twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: పరువు తీశావంటూ లాస్యపై నందూ ఫైర్.. అంకితకు బిగ్ షాకిచ్చిన అభి

    |

    చాలా కాలంగా తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే బుల్లితెరపై ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ మీరూ ఓ లుక్కేయండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి, ప్రేమ్ పెళ్లి జరగడంతో తులసి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో అక్షరకు ఆమె క్షమాపణలు చెబుతుంది. దీనికామె పెళ్లి ఆగిపోవడం వల్ల తనకే మంచి జరిగిందని చెబుతుంది. ఆ తర్వాత శృతి, ప్రేమ్‌ను ఇంటికి తీసుకెళ్తుంది తులసి.

    ఆ సమయంలో అంకిత హారతి ఇవ్వడానికి ఒప్పుకోదు. పైగా శృతిని నోటికొచ్చినట్లు తిడుతుంది. అనంతరం ప్రేమ్.. అంకితతో మాట్లాడతాడు. శృతి మీద ఉన్న కోపంతో అన్నాదమ్ములమైన అభికి, నాకు మధ్య గొడవలు మాత్రం పెట్టొద్దని అంకితను వేడుకుంటాడు.

    టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

    శృతికి ప్రేమ్ రిక్వెస్ట్.. సారీ కూడా చెప్పి

    శృతికి ప్రేమ్ రిక్వెస్ట్.. సారీ కూడా చెప్పి

    పెళ్లైన తర్వాత అంకిత వ్యవహరిస్తున్న తీరుపై ఆమెతో మాట్లాడుతుంటాడు ప్రేమ్. నిన్నటి ఎపిసోడ్‌లో అన్నాదమ్ముల మధ్య గొడవలు పెట్టొద్దని చెప్పిన అతడు.. ఈరోజు 'దయచేసి శృతిపై ద్వేషం పెంచుకోవద్దు' అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. అంతలో అక్కడకు వచ్చిన తులసి 'అంకితకు ఇన్నాళ్లూ అర్థంకాని శృతి.. ఇప్పుడు ఎలా అర్థం అవుతుంది? నువ్వు ఇంకెప్పుడు వదినతో ఇలా దూకుడుగా మాట్లాడకు. ఇప్పుడు జరిగిన దానికి అంకితకు సారీ చెప్పు' అని ఆర్డర్ వేస్తుంది. దీంతో ప్రేమ్ ఆమెకు క్షమాపణ చెప్తాడు. అనంతరం తులసి.. అక్షరకు సర్ధి చెబుతుంది.

    అంకిత కన్నింగ్ యాక్టింగ్.. క్లాస్ పీకిన అభి

    అంకిత కన్నింగ్ యాక్టింగ్.. క్లాస్ పీకిన అభి

    శృతికి, ప్రేమ్‌కు పెళ్లి జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అంకిత.. గొడవలు పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే అభి దగ్గరకు వెళ్లి 'శృతి అడుగు పెట్టిందో లేదో అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు' అని అంటుంది. దీనికి అభి 'నిన్ను ఇప్పుడెవరేమి అన్నారు? నువ్వే నెగిటివ్‌గా ఆలోచిస్తున్నావ్. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది' అంటాడు. అప్పుడు అంకిత 'అంత ఈజీగా ఎలా వదిలేస్తా? శృతితోనే గొడవలు పెట్టిస్తా. అందరికీ మనశ్శాంతి లేకుండా చేసి.. నిన్ను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతా' అని మనసులో అనుకుంటుంది.

    హాట్ షోలో హద్దు దాటిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో అందాలు మొత్తం చూపిస్తూ.. వామ్మో ఇంత అరాచకంగానా!హాట్ షోలో హద్దు దాటిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో అందాలు మొత్తం చూపిస్తూ.. వామ్మో ఇంత అరాచకంగానా!

    బాధ పడుతోన్న నందూ.. లాస్య ఓదార్పు

    బాధ పడుతోన్న నందూ.. లాస్య ఓదార్పు

    శృతిని ప్రేమ్ పెళ్లి చేసుకోవడాన్ని గుర్తు చేసుకుంటూ తనలో తానే తెగ బాధ పడుతూ ఉంటాడు నందూ. అంతేకాదు, తాను చేసిన రెండు కోట్ల రూపాయల అప్పుని తులసి తీర్చుతానని అందరి ముందే మాట ఇచ్చిన విషయాన్ని తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడకు లాస్య వస్తుంది. రావడం రావడమే అతడి పరిస్థితిని అర్థం చేసుకుని 'ప్రేమ్ అక్షర పెళ్లి మనం జరిపించి ఉండకపోవచ్చు. కానీ మనం ఇంకోలా గోల్ రీచ్ అయ్యాం కదా. తులసి ఆ రెండు కోట్లు కట్టేస్తానని చెప్పింది కదా. మన అప్పులన్నీ తులసిపైకి నెట్టేశాం' అని అంటుంది.

    పరువు పోయిందని లాస్యపై నందూ ఫైర్

    పరువు పోయిందని లాస్యపై నందూ ఫైర్

    అసలే అవన్నీ తలచుకుని రగిలిపోతున్న నందూతో లాస్య మళ్లీ గుర్తు చేసేలా మాట్లాడుతుంది. దీంతో నందూ 'తులసిని మన అప్పులు తీర్చేట్టు ఒప్పించావంటే నేను చేతకాని వాడ్ని అనేగా నీ ఉద్దేశం. ప్రతి ఒక్కరికీ ఇదే అర్థం అవుతుంది. తులసి ముందు నా పరువు పోయింది.. మన అప్పు తను తీర్చడం నాకు ఇష్టం లేదు' అని కోప్పడతాడు. అప్పుడు లాస్య 'తులసి ఎలాగో ఈ అప్పు తీర్చలేదు. దాన్ని మనం అవకాశంగా చేసుకుని ఆమెను ఓడించాలి' అంటుంది. దీనికి 'నా పిల్లల ముందు విలువ ఉండాలంటే ఈ అప్పులు నేనే తీర్చాలి' అంటాడు నందూ.

    జబర్ధస్త్ సెట్‌లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్జబర్ధస్త్ సెట్‌లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్

    కొడుకు కోసం రెండు కోట్లు లెక్క కాదు

    కొడుకు కోసం రెండు కోట్లు లెక్క కాదు

    పెళ్లి జరిగిన తర్వాత కనిపిస్తోన్న పరిస్థితులను చూసి తులసి తెగ బాధ పడుతూ ఉంటుంది. అంతలో అక్కడకు లాస్య వచ్చి 'ఏంటి తులసీ నిద్ర పట్టట్లేదా? సంబరాల్లో ఉంటావని అనుకున్నానే. నందూ మాట కాదని నీ మాటనే గెలిపించుకున్నావ్. కానీ ఇంత దిగులుగా ఎందుకున్నావో. నీ నెత్తిన పెట్టిన రెండు కోట్ల అప్పు నీ గుండెను పిండేస్తుంది కదా' అంటుంది. దీంతో తులసి ఆమెకు క్లాస్ పీకుతుంది. అంతేకాదు, కాసేపు ఆమెకు బలమైన డైలాగ్‌లు విసిరిన తర్వాత 'నా కొడుకు భవిష్యత్ కోసం రెండు కోట్ల రూపాయలు పెద్ద లెక్కే కాదు' అని సవాల్ చేస్తుంది.

    ప్రేమ్, శృతికి పెళ్లైన సంతోషం లేకుండా

    ప్రేమ్, శృతికి పెళ్లైన సంతోషం లేకుండా

    ఇష్టమైన వాళ్లను పెళ్లి చేసుకున్నప్పటికీ ఇంట్లో జరుగుతోన్న పరిస్థితులను తలచుకుంటూ ప్రేమ్, శృతి తెగ బాధ పడుతుంటారు. ఆ సమయంలో 'మన పెళ్లి జరిపించాలని అమ్మ రెండు కోట్ల రూపాయల అప్పుని తన నెత్తిన పెట్టుకుంది.

    అసలు మన పెళ్లికి ఆ రెండు కోట్ల అప్పుకి సంబంధం ఏమైనా ఉందా? కేవలం వాళ్ల స్వార్ధం కోసం అమ్మని బలపశువుని చేస్తున్నారు. అవకాశం దొరికింది కదా అని అమ్మని ఇరికించారు. బంధాల కోసం అమ్మ ఇవన్నీ చేస్తుంది. అమ్మ సమస్యని ఎలా దాటాలో ఆలోచించాలి. మనం అమ్మకి ఎలాగైనా సాయం చేయాలి' అంటాడు ప్రేమ్.

    టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

    ప్రేమ్, శృతికి పరందామయ్య ఓదార్పు

    ప్రేమ్, శృతికి పరందామయ్య ఓదార్పు

    పెళ్లైన తర్వాత ఇంట్లో జరుగుతోన్న సంఘటనలతో బాధ పడుతోన్న ప్రేమ్, శృతి దగ్గరకు పరందామయ్య వస్తాడు. ఆ సమయంలో 'చూడమ్మా శ్రుతి.. కోరుకున్న వాడు నీ జీవితంలోకి వచ్చాడని ఆనందంలో ఉండాలి కానీ కళ్లల్లో కన్నీళ్లు ఎందుకమ్మా? ఈ ఇంటి కోడలు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి' అని శృతికి ధైర్యం చెబుతాడు. అయినప్పటికీ ఆ సమయంలో 'ఈ ఇంట్లో సమస్యలకి తానే కారణం అని శృతి బాధపడుతుంది తాతయ్య' అంటూ ప్రేమ్ అంటాడు. దీంతో పరందామయ్య మళ్లీ వాళ్లను ఓదార్చే విధంగా మాట్లాడి ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తుంటాడు.

    నేనేమైన చచ్చిపోయానా అని ఆగ్రహం

    నేనేమైన చచ్చిపోయానా అని ఆగ్రహం

    బాధ పడుతోన్న ప్రేమ్, శృతిని ఓదార్చిన తర్వాత పరందామయ్య వాళ్లిద్దరినీ వెంట బెట్టుకుని అనసూయ దగ్గరకు వస్తాడు. అనంతరం ఇంట్లో వాళ్లందరినీ పిలిచి 'అందరూ ఇలాగే దిగులుగానే ఉంటారా? ఈ ఇంట్లో ఒకరితో ఒకరికి సంబంధం లేదా? మీరంతా ఇలా దిగులుగా ఉంటే నేనేమైనా చచ్చానేమో అని నాకే అనుమానం కలుగుతుంది. ఇది పెళ్లైనా ఇల్లులా లేదు.. ఎవరో పోయినట్లుగా ఉంది' అని అంటాడు. ఆ సమయంలో తులసి అందరికీ క్లాస్ పీకే ప్రయత్నాలు చేస్తుంది. దీంతో మళ్లీ నందూ, తులసిల మధ్య గొడవ మొదలవడంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 455: Prem Said Sorry to Ankitha. Nandhu Unhappy about Marriage. Then He Fired on Lasya. After That Parandamayya Angry on Family Members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X