twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టార్గెట్ సెట్ చేసుకున్న ‘భీమ్లా నాయక్’: పవన్ కల్యాణ్ మాత్రం ముందే వచ్చేస్తాడట

    |

    సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అయితే, టికెట్ రేట్ల తగ్గింపు, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ సినిమా కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. అయినప్పటికీ ఈ మూవీ ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది. ఇది పట్టాలపై ఉన్న సమయంలోనే పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న అతడు.. ఈ మూవీ రిజల్ట్‌తో మరిన్నింటిని పట్టాలెక్కించాడు. అందులో 'భీమ్లా నాయక్' ఒకటి. సాగర్ కే చంద్ర దీన్ని తెరకెక్కిస్తున్నాడు. 'అయ్యప్పనుమ్ కోషియం' అనే మలయాళ చిత్రానికి ఇది రీమేక్‌గా వస్తోంది.

    బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

    'అయ్యప్పనుమ్ కోషియం' మూవీ ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సై పాత్రను చేయగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు పరిస్థితులకు అనుకూలంగా మార్చి 'భీమ్లా నాయక్' అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

    Bheemla Nayak shooting will complete on October Last Week

    క్రేజీ కాంబినేషన్‌లో బిగ్ మల్టీస్టారర్‌గా వస్తున్న 'భీమ్లా నాయక్' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ చివరి వారానికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అంతకంటే ముందే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్ట్‌ను పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే అక్టోబర్ నెలలోనే ఈ స్టార్ హీరో మూవీ నుంచి రిలీవ్ అవుతాడని తెలిసింది.

    బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియోబీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

    'భీమ్లా నాయక్' మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఇటీవలే విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ వీడియోలు, పాటకు ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అలాగే, దీనిపై ఉన్న అంచనాలు రెట్టింపు అయిపోయాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

    మల్టీస్టారర్‌ జోనర్‌లో రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. నిత్య మీనన్‌తో పాటు మరో భామ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

    English summary
    Pawan Kalyan, Rana Daggubati Doing Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. This Movie shooting will complete on October Last Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X