twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిలుస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తా : మంచు లక్ష్మి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మోహన్ బాబు కూతురు, నిర్మాత, నటి మంచు లక్ష్మి ప్రసన్న రాజకీయాలపై తన ఆసక్తి గురించి స్పష్జంగా వెల్లడించారు. తనకు రాజకీయాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా చాలా రాజకీయ పార్టీలు తనను రాజకీయాల్లోకి రావాలని పిలుస్తున్నాయని వెల్లడించారు.

    అయితే నేను రాజకీయాల్లోకి రావడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్నాను, ఓ నాలుగైదు సంవత్సరాల తర్వాత తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను అని తెలిపారు. తను నటించిన 'చందమామ కథలు' చిత్రం ఈ నెల 25న విడుదలవుతున్న సందర్భంగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

    ఈ సందర్భంగా....మీరు రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, రాజకీయాలపై మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నకు స్పందిస్తూ మంచు లక్ష్మి పై విధంగా సమాధానం ఇచ్చారు. మంచు లక్ష్మి వ్యాఖ్యలు బట్టి ఆమె 2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

    మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు....సినిమా నటుడిగా, నిర్మాతగానే కాక తెలుగుదేశం పార్టీ తరుపున కొంతకాలం క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు. తండ్రి నుండి సినిమా వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా రాణిస్తోంది. ఇపుడు ఆమె రాజకీయాలపై కూడా దృష్టి పెడుతుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    తండ్రి మోహన్ బాబు మాదిరిగానే ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా, నిర్భంగా మాట్లాడే లక్షణాలు ఉన్న మంచు లక్ష్మి ఇప్పటికే పలు సందర్భాలో తన వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్‌‍గా పేరు తెచ్చుకుంది. మరి ఆమె ప్రత్యక్షరాజకీయాల్లోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి!

    మరో వైపు మంచు లక్ష్మి ఇటీవల నరేంద్ర మోడీని కలవడంతో పాటు, ఆయనకు తన మద్దతు కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆమె ఏ పార్టీ తరుపున ప్రచారం చేయడం లేదు. మరి భవిష్యత్‌లో పొలిటికల్ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేది కాలమే నిర్ణయించాలి.

    మంచు లక్ష్మికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

    మంచు లక్ష్మి

    మంచు లక్ష్మి

    ప్రముఖ నిర్మాత మోహన్ బాబు కూతురైన మంచు లక్ష్మి అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

    సినిమా రంగంలో...

    సినిమా రంగంలో...

    కొంత కాలం విదేశాల్లో ఉండి తర్వాత ఇండియాకి వచ్చిన మంచు లక్ష్మి తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం

    నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం

    ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ప్రసన్న సెలక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి సినిమా అనగనగా ఓ ధీరుడు చిత్రంలో విలన్‌గా నటించి పలు అవార్డులు సొంతం చేసుకున్న మంచు లక్ష్మి...ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి' చిత్రంతో మంచి ప్రశంసలు అందుకుంది.

    చందమామ కథలు

    చందమామ కథలు

    ప్రస్తుతం మంచు లక్ష్మి చందమామ కథలు చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఒక చాలెజింగ్ రోల్ పోసించారు. చందమామ కథలు చిత్రంలో నేను చేసిన పాత్ర మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను. ఈ పాత్ర చేయడం ద్వారా నటిగా ఓ మెట్టు ఎక్కాను అని ఆమె తెలిపారు.

    English summary
    "I have been approached by many parties to enter politics. I am definitely interested to join politics, but this is not the right time. May be after three or four years, I will surely get into active politics" Lakshmi Manchu told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X