To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

ధీమ్ సాంగ్ అదిరింది...మెచ్చుకున్న బాలకృష్ణ

థీమ్‌ సాంగ్‌ చాలా బాగా వచ్చింది. అనంత్‌శ్రీరామ్‌ బ్రహ్మాండంగా పాట రాస్తే, కీరవాణి అద్భుతంగా బాణీలు సమకూర్చారు. మా మనోభావాల్ని చెబుతూ ఆపదలో ఉన్నవారికి ధైర్యం చెప్పేలా ఉందీ గీతం. పలువురు మా కార్యక్రమానికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు అని బాలకృష్ణ తెలిపారు. వరద బాధితుల సహాయార్థం ఈ నెల 7న జరుప తలపెట్టిన స్టార్‌నైట్‌ కార్యక్రమానికి సంబంధించి కర్టెన్‌ రైజర్‌లాంటి థీమ్‌ సాంగ్‌ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ రూపొందించింది. 'ఓ తమ్ముడా..ఓ చెల్లెలా..మరచిపోండి ఆ పీడకల' అంటూ సాగే ఆ పాటకు అనంత్‌శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, ఎం.ఎం.కీరవాణి సంగీత బాణీలు కూర్చి, పాడారు.

సోమవారం సాయంత్రం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో సీనియర్‌ డైరెక్టర్‌, 'స్పందన' కమిటీ గౌరవ ఛైర్మన్‌ డా. దాసరి నారాయణరావు ఈ థీమ్‌ సాంగ్‌ ఉన్న ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని సీనియర్‌ సంగీత దర్శకుడు కోటికీ, మలి ప్రతిని 'స్పందన' ఎగ్జిక్యూటివ్‌ ఛైర్యన్‌, హీరో బాలకృష్ణకూ అందజేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ "ఈనెల 7న జరిగే స్టార్‌నైట్‌లో 14 మంది సంగీత దర్శకులు స్టేజి మీద తమ ప్రోగ్రామ్స్‌ని ఇవ్వబోతున్నారు. 80 నుంచి 100 మంది నటీనటులు ఇందులో పాల్గొనబోతున్నారు. హిందీ, తమిళ, కన్నడ చిత్ర రంగాలకు చెందిన నటులు హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మూడున్నర కోట్ల రూపాయలకు మించి ఆదాయాన్ని సమకూర్చి వరద బాధితులకు అందజేయాలని సంకల్పించాం" అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌, కేసీ శేఖర్‌బాబు, మన్యం రమేష్‌, ఏవీఎస్‌, కె.అచ్చిరెడ్డి, జీవిత, రాజశేఖర్‌, అలీ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 3, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
1st ODI , Sheikh Zayed Stadium, Abu Dhabi
Match starts at 04:30 pm IST  

ఎన్టీఆర్ పాలన చేస్తాం: బాలకృష్ణ

మహబూబ్‌ నగర్‌: తెలుగుదేశం పార్టీఅధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ ఆశయాలకనుగుణంగా పాలన ఉంటుందని బాలకృష్ణ తెలిపారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చేపట్టిన బాలకృష్ణ రోడ్‌షో బుధవారం ముగియనుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర కరువుతో ఇబ్బందులు ఎదురవడంతో అప్పట్లో ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కొనసాగించలేకపోయామని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీని వదిలిన వారికి.....

రవితేజకు ప్రాణభయం ఉందా?

రవితేజకు నిజంగా ప్రాణభయం ఉందా? ఆయన పిస్టల్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవడంతో పోలీసు ఉన్నతాధికారులకు ఇబ్బందికరమైన పరిస్ధితి ఎదురైంది. సినిమాల్లో సరదా హీరోగా పేరున్న రవితేజకు ఎవరూ శత్రువులు లేరని, ఆయన ఎందుకు పిస్టల్ లైసెన్స్ కోసం దరాఖాస్తు చేసుకున్నారో అర్ధం కావడం లేదని ఒక సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల.....
User Comments
శ్రీరాం 03 Nov 2009 06:41 pm
బాలయ్య యు రాక్..మంచి పనులు చేసి ప్రజలకు దగరక
[ మీ వ్యాఖ్య రాయండి ]
Oneindia  Oneindia Login