twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya ప్రీ రీలీజ్ కు రాని శ్రుతి హాసన్.. ఎవరైనా బెదిరించారేమో అని చిరంజీవి కామెంట్స్!

    |

    స్వయంకృషితో ఎదిగిన వాళ్లలో మొదటగా చూపించేది మెగాస్టార్ చిరంజీవిని. చిన్న పాత్రతో మొదలై నేడు మెగాస్టార్ గా, టాలీవుడ్ కు బాస్ గా, సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారారు చిరంజీవి. సినిమా హిట్ అయిన ఫట్టయిన పట్టించుకోకుండా యంగ్ హీరోలతో సరిసమానమైన జోష్ తో ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఆచార్యతో ఫ్లాప్ ను మూటగట్టుకోగా గాడ్ ఫాదర్ సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

    ఇప్పుుడు వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఇక ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఈ ఈవెంట్ లో షాకింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్.

     అన్ని సూపర్ హిట్ గా..

    అన్ని సూపర్ హిట్ గా..

    లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్ శ్రుతి హాసన్. అయితే తెలుగులో తెరంగేట్రం చేసిన అనగనగా ఓ ధీరుడు, హిందీలో లక్ మూవీ అంతగా విజయం సాధించలేదు. కానీ తర్వాత రానురాను తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అగ్ర హీరోలతో ఆమె నటించిన సినిమాలన్ని దాదాపుగా సూపర్ హిట్ సాధించాయి. అయితే తర్వాత సినిమాలకు కొంతకాలం గ్యాప్ తీసుకుంది ఈ గ్లామరస్ బ్యూటి.

    ఇద్దరు పెద్ద హీరోలకు జోడీగా..

    ఇద్దరు పెద్ద హీరోలకు జోడీగా..

    ఇటీవలే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ శృతి హాసన్.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'సలార్‌' అనే సినిమాను చేస్తోంది. అలాగే బాలకృష్ణ-గోపీచంద్ కాంబినేషన్‌లోని వీర సింహా రెడ్డి, చిరంజీవి-బాబీ కాంబోలోని వాల్తేరు వీరయ్య సినిమాలోను శ్రుతి హాసనే హీరోయిన్. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన రెండు పెద్ద సినిమాల్లో శ్రుతి హాసనే హీరోయిన్ గా చేయడం విశేషం.

    చిరంజీవి ఫంక్షన్ కు డుమ్మా..

    చిరంజీవి ఫంక్షన్ కు డుమ్మా..

    అంతేకాకుండా ఇద్దరు బాడా స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ నటించిన తాజా సినిమాలకు ఒకటే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడం మరో విశేషం. ఇటీవలే అట్టహాసంగా జరిగిన బాలకృష్ణ వీర సింహా రెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది శ్రుతి హాసన్. కానీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం డుమ్మా కొట్టింది. అందుకు తనకు ఒంట్లో నలతగా ఉండటమే కారణంగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటి.

    చివరిగా చిరంజీవి స్పీచ్..

    చివరిగా చిరంజీవి స్పీచ్..

    అయితే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళశాల మైదానంలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రుతి హాసన్ రాకపోవడం గురించి చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారు. యాంకర్ సుమ హోస్ట్ చేసిన ఈ కార్యాక్రమంలో రైటర్స్, నిర్మాతలు, ఊర్వశీ రౌటేలా, కేథరీన్ ట్రేసా, దేవీ శ్రీ ప్రసాద్, శేఖర్ మాస్టార్, డైరెక్టర్ బాబీ, మాస్ మహారాజా రవితేజ అందరూ మాట్లాడిన తర్వాత చివరిగా మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ఇచ్చారు.

    ఎవరు బెదిరించారో..

    ఎవరు బెదిరించారో..

    ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రుతి హాసన్ రాకపోవడంపై మాట్లాడారు చిరంజీవి. "శ్రుతిహాసన్.. ఆ అమ్మాయి ఇవాళ అనుకోకుండా రాలేదు. మరి ఒంగోలులో ఏం తినిందే.. ఏంటో తెలియదు జ్వరం వచ్చిందంటా. లేకపోతే ఎవరు బెదిరించారో తెలియదు పాపం ఆ అమ్మాయికి ఫీవర్ వచ్చింది. ఇవాళ ఫోన్ చేసి వెరీ సారీ చెబుతూ నాకు ఒంట్లో నలతగా ఉంది. కొవిడ్ టెస్ట్ కూడా చేయించాను. అది పాజిటివ్ కాకుంటే బాగుంటుంది. నేను నిజంగా వైజాగ్ ను చాలా మిస్ అవుతున్నాను అని చాలా బాధపడింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని చిరంజీవి అన్నారు.

    డ్యాన్స్ చేస్తుంటే వణికిపోయేది..

    డ్యాన్స్ చేస్తుంటే వణికిపోయేది..

    ఇంకా చిరంజీవి మాట్లాడుతూ.. "సినిమాలో శ్రుతి హాసన్ చాలా బాగా చేసింది. హీరోయిన్లు కేవలం గ్లామర్ కోసమే ఉంటారని కాకుండా ఈ చిత్రంలో గ్లామర్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లోనూ, కథలోనూ తన ప్రాముఖ్యత ఉంది. మైనస్ 8 డిగ్రీల చలిలో ఆ చీరకట్టుతోటి మంచులో డ్యాన్స్ చేస్తుంటే వణికిపోయేది. చాలా బాధ అనిపించేసింది. కానీ సినిమా, సాంగ్స్ చూశాక అనిపించింది.. ఆ వణుకు ఎలా నొక్కిపెట్టిందో తెలియదు. చాలా గ్లామర్ గా వావ్ క్యూట్ గా అనిపించింది. శ్రుతి నీ ప్రఫెషనలిజానికి హ్యాట్సాఫ్" అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

    English summary
    Mega star Chiranjeevi's Waltair Veerayya set to release on January 13th. Ravi Teja, Shruti Haasan in lead role. here is the vizag's pre release events updates. Chiranjeevi About Shruti Haasan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X