twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అంతకుముందు ఆ తరువాత’కి అరుదైన గౌరవం

    By Srikanya
    |

    హైదరాబాద్ :శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నిర్మాత కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ నిర్మించిన 'అంతకుముందు ఆ తరువాత' చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఐఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎ (ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా)లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని ఫెస్టివల్‌లో ప్రదర్శించడానికి ఎంపిక చేశారు.

    సుమంత్అశ్విన్, ఇష జంటగా మోహనకృష్ణ ఇంద్రకంటి దర్శకత్వంలో రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన 'అంతకు ముందు ఆ తరువాత' చిత్రాన్ని దక్షిణాఫ్రికాలో జరిగే ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. 2014 జనవరి రెండో వారంలో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా, జోహాన్స్ బర్గ్, దర్బన్, కేప్ టౌన్ నగరాల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ప్రేక్షకుల ఆదరణతో విజయవంతమైన తమ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆనందాన్ని కలిగిస్తోందని చిత్ర నిర్మాత దామోదర ప్రసాద్ చెప్పారు.

    Indraganti AMAT selected for screening at IIFA

    ఒక యువతి, యువకుడు ప్రేమకు ముందు ఎలా ఉన్నారు? పెళ్లయ్యాక అదే ప్రేమతో ఉన్నారా? అన్న అంశాన్ని తీసుకుని యువతకు నచ్చే విధంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చి, విజయం బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం సౌతాఫ్రికాలో పోటీలో పాల్గొనడం తెలుగు చిత్ర పరిశ్రమకే సంతోషమని నిర్మాత తెలిపారు. ఈ చిత్రాన్ని సౌత్ ఆఫ్రికాలోని ప్రటోరియా, జోహాన్స్‌బర్గ్, డర్బన్, కేప్‌టౌన్ పట్టణాల్లో ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరానికి గాను ఈ ఫిలిమ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ఎంపిక చేసిన పది చిత్రాల్లో 'అంతకుముందు ఆ తరువాత' చిత్రం ఉండడం విశేషం.

    చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో రవిబాబు, రావురమేష్, ఉప్పలపాటి నారాయణరావు, అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేష్, కల్యాణిమాలిక్, పమ్మి సాయి, కె.ఎల్.ప్రసాద్, రోహిణి, మధుబాల, ప్రగతి, ఝాన్సీ, సుదీప, మాధవి, స్నిగ్ధ, అర్చన, అపర్ణ శర్మ నటిస్తున్నారు. సంగీతం: కల్యాణి కోడూరి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాం, గాయినీ గాయకులు: సునీత, హేమచంద్ర, కల్యాణి కోడూరి, స్రవంతి, శ్రీకృష్ణ, కాలభైరవ, కోగంటిదీప్తి, కెమెరా: పి.జి.వింద, ఎడిటింగ్ : మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్ : ఎస్.రవీందర్, నృత్యాలు : నోబుల్, సుచిత్ర, పాపి, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్, భరత్ , మేకప్ : మోహన్, పబ్లిసిటి డిజైనర్: ఆర్.విద్యాసాగర్, ఫైనాన్స్ కంట్రోలర్: మాకినేని సర్వేశ్వరరావు, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.శ్రీనివాసరాజు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ముప్పాల హరికృష్ణ, ఛీఫ్ కో డైరక్టర్: కొల్లి రాంగోపాల్ చౌదరి, సహనిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి.వి, నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

    English summary
    
 National and Nandi awards winner Indraganti Mohankrishna, who also received critical acclaims for his style of filmmaking for the movies ‘Ashta Chamma’ and ‘Golkonda High School’, now went one step above with his 2013 film ‘Anthaka Mundu Aa Tarvatha’. Yes, this film starring Sumanth Ashwin and Eesha as lead pair got officially selected for screening at IIFFSA (Indian International Film Festival of South Africa) 2014. The film festival will be held from 17th January to 23 January 2014 at various locations in South Africa with special focus on South African Films. ‘Anthaka Mundu Aa Tarvatha’ depicts sensitive issue of a young couple to have troubles in post-married life after being in a secret live-in relationship. Producer K L Damodhar Prasad is delighted that his film got selected to screen at IIFFSA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X