twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న పవన్ కళ్యాణ్...ఇప్పుడు నాగార్జున

    By Srikanya
    |

    Nagarjuna all set to join BJP
    ఢిల్లీ: రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రధాన అభ్యర్ది నరేంద్ర మోడిని కలిసి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూటులో నాగార్జున సైతం ప్రయాణం పెట్టుకున్నారు. భాజపా జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడితో సినీనటుడు అక్కినేని నాగార్జున సంప్రదింపులు జరిపారు. అనంతరం వెంకయ్యనాయుడి సలహా మేరకు నరేంద్రమోడీతో భేటీ అయ్యేందుకు నాగార్జున అహ్మదాబాద్‌ వెళ్లారు. మోడీ నాయకత్వంలో గుజరాత్‌లో జరిగిన అభివృద్ధి, ప్రాజెక్టులను నాగార్జున పరిశీలిస్తున్నారు. సాయంత్రం 4గంటలకు భాజపా ప్రధాని అభ్యర్థి మోడీని నాగార్జున కలిసే అవకాశముంది.

    ఇక అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'మనం'. ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేం విక్రమ్‌కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం అనుకున్నదానికంటే సినిమా అద్భుతంగా వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

    తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హర్షవర్దన్ కథ, సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయని తెలుస్తోంది. నాగార్జునకు జోడీగా శ్రీయ నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సర సన సమంత నటిస్తున్నారు. అనూప్‌రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

    'వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో కుటుంబం మొత్తం కలసి నటించడం ఇప్పటివరకు రాజ్‌కపూర్‌ కుటుంబానికే దక్కింది. 'మనం' చిత్రం ద్వారా మాకు ఆ అవకాశం వచ్చింది. ఇందులో అఖిల్‌ కూడా నటిస్తే బాగుణ్ను అని అందరూ అంటున్నారు. అఖిల్‌ని మొదట హీరోగా చూసి.. తర్వాత మల్టీస్టారర్‌, కుటుంబ చిత్రాలు చేయాలన్నదే నా ఆలోచన..అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'మనం' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అఖిల్ చేస్తాడన్న రూమర్స్ ని ఇలా ఖండించారు నాగార్జున.

    English summary
    After Pawan Kalyan's sensational political entry of late, now it is Akkineni Nagarjuna's turn to enter politics. Nagarjuna is all set to join Bharatiya Janata Party (BJP).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X