twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏదయినా బాలయ్య దిగనంత వరకే...(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా స్టైల్‌కి ఏ మాత్రం తీసి పోకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ నటవారసుడైన బాలయ్య...ఇన్నాళ్లు రాజకీయాలకు కాస్తదూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన తొలిసారిగా క్రియా శీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

    ఇటీవల బాలయ్య నటించిన 'లెజెండ్' సినిమాలో చెప్పిన డైలాగ్ 'సెంటరైనా స్టేట్ అయినా.... పోసిషన్ అయినా అపోసిషన్ అయినా...పవర్ అయినా పొగరయినా....నేను దిగనంత వరకే' అన్నట్లే నిజజీవితంలోనూ జరుగుతోంది. ఆయన రంగంలోకి దిగితే ప్రభంజనం ఏ రేంజిలో ఉంటుందో హిందూపురం నామినేషన్ సందర్భంగా తరలి వచ్చిన అభిమానులు, ప్రజలను చూస్తే స్పష్టమవుతుంది.

    నామినేషన్ సందర్భంగా బాలయ్య వెంట ఆయన చిన్నఅల్లుడితో పాటు, ఇద్దరు కూతుళ్లు, భార్య కూడా వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

    ప్రభంజనం

    ప్రభంజనం

    బాలయ్య నామినేషన్ సందర్భంగా హిందూ పూరంలో పోటెత్తిన అభిమానులు, ప్రజలు

    ఇక నుండి బాలయ్య క్రీయాశీలకంగా..

    ఇక నుండి బాలయ్య క్రీయాశీలకంగా..

    ఇక నుండి బాలయ్య రాజకీయాల్లో క్రియా శీలకంగా వ్యవహరించబోతున్నారు. పాలన, రాజకీయాలు ఎలా ఉండాలనే దానిపై ఇంతకాలం సినిమాల్లో చూపించిన ఆయన.....ఇపుడు తనను గెలిపిస్తే రియల్ లైఫ్ చేసి చూపిస్తానంటున్నాడు.

    బాలయ్యపై నమ్మకం...

    బాలయ్యపై నమ్మకం...

    బాలయ్య గెలిస్తే తమకు మంచి జరుగుతుందని హిందూ పురంలోని ఓటర్లు భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.

    బాలయ్య ఆస్తులు

    బాలయ్య ఆస్తులు

    నామినేషన్ సందర్భంగా బాలయ్య తన, కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటించారు. వీటి విలువ దాదాపు రూ. 300 కోట్లు. ఒక్క బాలయ్య పేరుమీదనే రూ. 170 కోట్లు ఉన్నాయి.

    భారీ బందోబస్తు మధ్య

    భారీ బందోబస్తు మధ్య

    బాలయ్య నామినేషన్ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేసారు. ఆయన వందలాది మంది పోలీసులు ఆయన ర్యాలీకి బందోబస్తులో పాల్గొన్నారు.

    English summary
    TDP founder N.T.Rama Rao’s son Telugu Actor Nandamuri Balakrishna is to contest for the 175 seat Andhra Pradesh Legislative Assembly from the family pocket borough Hindupur near the Andhra Pradesh border with Karnataka. Balakrishna files nomination at Hindupur assembly consistency on April 16th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X