twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi: దివ్యకు తెలిసిన నిజం.. నందూ, తులసికి మళ్లీ పెళ్లి.. కథలో సూపర్ ట్విస్ట్

    |

    సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది.

    దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

    13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    13వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ ఇంటికి వచ్చిన వాసుదేవ్.. లాస్యను అక్కడ చూసి ఆమెపై కోప్పడతాడు. అంతేకాదు, తులసికి ఆమెతో జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తాడు. ఇక, విక్రమ్‌ను చూడడానికి వచ్చిన సరోజ.. చదువు లేని వాడితో తనకు పెళ్లి వద్దని తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    దీంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. ఆ సమయంలో అసలేం జరిగిందో విక్రమ్ అందరికీ వివరిస్తాడు. ఇక, లాస్య వచ్చి తులసిని నందూ భార్యగా నటించమని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో ఆమె ఒప్పుకోకనే ఒప్పుకున్నానని చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

    Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మికి షాకిచ్చిన అమ్మాయి.. లాస్యకు ఘోర అవమానం.. విక్రమ్‌కు దివ్య ఆఫర్Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మికి షాకిచ్చిన అమ్మాయి.. లాస్యకు ఘోర అవమానం.. విక్రమ్‌కు దివ్య ఆఫర్

    14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    14వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి పిల్లలు ఏం చేస్తున్నారని వాసుదేవ్ ప్రశ్నిస్తాడు. అప్పుడు లాస్య సమాధానం చెప్తుంది. దీంతో భర్త వదిలేయడం.. పిల్లాడిని హాస్టల్‌లో చదివించడం అంటూ ఆమె పరువు తీస్తాడు. మరోవైపు దివ్యను కలవడం కోసం విక్రమ్, దేవుడు రెస్టారెంట్‌కు వస్తారు. అప్పుడు ఆమె వచ్చి విక్రమ్‌కు సారీ చెప్పి మంచిగా మాట్లాడుతుంది.

    ఆ తర్వాత చదువు గురించి ఓ కస్టమర్‌కు దివ్య క్లాస్ పీకుతుంది. అదంతా చూసి విక్రమ్ సంతోషిస్తాడు. ఆ తర్వాత దేవుడు చదువులేని వాడిని చేసుకుంటారా అని దివ్యను అడగ్గా.. ఆమె చేసుకుంటానని అంటుంది. దీంతో విక్రమ్ ఫుల్ ఖుషీ అవుతాడు.

     15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    15వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో అందరూ మాట్లాడుతుండగా దివ్య ఎంట్రీ ఇస్తుంది. దీంతో వాసుదేవ్‌కు నిజం తెలుస్తుందని అంతా భయపడుతూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే దివ్య.. తులసి ఒంటరిగా మిగిలిందని మాట్లాడుతుంది. దీంతో లాస్య కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక, విక్రమ్‌ గురించి రాజ్యలక్ష్మికి బసవయ్య లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతూ ఉంటాడు. అంతలోనే అతడు ఇంటికి వస్తాడు. తల్లిని ఏమాత్రం పట్టించుకోకుండా మాట్లాడతాడు. ఇక, తులసిని దివ్య సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె జరిగింది మొత్తం కూతురికి వివరిస్తుంది. ఇక, విక్రమ్ దివ్య మాటలను గుర్తు చేసుకుని మురిసిపోతూ ఉంటాడు.

    16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    16వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్యకు వాసుదేవ్ ఓ పని చెప్పగానే ఆమె చేయడానికి ఒప్పుకోదు. దీంతో నందూ కూడా కోపంగా అరుస్తాడు. అప్పుడు తప్పక ఆమె వెళ్లిపోతుంది. ఆ తర్వాత తులసి గదిలోనే నందూను పడుకోవాలని వాసుదేవ్ అంటాడు. దీంతో చేసేదేం లేక నందూ, తులసి ఒకే చోట నిద్రిస్తారు. ఆ సమయంలో లాస్య తనలో తానే రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే వాసుదేవ్ వచ్చి నిజం తెలిసిపోయిందని పెద్ద గొడవ చేస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడే నందూ, తులసి పెళ్లిరోజు అని ఫ్లవర్ బొకేతో విష్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసేస్తాడు

    17 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    17 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    17వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య తనకు ఎంతగానో నచ్చిందని దేవుడితో విక్రమ్ అంటాడు. దీంతో మీ గురించి ఆమెకు మొత్తం చెప్పేయండని అంటాడు. అప్పుడు విక్రమ్ తను నన్ను నన్నుగానే ఇష్టపడాలి అంటాడు. ఆ తర్వాత దేవుడిని విక్రమ్ ఆస్పత్రికి తీసుకు రాగా.. దివ్య ట్రీట్‌మెంట్ చేస్తుంది. ఆ సమయంలో ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇక, బసవయ్య, రాజ్యలక్ష్మి గుడిలోకి నేరుగా వెళ్లిపోతుండగా తులసి అడ్డుగా నిల్చుని క్లాస్ పీకుతుంది. అప్పుడు చేసేదేం లేక రాజ్యలక్ష్మి లైన్‌లోనే నిల్చుకుని దేవుడిని దర్శించుకుంటుంది.

    18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    18వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఉదయాన్నే గుడికి వెళ్లి వస్తుండగా.. వాసుదేవ్, అతడి భార్య ఆపి ఎక్కడికి వెళ్లావని అడుగుతారు. అప్పుడామె విషయం చెప్పగానే.. పెళ్లిరోజున ఇద్దరూ కలిసి వెళ్లాలి కానీ.. ఒక్కదానివే ఎలా వెళ్లావని ప్రశ్నిస్తారు. ఆ తర్వాత నందూను పిలిచి క్లాస్ పీకుతారు. అలాగే, పెళ్లిరోజు పార్టీ కూడా చేయాలని అనుకుంటారు.

    అప్పుడే దీపక్ అక్కడికి రావడంతో అంతా షాక్ అవుతారు. తర్వాత అతడికి తులసి అంతా వివరిస్తుంది. ఇక, ఆస్పత్రిలో సంజయ్ నర్సుతో రొమాన్స్ చేస్తూ దివ్యకు మరోసారి దొరికిపోతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

    Intinti Gruhalakshmi: దీపక్ రాకతో తులసి ఇంట్లో టెన్షన్.. రొమాన్స్ చేస్తూ దొరికిపోవడంతో!Intinti Gruhalakshmi: దీపక్ రాకతో తులసి ఇంట్లో టెన్షన్.. రొమాన్స్ చేస్తూ దొరికిపోవడంతో!

    ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

    ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

    మార్చి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో నందూ, తులసి భార్యభర్తలుగా యాక్టింగ్ చేయడాన్ని హైలైట్ చేశారు. అంతేకాదు, వాసుదేవ్ రూపంలో లాస్యకు వరుసగా షాక్‌లు తగిలాయి. అలాగే, విక్రమ్, దివ్యలు కలిసిపోయి మాట్లాడుకుంటూ కనిపించారు. అదే సమయంలో రాజ్యలక్ష్మికి తులసిపై కోపం మరింతగా పెరిగిపోయింది. ఇక, నందూ, తులసికి వాసుదేవ్ మళ్లీ పెళ్లి చేస్తారని తెలిసింది. వచ్చే వారం ఇది మరింత రంజుగా సాగబోతుంది.

    English summary
    Intinti Gruhalakshmi March 13th to 18 Episodes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X