ఆమెకు...చిరు సినిమా పేరు పచ్చి అబద్దం

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 13:59 [IST]
ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు బేటి బికి ‘అభిలాష’ పేరు పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అభిషేక్ ఈ పేరుపై ఆసక్తి చూపిస్తున్నారంటూ రచయిత శోభ డే ట్విట్టర్లో పేర్కొనడే ఇందుకు కారణం. మా బేబీకి పేరు దొరికిందని అభిషేక్ ట్వీట్ చేయడం, ఆ వెంటనే శోభ డే ట్విట్టర్లో ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే ఈ వార్తలు వట్టి పుకార్లే అని తేలింది. ఈ వార్తల్లో నిజం లేదని బిటి బి తాత అబితాబ్ బచ్చన్ తాజాగా ట్వీట్ చేశారు.

బేటి బి పేరుపై గతంలోనూ అనేక రూమర్లు వినిపించాయి. ఆమె పేరు AAతో మొదలవుతుందని, బహుషా ‘ఆలియా’ ఆమె పేరు కాబవొచ్చు అని ప్రచారం జరిగింది. కానీ వీటిని బచ్చన్ కుటుంబ సభ్యులు కొట్టి పారేశారు. తాజాగా మరోసారి ఆమె పేరుపై వినిపిస్తున్న పుకార్లు అబద్దమని తేలింది.

అయితే ‘బేటి బి‘ పేరు విషయంలో బచ్చన్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్న తీరే ఇలాంటి పుకార్లకు కారణం అవుతోందని, త్వరగా ఆమె పేరును, ఫోటోను పబ్లిక్‌కు విడుదల చేస్తే అంతా సంతోషిస్తారని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
English summary
Shobhaa De tweeted, “Beti B to be named Abhilasha?That's a stroke of genius.Well done,parents.Abhi and Ash.Truly inspired, if true.” But grandpa Amitabh Bachchan was quick enough to respond back to the author. Big B retweeted, “Not true...”
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST