twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విన్నర్ వీజే సన్నీనే.. కానీ ఆయన కంటే ఎక్కువే సంపాదించిన షన్ను.. పూర్తి లెక్కలివే!

    |

    సుమారు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులు అందరినీ అలరించిన బిగ్‏బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ముగిసింది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‏గా ఫినాలే అంగరంగ వైభవంగా జరిగింది. 19 మందితో మొదలైన ఈ షోలో చివరకు సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్‏గా మిగిలారు. ఇందులో షణ్ముఖ్ రన్నరప్ గా నిలవగా.. వీజే సన్నీ బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా నిలిచారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో షన్ను రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    ట్రెండ్ లో

    ట్రెండ్ లో

    యూ ట్యూబ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. అందులో మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్‌ సబ్‌స్క్రైబర్స్‌ షన్ను సొంతం. అందుకే షణ్ముఖ్ అంటే యూత్‌లో అంత క్రేజ్ ఉంది. ఒక్క వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే 10 మిలియన్ వరకు వ్యూస్ వస్తుంటాయి. మూడు నాలుగు రోజుల పాటు ఆయన వీడియోలు ట్రెండ్ లో నిలుస్తూ ఉంటాయి.

    భారీ రెమ్యునరేషన్

    భారీ రెమ్యునరేషన్

    సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ నుంచి మనోడి ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. సూర్య తర్వాత షణ్ముఖ్ ఒక యూట్యూబ్ స్టార్ అయిపోయాడు. ఈ సూర్య వెబ్ సిరీస్ కు అయితే తెలుగులో మరే వెబ్ సిరీస్‌కు సాధ్యం కాని స్థాయిలో ప్రతీ ఎపిసోడ్ కూడా 10 మిలియన్ వ్యూస్ దాటేసింది. షన్నుకు యూ ట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ చూసి ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    బ్రహ్మగా

    బ్రహ్మగా

    ముందు నుంచి హౌస్ లో షన్ను, సిరి, జెస్సీ ఒక జట్టుగా ఉండేవారు. సిరి, షన్ను హగ్గులు గురించి పెద్ద రచ్చలే జరిగాయి. జెస్సీ అనారోగ్య కారణాలతో మధ్యలో వెళ్లిపోవడంతో సిరిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయంలో తనకు తెలీకుండానే సిరి మీద అజమాయిషీ చేసి అందరిలోనూ నెగటివ్ అయ్యాడు. ఎవరితోనూ పెద్దగా కలవకుండా కామ్‌గా ఉంటూనే ప్లాన్లు వేస్తూ బ్రహ్మగా తనను తాను క్రియేట్ చేసుకుని ఈ సీజన్‌ రన్నరప్‌గా నిలిచాడు.

    65 లక్షల పైనే

    65 లక్షల పైనే


    గెలుపు అంచుల దాకా వచ్చి టైటిల్‌ మిస్‌ అయిన ఈ బిగ్‌బాస్‌ బ్రహ్మకు పారితోషికం​ మాత్రం గట్టిగానే ముట్టినట్టు తెలుస్తోంది. ఒక్క వారానికి అతనికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ముట్టజెప్పారట బిగ్ బాస్ మేకర్స్. ఈ సీజన్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ యాంకర్‌ రవి అందుకోగా ఆ తర్వాత ఎక్కువ పారితోషికం షన్ను అందుకున్నాడట. మొత్తంగా పదిహేనువారాలకుగానూ రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

    సన్నీ కంటే ఎక్కువ

    సన్నీ కంటే ఎక్కువ

    అయితే ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ ఇది విన్నర్‌ ప్రైజ్‌మనీ కన్నా కూడా ఎక్కువ. ఎలా అంటే ఐదో సీజన్‌ విజేతగా నిలిచిన వీజే సన్నీకి షో నిర్వహకులు ప్రకటించిన రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీ తో పాటు సువర్ణ భూమి తరపు నుంచి రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్ కూడా దక్కింది. అలాగే, దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన ఓ అపాచీ స్పోర్ట్స్ బైక్‌ను కూడా సన్నీ గెలుచుకున్నాడు.

    ఇవన్నీ కలిపి అతను రూ. 78 లక్షలు గెలుచుకున్నా, 50 లక్షలు ప్రైజ్‌మనీలో అతడికి రూ. 34.40 లక్షలు మాత్రమే చేతికి వచ్చింది. టాక్స్ కట్ అవగా అదే అమౌంట్ అతని చేతికి దక్కింది. అంటే బిగ్ బాస్ ఇచ్చిన 34.40 లక్షల కంటే షన్ను కు వచ్చిన రెమ్యునరేషన్ 65 లక్షలు ఎక్కువే కదా మరి.

    English summary
    as per reports shanmukh jaswanth earned more money than winner v j sunny.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X