twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోల్డ్‌గా నటించా, నాన్న ఏమంటారో : మంచు లక్ష్మి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'ఎల్బీడబ్ల్యూ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తారు తాజాగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం 'చందమామ కథలు'. ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చాణక్య బూనేటి నిర్మిస్తున్నారు. మంచు లక్ష్మిప్రసన్న, చైతన్య కృష్ణ, సీనియర్‌ నటుడు నరేష్‌, ఆమని, కృష్ణుడు, కిశోర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    'చందమామ కథలు' చిత్రం ఈ నెల 25న విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా వివరాలను వెల్లడిస్తూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ చిత్రంలో నటించిన మంచు లక్ష్మి ప్రసన్న. సినిమా విభిన్నంగా ఉంటుందని, తాను సరికొత్త పాత్ర పోషించినట్లు ఆమె తెలిపారు.

    మంచు లక్ష్మి చెప్పిన విషయాలు స్లైడ్ షోలో....

    చాలెజింగ్ పాత్ర

    చాలెజింగ్ పాత్ర

    నేను ఈ సినిమాలో లిసా స్మిత్ అనే సూపర్ మోడల్ పాత్ర చేసాను. జీవిత ప్రయాణంలో అనేక సార్లు కిందపడి, పైకి లేవడం జరుగుతుంది. కింద పడిన ప్రతి సారి ఎలా ఫైట్ చేసి పైకి వచ్చిందనేదే నా పాత్ర కథ అని మంచు లక్ష్మి తెలిపారు.

    స్మోకింగ్, డ్రింకింగుపై

    స్మోకింగ్, డ్రింకింగుపై

    స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి తెరపై చూపించడం నాకు ఇష్టం లేదు. కానీ నా పాత్ర డిమాండ్ చేయడంతో ఒక ప్రొఫెషనల్ యాక్టర్‌గా అలాంటి సన్నివేశాల్లో నటించాను అన్నారు మంచు లక్ష్మి.

    బోల్డ్ రోల్, నాన్న ఎలా స్పందిస్తారో...

    బోల్డ్ రోల్, నాన్న ఎలా స్పందిస్తారో...

    త్వరలోనే నాన్నగారికి ఈ సినిమా చూపించాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను పోషించిన బోల్డ్ రోల్ చూసి ఆయన ఏమంటారు? ఎలా రియాక్ట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

    చందమామ కథలు

    చందమామ కథలు

    చందమామ కథలు చిత్రంలో నేను చేసిన పాత్ర మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను. ఈ పాత్ర చేయడం ద్వారా నటిగా ఓ మెట్టు ఎక్కాను అనితెలిపారు.

    English summary
    'I will show Chandamama Kathalu film soon for my father and am very eager to know, how would he react to my bold character in this flick.' Lakshmi Manchu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X