twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మ, నాన్న పెట్టిన భిక్షతోనే.. ఆ సంస్కారంతోనే నటుడిగా నిలబడ్డా.. సాయికుమార్ ఎమోషనల్

    |

    కంటెంట్ ప్రధానంగా రూపొందుతున్న సినిమాలకు మంచి ఆదరణ తెలుగు సినిమా పరిశ్రమలో దక్కుతున్నది. స్టార్ హీరోల లేకున్నా ఫీల్‌గుడ్, ఎమోషనల్ కంటెంట్ ఉంటే ఆ సినిమాలు భారీ విజయాన్ని అందుకొంటున్నాయి. అలాంటి కథ, కంటెంట్‌తో వస్తున్న చిత్రం నాతో నేను. జబర్దస్త్ ఫేమ్ శాంతికుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ నటులు సాయి కుమార్, ఆదిత్య ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాళీ రాజ్‌పుత్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం జూలై 21వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువరు ప్రముఖులు మాట్లాడుతూ..

    ప్రముఖ నటుడు సాయికుమార్‌ భావోద్వేగంతో మాట్లాడుతూ.. అమ్మ, నాన్న నాకు అద్బుతమైన స్వరాన్ని పుట్టుకతోనే ఇచ్చారు. అలాగే నాకు మంచి సంస్కరాన్ని నేర్పించారు. ఆ సంస్కారంతో నేను ఈ స్థాయిలో ఉన్నాను. చక్కని కథలతో రూపొందిన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా నిలబడ్డాను.తాజాగా నేను నటించిన నాతో నేను మూవీ కూడా మంచి కథతో రూపొందింది. మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు అని అన్నారు.

    Senior Actor Sai Kumar

    నాతో నేను సినిమాలో పాటలు, మాటలు అన్ని చక్కగా కుదిరాయి. నిర్మాత ప్రశాంత్ రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించారు. నాతో నేను సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. టీమ్‌ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ చిత్రంలో ప్రతి సీన్‌ మనసును కదిలిస్తుంది. ఈ నెల 21 గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. దర్శకనిర్మాతలతోపాటు మా అందరికీ మంచి పేరు, లాభాలు తీసుకురావాలి అని సాయి కుమార్ అన్నారు.

    నటుడు శ్రీనివాస్‌ సాయి మాట్లాడుతూ.. చక్కని కథాంశంతో ఎమోషన్స్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది నాతో నేను. మా టీమ్‌లో ప్రతీ ఒక్కరు మనసు పెట్టి సినిమా చేయడమే కాకుండా చాలా కష్టపడ్డాం. ఈ సినిమాకు పాటలు హైలెట్. రెట్రో సాంగ్‌ సినిమాలో అదిరిపోతుంది. చిన్న సినిమానే కావచ్చు కానీ మంచి ప్రయత్నం అని అన్నారు.

    జబర్దస్త్ ఫేమ్ శాంతికుమార్‌ మాట్లాడుతూ .. జబర్దస్త్‌ కమెడియన్‌గా టెలివిజన్ రంగంలో ప్రేక్షకుల ఆదరణ పొందాను. కమెడియన్‌గా నాకు నేను నా ప్రతిభను రుజువు చేసుకొన్నాను. నాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నా నిర్మాతలకు ధన్యవాదాలు. సీనియర్‌ ఆర్టిస్ట్‌ సాయికుమార్‌‌కు కథ వినిపించగానే మెచ్చుకొన్నారు. అప్పుడే నేను సక్సెస్‌ అయ్యాననిపించింది. ఆదిత్యా ఓం కథ వినగానే వెంటనే ఓకే చేశారు. అన్ని రకాలుగా సహకరించిన నిర్మాతకు కృతజ్ఞతలు అని అన్నారు.

    నాతో నేను మూవీని చిన్న సినిమాగా మొదలుపెట్టాం. చక్కని కథకు అన్ని సమపాళ్లతో కుదరడంతో మా వరకూ పెద్ద సినిమాగా నిలిచింది. కరోనా పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. మంచి సమయంలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం అని నిర్మాత ప్రశాంత్ టంగుటూరి అన్నారు.

    Senior Actor Sai Kumar

    నటీనటులు: సాయి కుమార్, ఆదిత్య ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాళీ రాజ్‌పుత్, సమీర్, సీవీఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు
    సినిమాటోగ్రఫి: మురళి మోహన్ రెడ్డి
    సంగీతం: సత్య కశ్యప్
    బీజీఎం: ఎస్ చిన్న
    ఎడిటింగ్: నందమూరి హరి
    ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల
    పాటలు: రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్
    కొరియోగ్రాఫర్: భాను, చంద్ర కిరణ్
    ఫైట్స్: నందు
    బ్యానర్:శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్
    సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి
    పీఆర్వో: మధు వీఆర్
    రిలీజ్ డేట్: 2023-07-23

    English summary
    Jabardasth Shanti Kumar is directing Natho Nenu movie. Shanti Kumar, Natho Nenu, Aditya Om are in lead role. This movie pre release event held in Hyderabad. Senior Actor Sai Kumar made emotional speech about mother and father.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X