twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మిర్చి’ సినిమాకి కూడా అలాగే... : హరీష్ శంకర్

    By Srikanya
    |

    హైదరాబాద్ :' సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందని...ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ తక్కువగా వుంటుందని చాలా మంది అంటున్నారు. ఇటీవలే వచ్చిన 'మిర్చి' సినిమాకి కూడా 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సినిమాను ఫ్యామిలీ ఆడియన్సే ఎక్కువగా ఆదరించారు. మా చిత్రాన్ని కూడా కుటుంబ ప్రేక్షకులు ఆదరిస్తారు' అని హరీష్ శంకర్ అన్నారు. ఎన్టీఆర్‌, సమంత జంటగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సినిమాకు ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడారు.

    అలాగే ...'ఎంత బడ్జెట్‌లో సినిమా తీయాలి. ఎన్ని రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేయాలనేది నా చేతుల్లో ఉంది. రిలీజ్‌ అయ్యాక సినిమా సూపర్‌హిట్టా? బ్లాక్‌బస్టర్‌ హిట్టా అనేది ప్రేక్షకులే నిర్ణయించాలి. ఎన్టీఆర్‌కున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన పాత్రను డిజైన్ చేశాను. తారక్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాడు. ఒక్కసారి చూస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించే చిత్రమిది. మాస్‌లో ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను డిజైన్ చేశాను. తారక్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాడు. దర్శకుని మూడ్ బాగుండకపోతే... సినిమా సరిగ్గా రాదనే నమ్మే నిర్మాత దిల్ రాజు. అందుకే ఎలాంటి ఒత్తిడికీ లోను చేయకుండా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కసారి చూస్తే... మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది' అన్నారు.

    దిల్ రాజు మాట్లాడుతూ....సినిమా ఫస్ట్‌ కాపీ చూశా. చాలా అద్భుతంగా వచ్చింది. ఎన్టీఆర్‌ మాస్‌ ఎలిమెంట్స్‌, మా బ్యానర్‌ తాలుక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హరీష్‌ యూత్‌ మార్క్‌. ఇలా అన్ని హంగులతో ఈ చిత్రం తెరకెక్కింది. 11వ తేదీ నాకూ, హరీష్‌కి బాగా కలిసొచ్చింది. అతని దర్శకత్వంలో 'గబ్బర్‌సింగ్‌' చిత్రం మే 11న, మా బ్యానర్‌లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం జనవరి 11న విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. డెఫినెట్‌గా ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుంది. 2013లో విడుదలైన టాప్‌ త్రీ సినిమాల్లో రామయ్యా వస్తావయ్యా చిత్రం కూడా ఉంటుంది. ఈ నెల 10న చిత్రాన్ని విడుదల చేయాల్సివుంది. అనివార్య కారణాల వల్ల 11న విడుదల చేస్తున్నాం. యాక్షన్ సన్నివేశాల్ని దృష్టిలో పెట్టుకొని సెన్సార్ వారు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు అన్నారు.

    English summary
    
 NTR starrer Rammayya Vastavayya got an A certificate from the Censor Board this evening (8th October). No cuts were suggested by the CB. The film is slated to release on October 11. Yes the release date has been announced officially. It is releasing this Friday. Ramayya Vastavayya stars Samantha and Shruti Hassan as NTR’s leading ladies. Dil Raju has produced the film, while Harish Shanker has directed it. S S Thaman has composed the music for this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X