమజసం దాగుందో !
User Comments
వంశి 11 Dec 2009 01:45 pm
మనీ కోసం వున్నా నాయాకుడు chiru
గని 06 Nov 2009 10:11 am
నందమూరి, మంచు, జీవిత రాజశేఖర్ వీళ్ళు సినిమా ల పరంగా చిరు ఫ్యామిలీ ని ఎదుర్కోలేక ఇలా చిరు పది ఏడుస్తున్నారు
rayudu 23 Nov 2009 10:50 am
అవును నందమూరి & మంచు వాళ్ళు ఏమో కానీ జీవిత రాజశేఖర్ లు మాత్రం పబ్లిసిటీ కోసం ఆరాటపడుతున్నారు వీళ్ళకు చిరును తిదితేనే టీవీ లో ఖనిపిత మని ఆరాటం
భాషా 06 Nov 2009 08:53 am
చిరు పాతికేళ్ళు అగ్రాసనమా! ఎవడిచ్చాడు బాబూ ? అదంతా అల్లు అరవింద్ సృష్టి. అల్లు లేకపోతె చిరు జీరో. మరి ఈ చిరు గారు అంత తోపు అయితే జనం ఎందుకు తిరస్కరించారో కాస్త సెలవిస్తారా ?
కైకాల rajesh 19 Oct 2009 12:18 pm
after NTR Chiru is no 1 in Tollywood,but they are noot giving any importance to Chiru,kamma fellows they are keeping Chiru away from tollywood.
to Rajesh 06 Nov 2009 08:59 am
Don't be foolish. If Kammas did not support chiru. He would not have been in the field first place. Aswini, Devi vara prasad, KRR and many more supported him all the way his career. Did you forget that ? Just because he does not get along with few people, you are bashing the entire community. What about people like posani, padma that are in PRP now ????? Posani faught his own caste people for Chiranjeevi. Did you forget that ?
Mega ticket selling 16 Oct 2009 06:33 pm
If they come they have to give money, if they come before elections they can sell the tickets and make lot of money like they did. Come on guys dont fool your selves, its Mega family, unless there is any big money they woudl not come in, every body is in sights of Sakuni Allu Arvind, no body dare oppose him.
నిజం 15 Oct 2009 02:35 pm
ఆ పవన్ కళ్యాణ్ గాడు ఉత్త వేస్ట్ ఫెలో గాడు ఏదో పోడుద్దామని పబ్లిసిటీ కోసం common man protection force? పెట్టాడు అసలు వాడు హీరో కి కూడా పనికి రాడు ,, కానీ ఈ పిచ్హి producers వాడికి ఇంకా చాన్సులు ఇస్తున్నారు, అంత సమాజ సేవ చేసే వాడు అయితే వరదలు వచ్చి జనాలు ఇబ్బందుల్లో ఉనప్పుడు ఎక్కిడికి velladanta
common man protection force 15 Oct 2009 12:48 pm
Where is Pawan Kalyan? What happended to his common man protection force? He gave 1 crore before everybody, what happened to that money? He thinks he should serve only when people make Chiranjeevi the CM. What happened to NagaBabu? Where is hiding? What happened to his lectures about service to the people? Where is Allu Aravid and his promises(before elecctions) to the people? Thank god, people in AP knows that these are bunch of loosers. Surprised to see none of them care to do any service
Rajesh 15 Oct 2009 12:36 pm
Chaitu, What is the point you are trying to make? Are you saying Chiru is not getting enough coverage on TV or You are concerned the importance TV people are giving to NTR during important occasions? I can try to answer the second - people should look NTR beyond politics. I know it's tough because NTR in politics too. What I find is most people conveniently ignore the fact that NTR is a legendary actor first and he acted in many films in many different roles.
ఎవరు 15 Oct 2009 11:38 am
వచ్చిన vallu calm gaa cheppi వెళ్తే మంచిగా ఉంటుంది ... వాళ్ళు రాలేదు వీలు రాలేదు అనుకోవడం కంటే ..... మనము ఎమ్మి చేయాలి అనుకున్తునమో అది చేస్తే పోలా.... మన వాళ్ళు మారారు ....
chaitu 15 Oct 2009 11:31 am
what importance they have given to chiru in tollywood. iam surprised to see some telugu channels always show NTR films for non concerned issues also.example NTR never fighted for this country during independece day.but they will show NTR Films that he is true fighter. actually those they died for this country they will never show those films.for every festival also they will show NTR only. oneday AP People they will forget real god and real fighters of this country.
Vasu 16 Oct 2009 02:43 pm
ఇది తెలుగు వాళ్ళు ఎలుగు వల్లికి ఇంచే గొవురావం, యు సి ఎవెన్ వే కాన్ సి హిందూ గాడ్ అస్ NTR ఇన్ మలేసియా . అది తెలుగు వాడి పవర్ . బె పోస్సితివే మై boy
వాసు 16 Oct 2009 02:45 pm
importance ఒకరు ఇస్తి వచేయ్డే కాదు . దెపెంద్స ఆన్ పీపుల్
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST