twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌ అలాంటి వాడు.. లోకానికే ఇలా ఉపకారం చేస్తున్నాడు: చిన్న జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

    |

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రమే 'ఆదిపురుష్'. రామాయణం నేపథ్యంతో చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందింది. దీన్ని ఓం రౌత్ తెరకెక్కించాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలోనే ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీమాన్ చిన్న జీయర్ స్వామి ఏం మాట్లాడారో మీరే చూసేయండి!

    ఆదిపురుష్‌గా మారిన ప్రభాస్: ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో వస్తున్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటించారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు.

     Chinna Jeeyar Swamy

    గ్రాండ్‌గా ఆదిపురుష్ ఈవెంట్: 'ఆదిపురుష్' మూవీని జూన్ 16వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలోని తారక రామ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీమాన్ చిన్న జీయర్ స్వామి చిత్ర యూనిట్‌ను సన్మానించి.. శ్రీరాముడి చరిత్రను మరోసారి అందరికీ వినిపించారు.

     Chinna Jeeyar Swamy

    తనలో రాముడిని తెస్తున్నాడు: 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. 'రాముడు ఎంతో గొప్పవాడు. అందుకే మనందరం ఆయనకు గుడులు కట్టించాం. ఆరాధనలు చేస్తున్నాం. అంతేకాదు, మనలో ప్రతి ఒక్కరిలోనూ రాముడు ఉన్నాడు. అలా తనలోని రాముడిని ఇప్పుడు బయటకు తెస్తున్నాడు శ్రీమాన్ ప్రభాస్' అని కొనియాడారు.

     Chinna Jeeyar Swamy

    లోకానికి ప్రభాస్ ఉపకారం అని:
    ఆ తర్వాత చిన్న జీయర్ స్వామి కొనసాగిస్తూ.. 'రామాయణంలోని అరణ్యకాండను, యుద్ధకాండను తీసుకుని.. ప్రధానమైన కథను చరిత్రగా లోకానికి అందించాలి అన్న ఆశతో ఈ సినిమాను చేస్తున్నాం అని వీళ్లు నాకు చెప్పారు. ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం మరొకటి ఉండదు. ఆ ఉపకారం చేస్తున్నాడు శ్రీమాన్ ప్రభాస్' అంటూ ప్రశంసలు కురిపించారు.

     Chinna Jeeyar Swamy

    ఆ శక్తిని ప్రభాస్‌కు ఇవ్వాలంటూ: చిన్న జీయర్ కంటిన్యూ చేస్తూ.. 'అలాంటి మంచి పని చేసే మహనీయులను, వ్యక్తులను మరిన్ని మంచి కార్యాలు చేయడానికి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఆయనకు ఉండాలి అని, ఇలాంటివి మరిన్ని వాటిని లోకానికి అందించే శక్తి ఆయనకు ఇవ్వాలని దీవిస్తున్నాం. దీని వెనుక ప్రధాన భూమిక పోషించిన ఓం రౌత్ గారికి కూడా ఆశీర్వాదాలు' అన్నారు.

    మీ వల్లే అందరికీ చేరుతుంది: ఆ తర్వాత 'ఇలాంటి గొప్ప చరిత్రను దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇప్పటి తరానికి అందించాలి. మనందరం నడిచే ఆలయాలం. కానీ, మనలో నుంచి ఆ భగవంతుడు బయటకు రావాలి. ఇప్పుడు ప్రభాస్ నుంచి రాముడు వస్తున్నాడు. మీ అందరికీ కూడా ఆశీర్వాదం చెబుతున్నాం. ఎందుకంటే మీరందరూ ఆదరిస్తేనే ఇది అందరికీ చేరుతుంది' అని స్వామి చెప్పారు.

    అలాంటి రాముడు కావాలని: చిన్న జీయర్ మాట్లాడుతూ.. 'వేయి సంవత్సరాల క్రితం రామానుజాచార్య ఏడాదిన్నర పాటు ఇక్కడే ఉండి.. రామాయణాన్ని 18 సార్లు చదివారు. ఆయన అందులోని ఎన్నో రహస్యాలను తెలుసుకున్నారు. ఇలా గతంలో రామాయణంపై చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ తరం దాటిపోయింది. ఇప్పటి వాళ్లకు మళ్లీ రాముడు కావాలి. ఈ టెక్నాలజీతో రాముడు కావాలి' అని పేర్కొన్నారు.

    అందరికీ ఆశీర్వాదాలు అని: చివర్లో చిన్న జీయర్ స్వామి 'అదే ఇప్పుడు వీళ్లు చేసి చూపించారు. అందుకే అందరికీ మా ఆశీర్వాదాలు ఇస్తున్నాము. ముఖ్యంగా జై శ్రీరామ్ పాట పాడిన అజయ్ - అతుల్‌కు అభినందనలు. రాముడి గురించి చేస్తున్న ఈ మంచి కార్యానికి శ్రీమాన్ ప్రభాస్ గారికి, ఓం రౌంత్ గారి టీమ్‌కు శుభాభినందనలు. నా మాటలను ఓపికగా విన్న మీ అందరికీ ఆశీర్వాదాలు' అని ముగించారు.

    English summary
    Adipurush Movie Unit Conducts Pre Release Event At Tirupati. Lets See Actress Chinna Jeeyar Swamy Speech at this Event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X