twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam first review టాలీవుడ్‌లో బెస్ట్ పిరియాడిక్ మూవీ.. తెరపైన అలాంటి అద్భుతం!

    |

    ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సీతారామం సినిమా ఇటీవల కాలంలో ఏ మూవీకి రానటువంటి పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకొన్నది. టీజర్లు, ట్రైలర్లు, పాటలు సినిమాపై ఫీల్ గుడ్‌ ఒపీనియన్‌ను క్రియేట్ చేయడమే కాకుండా భారీ అంచనాలను పెంచాయి. ఆగస్టు 3వ తేదీన ప్రభాస్ ముఖ్య అతిథిగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ స్పందన లభించింది. అయితే ఈ సినిమాపై తొలి రివ్యూ బయటకు వచ్చింది. ఈ సినిమా గురించిన తొలి రివ్యూ ఎలా ఉందంటే...

    మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ

    మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ

    సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న నటించిన సితా రామం సినిమాకు పాటలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు అద్భుతమైన రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నాయి. కానున్న కల్యాణం, ఇంత అందం, ఓ సీతా పాటలు మ్యూజిక్ చార్ట్‌బస్టర్స్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి.

    కశ్మీర్‌లో షూట్ చేసిన ఎపిసోడ్స్

    కశ్మీర్‌లో షూట్ చేసిన ఎపిసోడ్స్

    సీతారామం మేకింగ్, క్వాలిటీ, గ్రాండియర్ విజ్‌వల్స్ గురించి ఇప్పటికే చర్చ భారీగా జరుగుతున్నది. మైనస్ 24 డిగ్రీల వాతావరణంలో కశ్మీర్‌లో షూట్ చేసిన సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయి. ప్రేక్షకులకు ప్రతీ సన్నివేశం కొత్త అనుభూతికి గురిచేస్తుంది. మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందించడమే కాకుండా ప్రేక్షకుడితోపాటు సినిమా మధురానుభూతులు ఇంటి వరకు వస్తాయి అని చిత్ర యూనిట్‌తోపాటు సాంకేతిక నిపుణులు వెల్లడిస్తున్నారు.

    ప్రేమ కథతోపాటు యుద్ద సన్నివేశాలు

    ప్రేమ కథతోపాటు యుద్ద సన్నివేశాలు

    తెలుగు సినిమా రంగంలో పిరియాడిక్ మూవీస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇప్పటి వరకు పంచాయి. వాటన్నిటికి మించి సీతారామం పీరియాడిక్ ఫీల్‌ను కలిగిస్తుందని చెబుతున్నారు. మంచి ప్రేమ కథతోపాటు వార్ సీక్వెన్స్ ఆకట్టుకొంటాయి. రష్యా, కశ్మీర్, ఇతర ప్రాంతాల్లో షూట్ చేసిన ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి అనే టాక్ మీడియాలోను, సినీ వర్గాల్లో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

    టాలీవుడ్‌లో బెస్ట్ పిరియాడిక్ ఫిలిం

    టాలీవుడ్‌లో బెస్ట్ పిరియాడిక్ ఫిలిం

    ఇలాంటి కథనాల మధ్య అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఐ‌తోపాటు టెక్నికల్ విభాగం హెడ్ శ్రీ సీవీ రావు చేసిన పోస్టు మరోసారి సీతారామంపై అంచనాలు భారీగా పెంచాయి. ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పీరియడ్ సినిమాల్లో సీతారామం బెస్ట్ అని సీవీరావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    హను రాఘవపూడి టేకింగ్ గురించి

    హను రాఘవపూడి టేకింగ్ గురించి

    దర్శకుడు హను రాఘవపూడి రచన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంది. సాంకేతిక విభాగాలు చెందిన ప్రతీ విభాగం అద్బుతమైన అవుట్‌పుట్ ఇచ్చింది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడండి. ఆగస్టు 5 తేదీన రిలీజ్ అవుతున్నది. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చించాల్సిన చిత్రం అని శ్రీ సీవీ రావు ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Dulquer Salmaan, Mrunal Thakur starrer Sita Ramam has Rashmika Mandanna in an important role. The prestigious film 'Sita Ramam' is produced by star producer Aswini Dutt under the banner of Swapna Cinema and is presented by Vyjayanthi Movies. The movie will release worldwide on August 5. Directed by Hanu Raghavapudi, the audience has high expectations for this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X