Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

అంత తేలిగ్గా సంతృప్తి చెందను : మంచు విష్ణు

Posted by:
Published: Sunday, October 27, 2013, 13:06 [IST]

అంత తేలిగ్గా సంతృప్తి చెందను : మంచు విష్ణు
 

హైదరాబాద్ : "నటుడిగా నేను అంత తేలిగ్గా సంతృప్తి చెందను. ఇంకా బాగా చేయాలనే అనుకుంటాను. ఈ సినిమాలో నా యాక్టింగ్ బావుందని అందరూ అంటున్నారు. డాన్స్, ఫైట్ల విషయంలో నేను చాలా కష్టపడ్డాను. కానీ ప్రాణాల మీదకు తెచ్చుకునే సాహసాలు ఎప్పుడూ చేయలేదు. 'దూసుకెళ్తా' విడుదలై తొమ్మిది రోజులైంది. అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. వచ్చే వారంలో గ్రాండ్‌గా సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేస్తాం'' అని అన్నారు విష్ణు. ఆయన హీరోగా నటించిన సినిమా 'దూసుకెళ్తా'. వీరుపోట్ల దర్శకత్వం వహించారు. ఆరియానా, వివియానా సమర్పించిన ఈ సినిమాకు మంచు మోహన్‌బాబు నిర్మాత.

దర్శకుడు వీరుపోట్ల మాట్లాడుతూ "దసరా సెలవులు అయిపోయాక, భారీ వర్షాల నడుమ విడుదలైంది మా సినిమా. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. సినిమా సక్సెస్‌తో మా టీమంతా ఆనందంగా ఉన్నాం. సినిమాలో విష్ణు యాక్షన్, కామెడీ టైమింగ్‌తో పాటు బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, రఘుబాబు కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలకు మంచి స్పందన వచ్చింది'' అని తెలిపారు.

అలాగే "దూసుకెళ్తా కథను నేను సంపూర్ణంగా వినలేదు. మనోజ్ విని చెప్పాడు. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఇష్టపడి చేశాను. కొంతమంది సన్నిహితులకు సినిమాను ప్రదర్శించాం. అందరూ ఏకధాటిగా బావుందని మెచ్చుకున్నారు. ఫస్ట్ కాపీ చూసిన రోజు కంటినిండా నిద్రపట్టింది. ఇందులో తమ్ముడు మనోజ్ నటించలేదు కానీ, అక్కని అడగ్గానే చేసింది. అది సినిమాకు ప్లస్ అవుతోంది. బ్రహ్మానందంగారితో నా కాంబినేషన్ ఈ సినిమాలో ఇంకా బాగా వర్కవుట్ అవుతోంది. పి చ్చేశ్వర్‌గా వెన్నెలకిశోర్ చాలా బాగా చేశాడు. వీరుపోట్ల డైలాగులు విన్న తర్వాత ఇంకెవరి డైలాగులూ నచ్చడం లేదు.''


ఇక "మా నాన్న నాకు పెద్ద క్రిటిక్. ఆయనకన్నా దాసరి నారాయణరావు అంకుల్ ఇంకా పెద్ద క్రిటిక్. ఆయన ఈ సినిమా చూసి 'చాలా బాగా చేశావురా' అన్నారు. చాలా పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. ఈ సినిమాలో నా హెయిర్ స్టైల్ బావుందని అందరూ అంటున్నారు. ఈ మధ్య ఇంటికి చిరంజీవి అంకుల్, సురేఖ ఆంటీ వచ్చారు. 'నీకు బోర్ కొట్టే వరకు ఈ హెయిర్ స్టైల్‌నే మెయింటైన్ చెయ్యి' అని చిరు అంకుల్ అన్నారు. నాన్నగారికి కూడా ఈ హెయిర్ కట్ చాలా బాగా నచ్చింది.''


"ఈ సినిమాలో నా పాత్రకు దూసుకెళ్తే తత్వం ఉంటుంది. కానీ అన్నిటికీ కండిషన్స్ అప్లై అని అంటుంటాను. ఈసినిమా వల్ల ఇంకో పదేళ్లు నేను పరిశ్రమలో దూసుకెళ్తాననిపిస్తోంది. ఈ సినిమా తొలికాపీ వచ్చాక చాలా తక్కువ మంది సన్నిహితులం కూర్చుని సినిమా చూశాం. సినిమాలో ఫైట్లో నాకు గాయాలవడం చూసి మా పిల్లలిద్దరూ ఏడ్చేశారు. కానీ సినిమా అంతా చూసిన తర్వాత అందరూ భరోసా ఇవ్వడంతో నేను కంటినిండా నిద్రపోయాను.'' అని మంచు విష్ణు అన్నారు.

నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్
Topics: manchu vishnu, veeru potla, doosukeltha, మంచు విష్ణు, వీరూ పోట్ల, దూసుకెళ్తా
English summary
Manchu Vishnu says that Doosukeltha is a Super Hit. He Saya that Collections are very good in all areaS.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice