twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్లకు ఓటీటీలు ప్రాబ్లమ్ కాదు.. అసలు శత్రువు రాజమౌళి, యూట్యూబ్: RGV

    |

    జనాలు చాలా వరకు థియేటర్స్ కు రావడం లేదని అందుకు ఓటీటీ ప్రభావం ఎక్కువైందనే కామెంట్స్ అయితే చాలానే వస్తున్నాయి. ఇక మరికొందరు అయితే మంచి కంటెంట్ తో వస్తే తప్పకుండా థియేటర్స్ కు జనాలు వస్తారని కూడా అంటున్నారు. అయితే థియేటర్స్ కు ఈ క్రమంలో ఈ సమస్య రావడానికి ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయని రాజమౌళి కారణంగా ఒక పెద్ద సక్షోబం ఏర్పడినట్లు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక వివరణ అయితే ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

    కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా

    కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా

    ఇటీవల కాలంలో నిర్మాతలు హఠాత్తుగా షూటింగ్స్ ఆపేస్తున్నట్లు సమ్మె చేస్తుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, OTT ప్రభావం, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కూడా ఇష్టానుసారంగా పెరుగుతున్నాయి అని అందుకే వీటన్నిటికీ ఒక పరిష్కారం తీసుకునేందుకు గిల్డ్ ప్రొడ్యూసర్స్ మెంబర్స్ కూడా చర్చలు కొనసాగిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర స్థాయిలో నిరాశ పరుస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు అయితే కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కూడా దారుణంగా నష్టాలు కలుగజేస్తున్నాయి. అనవసరమైన బడ్జెట్స్ కూడా పెరుగుతుండడం దీనికి ఒక కారణం అని ఓవర్గ నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    ఓటీటీ ప్రభావం

    ఓటీటీ ప్రభావం


    తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సంక్షోభం ఏర్పడింది అని ముఖ్యంగా ఓటీటీ ప్రభావం కూడా సినిమాలపై తీవ్రంగా చూపిస్తోంది అని చెబుతున్నారు. అందుకే కాస్త ఆలస్యంగానే సినిమాలను ఓటీటీ లో విడుదల చేయాలని నిబంధనలను కూడా తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అని ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ కూడా తగ్గించాలి అని చెబుతున్నారు.

    వర్మ రియాక్షన్

    వర్మ రియాక్షన్

    ఇక ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఒక వివరణ అయితే ఇచ్చాడు. నిజానికి చిత్ర పరిశ్రమలలో నిర్మాతలు ఎందుకు ఇలా సమ్మెలు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదు అని ఎవరైనా సరే బిజినెస్ గా ఆలోచించే సినిమాలను తెరపైకి తీసుకు వస్తారని అంతేకానీ అందరినీ ఇండస్ట్రీతో ఏకం చేయడం ఒక అబద్ధం అవుతుందని అన్నారు.

    రాజమౌళి భూతం

    రాజమౌళి భూతం

    అంతేకాకుండా జనాల్లో కూడా చాలా మార్పు వచ్చింది అని ఎవరు కూడా ఎక్కువసేపు ఒక సినిమాను చూడడానికి ఇష్టపడడం లేదు అని అన్నారు. వారికి ఎంతో కొత్తగా అనిపించి విజువల్ ట్రీట్ ఇస్తే గాని థియేటర్లో రెండు గంటలకు పైగా కూర్చోవడం లేదు అని అన్నారు. ముఖ్యంగా రాజమౌళి లాంటి భూతం వచ్చి ప్రేక్షకులు ఆలోచన విధానాన్ని కూడా మార్చేసిందని తెలియజేశారు. చాలావరకు పెద్ద సినిమా అంటే RRR, KGF కంటే ఎక్కువ రేంజ్ లోనే ఉంటేనే చూడాలని థియేటర్స్ కు వస్తున్నట్లు వర్మ వివరణ ఇచ్చాడు.

    యూట్యూబ్ కూడా..

    యూట్యూబ్ కూడా..


    కేవలం రాజమౌళి అనేది ఒక పాయింట్ మాత్రమే. ఆయన ఒక ఆటం బాంబు లాంటివారు. రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తూ ఉంటారు. కానీ నిత్యం సినిమా ఇండస్ట్రీ పై ప్రభావం చూపిస్తుంది ఓటీటీ కాదు. యూట్యూబ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు అక్కడికే ఎక్కువగా వెళ్తున్నారు. వివిధ రకాల లో వాళ్లకు ఎంటర్టైన్మెంట్ అనేది యూట్యూబ్లో దొరుకుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయింది. కాబట్టి ఇలాంటి కోణాల్లో జనాల దృష్టి ఎప్పుడూ కూడా ఒకదానిపై ఎక్కువ సేపు ఉండడం లేదు.. కాబట్టి ఉహాలకు అందని రేంజ్ లో సినిమా ఉంటుంది అంటేనే థియేటర్ వరకు వస్తున్నారు అని వర్మ తెలియజేశారు.

    English summary
    Director Ram Gopal Varma clarification on OTT effect and producers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X