twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Baby 13 Days Collections: ఆగని 'బేబీ' వసూళ్లు.. 13వ రోజూ అదే జోరు.. ఎంత లాభాలు వచ్చాయంటే?

    |

    బేబి సినిమా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతోంది. రిలీజై 13 రోజులు అవుతున్నా కలెక్షన్లు అస్సలు తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో 13వ రోజు కలెక్షన్స్ వివరాలతో పాటు ఎంత లాభాలు వచ్చాయో చూద్దాం..

    ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య- విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన కల్ట్​ లవ్ మూవీ 'బేబీ'. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చారు. నాగబాబు, వైవా హర్ష, కిర్రాక్ సీత తదితురులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మొత్తంగా రూ. 7.40 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అంటే దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్​ రూ.8కోట్లు. అయితే ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్​ను అధిగమించి భారీ వసూళ్లను అందుకుంటోంది. విడుదై 13 రోజులైనా వసూళ్లు ఆగడం లేదు.

    Anand Devarakonda Baby Movie 13 Days Worldwide Official Collections

    13వ రోజు:బేబి చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. 13వ నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి మొత్తంగా రూ. 90 లక్షల షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అంటే 12వ రోజుతో పోలిస్తే 13వ రోజు కాస్తా తగ్గింది.

    తెలుగు రాష్ట్రాల్లో.. :బేబి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో నైజాంలో రూ. 13.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.26 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, గుంటూరులో రూ. 1.65 కోట్లు, కృష్ణాలో రూ. 1.76 కోట్లు, నెల్లూరులో రూ. కోటి వసూలు అయ్యాయి. అంటే మొత్తంగా రూ. 31.42 కోట్లు షేర్, రూ. 57.15 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయన్న మాట.

    Anand Devarakonda Baby Movie 13 Days Worldwide Official Collections

    ప్రపంచవ్యాప్తంగా:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బేబి చిత్రానికి 13 రోజుల్లో రూ. 31.42 కోట్లు షేర్‌, 57.15 కోట్ల గ్రాస్​ అందుకుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే వసూలు చేసింది. 35.64 కోట్ల షేర్​.. 67.10 కోట్ల గ్రాస్​ అందుకుంది. ఇక కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో 13 రోజుల్లో రూ. 1.74 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.48 కోట్లు కలెక్ట్​ చేసింది. ఇలా బేబి మూవీ మొత్తంగా 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.64 కోట్ల షేర్‌, రూ. 67.10 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది.

    Anand Devarakonda Baby Movie 13 Days Worldwide Official Collections

    బ్రో ఎఫెక్ట్.. ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్​ రూ. 8.00 కోట్లు. కానీ ఇది ఎప్పుడో దాన్ని పూర్తి చేసుకుంది. 13 రోజుల్లో రూ. 28 కోట్ల వరకు లాభాలను అందుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ వీకెండ్​ ఈ సినిమా జోరు కాస్త తగొచ్చు. ఎందుకంటే బ్రో సినిమా రిలీజ్ కానుంది. కాబట్టి బేబీపై కాస్త ఎఫెక్ట్ పడొచ్చు

    English summary
    Anand Deverakonda Vaishnavi Chaitanya Did Baby movie With Sai Rajesh Direction. Lets See This Movie 13 Days Worldwide Official Collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X