twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ సంఘటన: మగాళ్ల తీరుపై జబర్దస్త్ యాంకర్ ఫైర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దేశంలో రోజు రోజుకు లైంగిక దాడులు, లైంగిక వేధింపుల సంఘటనలు పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. మహిళల వస్త్రధారణ రెచ్చగొట్టే విధంగా ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వాదించే మగాళ్లు అనేకం. కొందరు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి గతంలో విమర్శల పాలయ్యారు. రేప్ సంఘటనలకు, మహిళల వస్త్ర ధారణకు ముడి పెట్టి మాట్లాడుతున్నవారు....చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై మాత్రం నోరు మెదపడం లేదు. ఇటీవల బెంగుళూరులోని ఓ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరుగడం దేశ ప్రజలందరినీ షాక్‌కు గురి చేసింది.

    కాగా....జబర్దస్త్' కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన యాంకర్ రష్మి గౌతమ్ మహిళల వస్త్రధారణపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు. మహిళల వస్త్రధారణ వల్లే లైంగిక దాడులు జరుగుతున్నాయనే వాదనను ఆమె తీవ్రంగా ఖండించారు. రేప్ అనేది మగాళ్ల మైండ్ నుండి వచ్చే ఆలోచనే, మహిళల వస్త్రధారణ చూసి వచ్చే ఆలోచన కాదు, మహిళల వస్త్రధారణకు రేప్ సంఘటనలకు సంబంధం లేదన్నారు.

    Rashmi Gautam says...Rape is in the mind, not in the clothes

    సోషల్ మీడియాలో...... మహిళల వస్త్ర ధారణ గురించి విమర్శలు చేస్తున్న మగాళ్లకు తన పదునైన వ్యాఖ్యలతో గట్టిగా సమాధానం చెప్పారు రేష్మి గౌతమ్.

    English summary
    Rashmi Gautam says...Rape is in the mind, not in the clothes. The anchor Jabardasth was targeted by men at social networking site accusing her dressing and fashion as reasons to prompt unusual rape instincts among men.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X