twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: దేవయాని, వసుధార ఇద్దరికీ షాక్ ఇచ్చిన రిషి.. నువ్వు నా భార్యవి కాదంటూ!

    |

    కాలేజీలో మీటింగ్ జరుగుతుంటుంది. వసుధార మెడలో తాళి కట్టింది ఎవరు అని దేవయాని నిలదీస్తుంది. వసుధార ఆలోచనల పడిపోతే.. దానికి కారణం రిషి అని జగతి చెబుతుంది. ఇంతలో రిషి వస్తాడు. రిషిని చూసిన దేవయాని స్టేజీపైకి తీసుకెళ్తుంది. మైక్ దగ్గరికి తీసుకెళ్లి జగతి చెప్పిన మాటలు అబద్ధం అని చెప్పు రిషి అని అంటుంది దేవయాని. రిషి అయోమయంగా.. కంగారుగా ఉంటాడు. ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ జగతి మేడమ్ అన్న మాటలు విన్నాను అని రిషి చెబుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 2 గురువారం నాటి తాజా ఎపిసోడ్‌ 700లో ఇంకా ఏం జరిగిందంటే?

    పర్సనల్ విషయాల కోసం..

    పర్సనల్ విషయాల కోసం..

    స్టేజీపై జగతి మేడమ్ అన్న మాటలన్నీ నిజం అని రిషి చెబుతాడు. దీంతో దేవయాని బిత్తరపోయి చూస్తుంది. జగతి, మహేంద్ర, వసుధార సంతోషిస్తారు. రిషీ ఏం మాట్లాడుతున్నావ్.. ఏం చెబుతున్నావ్ అని టెన్షన్ గా అడుగుతుంది దేవయాని. అవును పెద్దమ్మా.. జగతి మేడమ్ చెప్పింది నిజం. పిలవగానే వచ్చినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ పర్సనల్ విషయాలు, నిజాలేంటీ, అబద్ధాలేంటీ అని చర్చించడానికి కాదు అని రిషి అంటాడు. దీంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ విజయాలు, భవిష్యత్ కార్యచరణాల గురించి చర్చించడానికి ఈ ప్రెస్ మీట్. ప్రాజెక్ట్ గురించి వసుధార గారు వివరిస్తారు. మేడమ్ మీరు ప్రెస్ మీట్ కంటిన్యూ చేయండి అని జగతితో చెప్పి దేవయాని కోసం వెళ్తాడు రిషి.

    నీకు భార్య వచ్చింది..

    నీకు భార్య వచ్చింది..

    ఎందుకు పెద్దమ్మా అలా వెళ్తున్నారు అని రిషి అడిగితే.. ఈ పెద్దమ్మ ఇంతకు ముందే చనిపోయింది అని దేవయాని అంటుంది. అవేం మాటలు పెద్దమ్మా అని రిషి అంటాడు. లేదు రిషి.. అసలు నువ్వు చేసింది ఏంటీ.. నువ్వు మాట్లాడిన మాటలు ఏంటీ.. నీకోసం నేనెంత కష్టపడ్డాను. నీ పెళ్లి కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నాకు తెలియకుండా నీ పెళ్లిని, నీ భవిష్యత్తుని నువ్వే నిర్ణయించుకున్నావ్. ఇది కరెక్టేనా రిషి అని అడుగుతుంది దేవయాని. రిషి మౌనంగా ఉంటాడు. నీకు నచ్చే భార్య వచ్చినా నీ ఆలనపాలన అన్నీ తనే చూసుకుంటుందిగా.. తర్వాత నేను ఎందుకు రిషి నీకు.. తల్లి లేదు అనుకున్నాను. తల్లి వచ్చింది. నీ తల్లిదండ్రులు ఇద్దరు కలిశారు. ఇప్పుడు నీకు భార్య వచ్చింది. ఇక నాతో ఏం పని. నేను వెళ్తున్నాను అంటూ దేవయాని వెళ్లబోతుంది. పెద్దమ్మ దయచేసి నా మాట వినండి.. ఏం జరిగిందో మీకు తర్వాత చెబుతాను అని రిషి అంటాడు.

     రిషి సంతోషమే కావాలి..

    రిషి సంతోషమే కావాలి..

    ఎప్పుడు చెప్పిన ఒకటేలే రిషి. అంతా అయిపోయింది. నా కళ్లు తెరుచుకున్నాయి. నేనొక పిచ్చిదాన్ని. నీ మీద అనవసరంగా ప్రేమ పెంచుకున్నాను అని దేవయాని అంటుంది. నేనేం మారిపోలేదు. ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరు. మీరే నాకు ముఖ్యం. నన్ను దూరం పెట్టకండి. భరించలేను. నేను ఏమైనా ఎక్కడికి వెళ్లిన మీరు నాతోనే ఉండాలి పెద్దమ్మా అని రిషి ఎమోషనల్ అవుతాడు. తెగేదాకా లాగితే నాకే నష్టం అని మనసులో అనుకున్న దేవయాని ఏంటీ నాన్నా ఇంతలా నన్ను బతిమిలాడాలా.. నీ మసు ఏంటో నాకు తెలియదా.. నువ్వు ఏం చేసినా ఆలోచించే చేస్తావ్.. నీ సంతోషమే నా సంతోషం అని అంటుంది. ఇంతలో ఫణీంద్ర వస్తే.. ఏంటండి ఇలా చూస్తున్నారు. రిషి సంతోషమే కదా నాకు కావాలి. సరే నేను వెళ్తున్నా అని ఫణీంద్రతో వెళ్లిపోతుంది దేవయాని.

    ఒక్క విషయం మర్చిపోతున్నావ్..

    ఒక్క విషయం మర్చిపోతున్నావ్..

    మరోవైపు రిషి క్యాబిన్ కు వెళ్లిన వసుధార సంతోషంలో మునిగిపోతుంది. రిషి తన భర్తగా చెప్పినందుకు తెగ సంబరపడిపోతుంది. అక్కడున్న హార్ట్ తీసుకుని గిర్రున తిరుగుతుంటే ఇంతలో రిషి వస్తాడు. హార్ట్ చేజారడంతో మళ్లీ గట్టిగా పట్టుకుంటుంది వసుధార. ఏంటీ హడావిడి.. ఏంటా గెంతులు అని రిషి అంటే.. ఆనందం అని వసుధార అంటుంది. ఎందుకు అని రిషి అడిగితే.. ఏదేంటీ సార్.. ఎందుకు అంటారేంటీ.. మన మధ్య ఉన్న సంఘర్షణకు ఈరోజు ముగింపు ఇచ్చారు కదా. ఇప్పుడు మనకు ఎలాంటి బాధలు కూడా లేవు అని వసుధార అంటుంది. ఈ ఆనందంలో ఒక్క విషయం మర్చిపోతున్నావ్ అని రిషి అంటే.. ఏంటీ సార్ అని వసుధార అంటుంది.

    తప్పు పడుతున్నారా..

    తప్పు పడుతున్నారా..


    నేను నీ భర్తను అని మాత్రమే చెప్పాను. కానీ నువ్వు నా భార్యవని అనలేదుగా అంటాడు రిషి. అవును వసుధార. బాగా ఆలోచించూ అని రిషి అంటే.. జగతి మేడమ్ చెప్పినదాన్ని అందరి ముందు ఒప్పుకున్నారు కదా.. మళ్లీ ఇలా మట్లాడతారేంటీ అని అయోమయంగా అంటుంది వసు. నేను అదే అంటున్నా.. జగతి మేడమ్ చెప్పినదాన్ని నేను ఒప్పుకున్నా. నేను నీకు భర్తనే.. నువ్వు నాకు భార్యవి కాదు అంటాడు రిషి. అలా ఎలా అవుతుంది అని వసుధార అంటే.. నువ్వు చేసిన దానికి నేను నీకు భర్తను అయ్యాను కానీ, ఆ పని వల్ల నువ్వు నాకు భార్యవి కాలేవు కదా. నీ చేతులతో తాళీని నీ మెడలో వేసుకున్నావ్. అప్పుడు నీ మనసులో నన్ను అనుకున్నావ్. నేనే తాళి కట్టినట్లు భావించావ్. నీ ఇష్టప్రకారమే జరిగింది అని రిషి అంటాడు. సార్ నన్ను తప్పు పడుతున్నారా అని వసుధార అంటుంది.

    సమాజం నిన్ను ప్రశ్నలు వేస్తుంటే..

    సమాజం నిన్ను ప్రశ్నలు వేస్తుంటే..

    తప్పు పట్టట్లేదు. నీ ఊహల్లో భర్తని అయ్యాను. ఏదో పరిస్థితులు అన్నావ్. బెదిరింపులు అన్నావ్. తాళి నువ్వే వేసుకున్నావ్ ఈ విషయంలో నిన్ను కొంచెం కూడా తప్పుబట్టడం లేదు. నీ ప్రేమను కూడా శంకించడం లేదు. నీ అంతట నువ్వే తాళి కట్టుకుంటే నీకు భర్తను ఎలా అవుతాను. అసలు పెళ్లి అంటే ఏదేదో ఊహించుకున్నాను. కానీ నువ్వు మాత్రం నా ప్రేమను అపహాస్యం చేశావేమో అని రిషి అంటే తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని నన్ను కాపాడుకోవడానికి ఈ తాళి మెడలో వేసుకున్నాను అని వసు అంటే.. సమాజం నిన్ను ప్రశ్నలు వేస్తుంటే ఆ బాధ్యతను నేను తీసుకున్నా. అది నీ మీద ఉన్న ప్రేమ, గౌరవం. భర్త అంటే పదవి కాదు. ఒక బాధ్యత. నలుగురిలో నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చినప్పుడు నీ బాధను నా బాధగా భావించి ఒప్పుకున్నాఅని అంటాడు రిషి.

    నీకు నచ్చలేదోమో కానీ..

    నీకు నచ్చలేదోమో కానీ..

    రిషి ఇంకా ఏవేవో లాజిక్ లు చెబుతుంటే.. ఆపండి సార్. ఇప్పటిదాకా రిషిధారలంటే మనంగా భావించాను. కానీ రిషికీ ధారకి కనిపించని దూరమేదో మీకు కనిపించినట్లుంది సార్. భార్యాభర్తల మధ్యలోనే కొత్త లాజిక్ ను చూపించారు. మీ దృష్టి కోణంలో ఆలోచించి నా భార్యవి నువ్వు కాదంటున్నారు అని వసుధార అంటుంది. నేను చెప్పింది నీకు నచ్చలేదేమో కానీ, నేను చెప్పినదాంట్లో తప్పేముంది అని రిషి అంటాడు.

    English summary
    Guppedantha Manasu Serial March 2 2023 Today Full Episode 700
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X