twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Hanu Man: కొరియన్, జపనీస్ లోనూ 'హనుమాన్'.. మొత్తం 11 భాషల్లో రిలీజ్, ఆకట్టుకుంటున్న వీడియో!

    |

    టాలీవుడ్ లో క్రియేటివ్ కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కించే దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు. అ!, కల్కి, జాంబీ రెడ్డి వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఈ ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ తో రాబోతున్నాడు. ఇండియన్ సూపర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఒక యంగ్ డైరెక్టర్.. మరో యంగ్ హీరోతో చేస్తున్న ప్రయోగమే హనుమాన్. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ యావత్ సినీ ప్రేక్షకులనే కాకుండా విమర్శకులను సైతం అబ్బురపరిచింది. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ అద్భుతమైన వీడియోను పంచుకుంది.

    ఆదిపురుష్ టీజర్ కంటే..

    ఆదిపురుష్ టీజర్ కంటే..

    అ! సినిమాతో ప్రేక్షకులను వావ్ అనిపంచిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఈ సినిమాలో యంగ్ హీరో తెజ సజ్జా ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఇప్పటికే ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశాడు డైరెక్టర్. అంజమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్, మైఖేల్ గా వినయ్ రాయ్, మీనాక్షిగా అమృత అయ్యర్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదల చేసిన హనుమాన్ టీజర్ కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ మైండ్ బెండ్ అయింది. ఎందుకంటే అంతకుముందు వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ లోని విజువల్స్ కంటే ఈ సినిమాలోని విజువల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

     మొత్తంగా 11 భాషల్లో..

    మొత్తంగా 11 భాషల్లో..

    హనుమాన్ సినిమాలో చూపించిన క్రియేటివిటీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షనగా నిలవగా ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ కంటే గొప్పగా ఉందని పేరు తెచ్చుకుంది. అంతగా ఆకట్టుకున్న ఈ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీతోపాటు స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషలతో కలిపి మొత్తంగా 11 లాంగ్వెజెస్ లో పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే హనుమాన్ చిత్రాన్ని పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల చేయడమే కాకుండా రిలీజ్ చేసిన పోస్టర్ వీడియో మరింత ఆకర్షణగా మారింది.

     ప్రపంచం మొత్తం వ్యాపించినట్లుగా..

    ప్రపంచం మొత్తం వ్యాపించినట్లుగా..

    హనుమాన్ విడుదల పోస్టర్ వీడియోలో ఒక్కొక్క దేశం పేరు చూపిస్తూ యావత్ ప్రపంచం మొత్తం హనుమంతుడు వ్యాపించినట్లుగా చూపించారు. ఈ వీడియోకు హనుమాన్ చాలీసా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో డిజైన్ చేయడం మరింతగా ఆకర్షిస్తోంది. వీడియో పూర్తయ్యే సరికి చూడముచ్చటగా ఉంది. సినిమాను తక్కువ బడ్జెట్ తోనే తీసినప్పటికీ హాలీవుడ్ స్థాయిలో ప్రమోషన్స్ చూపించడం ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి అద్దం పడుతోంది. అంజనాద్రి అనే కాల్పనిక ప్రదేశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హను-మాన్ లా శక్తులు పొందిన ఒక సామాన్య యువకుడు అంజనాద్రిని కాపాడుకోవడానికి ఏం చేశాడన్న కథతో ఉన్నట్లు తెలుస్తోంది.

     ఇతిహాసాల్లోని దేవుళ్ల పాత్రలతో..

    ఇతిహాసాల్లోని దేవుళ్ల పాత్రలతో..

    ఇక హనుమాన్ సినిమాతో సూపర్ హీరో యూనివర్స్ కి తెర లేపుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. భారతీయ ఇతిహాసాలలోని దేవుళ్లను సూపర్ హీరోలుగా చిత్రీకరిస్తూ ఈ సినిమాటిక్ యూనవర్స్ లో మరికొన్ని చిత్రాలు రానున్నాయని సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పుడు హనుమంతుడి శక్తులతో 'హను-మాన్' రానుండగా.. అనంతరం దేవతల రాజు అయిన ఇంద్రుడు క్యారెక్టర్ తో 'అదిరా' చిత్రం తెరకెక్కనుందట. ఇలా మరికొంతమంది దేవుళ్ల పాత్రలతో సినిమాలను రూపొందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

    English summary
    Teja Sajja Amritha Aiyer Starrer Prasanth Varma Directed Movie Hanuman Released Worldwide On May 12 In 11 Languages As Pan World Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X