Don't Miss!
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 6: అత్యాశతో బొక్కబోర్లా పడిన బిగ్ బాస్.. అందుకే దారుణంగా రేటింగ్స్!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఇటీవల గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. మరోసారి నాగార్జున హోస్టింగ్ ద్వారా జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి మొదటి ఎపిసోడ్ కు దారుణమైన రేటింగ్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో కంటే అతి తక్కువ రేటింగ్స్ అందుకోవడంతో ఇప్పుడు వీకెండ్స్ అనంతరం రేటింగ్స్ మినిమమ్ రావడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. అయితే బిగ్ బాస్ రేటింగ్ ఈ స్థాయిలో దారుణంగా పడిపోవడానికి కారణం కూడా ఉంది అని తెలుస్తోంది. అత్యాశకు పోయే బిగ్ బాస్ బొక్క బోర్లా పడినట్లు కామెంట్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మొదట్లోనే రికార్స్ బ్రేక్
బిగ్ బాస్ మొదటి సీజన్ స్టార్ట్ అయినప్పుడు అసలు పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త హోస్టింగ్ ద్వారా బిగ్ బాస్ గతంలో ఎప్పుడూ లేనంత భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకొని పాత రికార్డులను బ్రేక్ చేసింది. ఇక తర్వాత నాని నాగార్జున కూడా అదే తరహాలో బిగ్ బాస్ ను మరో స్థాయి వరకు తీసుకువెళ్లారు.
5వ సీజన్ కు తక్కువ రేటింగ్స్
అయితే బిగ్ బాస్ 4 సీజన్ వరకు కూడా బాగానే నడిచింది. ఇక ఐదవ సీజన్లో మాత్రం రేటింగ్స్ కొంత తక్కువగా వచ్చినట్లు కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే 6వ సీజన్ కూడా వెంటనే మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఓటీటీ ద్వారా నాన్ స్టాప్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుకున్నారు. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురయింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ షో పెద్దగా క్లిక్ అయింది లేదు.
దారుణంగా రేటింగ్స్
మొత్తానికి ఇటీవల రేటింగ్ వివరాలు బయటకు రాగా బిగ్ బాస్ 6వ సీజన్ మొదటి ఎపిసోడ్ కు గతంలో ఎప్పుడూ లేనంత చాలా తక్కువగా వచ్చాయి. సాధారణ వీకెండ్స్ లో వచ్చేంత రేటింగ్ మొదటి ఎపిసోడ్ కు రావడంతో అసలు బిగ్ బాస్ ను ఎవరు చూడడం లేదని అర్థం అవుతుంది. నాగార్జున స్టార్ట్ చేసిన మొదటి ఎపిసోడ్ కు కేవలం 13 రేటింగ్ మాత్రమే వచ్చింది.
అదే వారి కొంపముంచింది
ఎక్కువగా అయితే ఈసారి బిగ్ బాస్ డిజాస్టర్ రేటింగ్స్ అందుకోవడానికి ప్రధాన కారణం వారు అత్యాశకు పోవడమే అని తెలుస్తోంది. గత ఐదు సీజన్స్ కు కూడా ఎవరిని తెచ్చినా కూడా జనాలు చూశారు కాబట్టి ఈసారి కూడా పెద్దగా పేరు ఉన్న సెలబ్రిటీలను సెలెక్ట్ చేయకుండా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండే కంటెస్టెంట్స్ ను తీసుకురావాలని అనుకున్నారు. అదే వారి కొంపముంచింది అని అంటున్నారు.
తక్కువ పెట్టుబడితో..
గతంలో అయితే కొంతమంది టెలివిజన్ కంటెస్టెంట్స్ ను సినీ యాక్టర్స్ ను టెక్నీషియన్స్ ను తీసుకువచ్చి వారికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్స్ ఇచ్చారు. ఒక విధంగా వారు పెట్టిన పెట్టుబడికి మంచి ఆదాయం కూడా లభించింది. కానీ బిగ్ బాస్ ఈసారి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందుకోవాలని తక్కువ రెమ్యునరేషన్ అందుకునే వారిని తీసుకువచ్చినట్టుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అందుకే ఈసారి కంటెస్టెంట్స్ సెలక్షన్ విధానమైతే జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు అని అర్ధమవుతోంది. ఇక ఆ ప్రభావం బిగ్ బాస్ రెండు వారాలైనా తగ్గలేదని కూడా తెలుస్తోం