twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పద్మశ్రీ వివాదం: సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు ఊరట

    By Bojja Kumar
    |

    న్యూఢిల్లీ: తెలుగు నటుడు మోమన్ బాబు తనకు కేంద్ర ప్రభుత్వం బహూకరించిన 'పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేసారంటూ కోర్టు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య హైకోర్టు తన తీర్పులో మోహన్ బాబు స్వచ్ఛందంగా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయాలని పేర్కొంది. ఈ విషయమై సుప్రీం కోర్టను ఆశ్రయించిన మోహన్ బాబుకు ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    విష్ణు, హన్సిక నటించిన 'దేనికైనా రెడీ' సినిమా టైటిల్స్ లో మోహన్ బాబు నిబంధనలకు విరుద్ధంగా తన పేరు ముందు 'పద్మశ్రీ' వేసుకున్కనారని, ఇలా చేయడం ఆ అవార్డును దుర్వినియోగం చేయడమే అంటూ గతేడాది బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనా రెడ్డి మోహన్ బాబుపై కేసు వేశారు.

    Mohan Babu’s Padma Shri Issue: SC stay on High Court Judgment

    ఈ కేసుపై స్పందించిన హై కోర్టు మోహన్ బాబు‌ని వారి పద్మశ్రీ అవార్డులను స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వమని తీర్పు ఇచ్చింది. కాని మోహన్ బాబులు ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఉద్దేశపూర్వకంగా 'పద్మశ్రీ'ని దుర్వినియోగం చేయలేదని, కేవలం సాంకేతిక తప్పిదంగా జరిగిందని చెప్పారు.

    ఈ విషయంపై సుప్రీమ్ కోర్టు ఇటీవల మోహన్ బాబుకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పేరుకు ముందు పద్మశ్రీ వాడకూడదని ఆదేశిస్తూ కనీసం ఇంటి ముందున్న టైటిల్ బోర్డు మీద కూడా పద్మశ్రీ వాడుకోనని చెబుతూ ప్రమాణ పత్రం సమర్పించాలని మోహన్ బాబుని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ రోజుకి వాయిదా పడగా.....ఈ రోజు జరిగిన విచారణలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    English summary
    Mohan Babu’s Padma Shri Issue: Supreme Court stay on High Court Judgment. In the past, a Division Bench of the A.P. High Court directed the authorities to submit a recommendation and report regarding the withdrawing of the ‘Padma Shri’ title conferred upon actor-producer Mohan Babu, to the President of India for final orders on cancellation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X