twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి తండ్రిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

    By Srikanya
    |

    Rajamouli
    హైదరాబాద్‌: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్‌పై నాంపల్లి క్రిమినల్‌ కోర్టు సోమవారం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఆయనపై నమోదైన కేసులో కోర్టు పై విధంగా స్పందించింది.

    వివరాల్లోకి వెళితే .... నిర్మాత చెంగల వెంకట్రావ్‌ కొన్నాళ్ల క్రితం విజయేంద్ర ప్రసాద్‌పై పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. సినిమాకు కథ ఇస్తానంటూ తన వద్ద రూ.41లక్షలు తీసుకున్నారనీ, తర్వాత కథ విషయం పక్కనపెట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను 2005లో మరో రచయిత వద్ద కథ తీసుకుని 'నరసింహుడు' పేరుతో సినిమా విడుదల చేశానని చెప్పారు.

    పోలీసులకు చెబుతానంటే... అరెస్టుకు భయపడి రూ.30లక్షల విలువైన రెండు చెక్కులు ఇచ్చారని, వాటిని బ్యాంకులో జమచేస్తే తగినన్ని నగదు నిల్వలు లేవంటూ డబ్బులు ఇవ్వలేదని వివరించారు. దీంతో, తాను సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించగా... కేసునమోదు చేశారనీ, విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీచేసిందని చెప్పారు. యలమంచిలి కోర్టులోనూ విజయేంద్ర ప్రసాద్ పై చెక్‌బౌన్స్‌ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు వెంకట్రావ్‌ వెల్లడించారు.

    ఇక 2011 లోనూ సినిమాకు స్క్రిప్ట్ సిద్దం చేస్తానని చెప్పి విజయేంద్ర ప్రసాద్, నిర్మాత మేడికొండ మురళి వద్ద ఏడెనిమిది సంవత్సరాల క్రితం సుమారు 6-7 లక్షల రూపాయలు తీసుకుని వివాదంలో ఇరుక్కున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి విజయేంద్ర ప్రసాద్ ఏ పనీ చేయక పోయినప్పటికీ, తీసుకున్న సొమ్ము సైతం తిరిగి ఇవ్వలేదని మేడికొండ మురళి ప్రధాన ఆరోపణగా అప్పుడు తెలిసిందే. మొత్తానికి, ఈ వివాదం పై ఇరువర్గాలతో చర్చించిన నిర్మాతల మండలి, స్క్రిప్ట్ రైటర్ మరియు దర్శకుడైన విజయేంద్ర ప్రసాద్ పై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

    English summary
    Going by reports Rajamouli's Father Vijayendra Prasad is back in news for wrong reasons. This time, it seems, the Samara Simha Reddy Story Writer is in more trouble.Nampalli Criminal court in Hyderabad has reportedly issued a non-bailable arrest warrant (NBW) against Vijayendra prasad for cheque bounce case repeatedly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X