23న దేశ వ్యాప్తంగా సినిమా బంద్?

గురువారం, ఫిబ్రవరి 2, 2012, 11:26 [IST]
ఈ నెల 23న దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమ బంద్ పాటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ బంద్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన సినిమాల షూటింగులు నిలుపుదల చేయడంతో పాటు, థియేటర్లు బంద్ పాటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలపై పన్ను భారం మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ బంద్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే వివిధ సమస్యలు మరియు రాబడి నష్టాలు కారణంగా తీవ్ర ఎదురుదెబ్బలు ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో సర్వీస్ టాక్స్ విధిస్తే నిర్మాతలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి.కె వెల్లడించారు.

ఇప్పటికే సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేయాలనే యోచనలో ఉంది. అయితే ఇప్పటి వరకు పవర్ ఫుల్ ప్రొడ్యూసర్స్ గ్రిడ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. బాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఈబంద్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు.
English summary
The first steps are being taken for an all India Movie Bandh on the 23rd of this month. This bandh is being planned to protest against the proposed imposition of service tax on films.
User Comments
Srsr Velagala 02 Feb 2012 07:42 pm
సొమ్ము అనవసరంగా ఖర్చుపెట్టి విదేశి షూటింగులు,చచ్చిన మేళం లా ఉండే మ్యూజిక్ లు మానేస్తే అస్సలు ప్రొడక్షన్ ఖర్చెంత ఉంటది?ఎప్పుడు ఎటువంటి వాద్యం వినిపించాలో తెలియని వాడు సంగిత దర్శకుడు, అస్సలు ఎటువంటి సందర్భం లేకుండా కోటి గెంతులు.సినిమాకి ఎలాగు విరామం, వీటి వల టివి లోని కధల్ల మారిపోతున్నాయి సినిమాలు, కాబటి వాటిని ఆపెయదమో లేదా పూర్తిగా తగ్గించడమో చేస్తే అంటా మిగులే.
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST