twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ తో చిత్రం విషయమై రాజమౌళి...

    By Srikanya
    |

    హైదరాబాద్:రాజమౌళి-అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభం కానుందని, ఆ మేరకు అల్లు అరవింద్ తో చర్చలు జరగాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా 'బాహుబలి' తర్వాత వచ్చే అవకాశం ఉందని , 3డిలో తీయాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. అయితే అవన్నీ కేవలం రూమర్స్ అని రాజమౌళి కొట్టిపారేసారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసారు.

    రాజమౌళి ట్వీట్ చేస్తూ..." నేను అల్లు అర్జున్ తో పని చేయటాన్ని ఇష్టపడాను. అయితే ఇప్పటివరకూ ఏ విధమైన ప్లాన్స్, మాటలు లేవు. మీరు చూసేవన్నీ కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే. బాహుబలి అయ్యేదాకా నేను ఏ చిత్రమూ ప్లాన్ చేయదలుచుకోలేదు" అన్నారు.

    SS Rajamouli tweeted about allu arjun film

    ఇక బాహుబలి విషయానికి వస్తే ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

    ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని,విశ్వరూపం ప్రదర్శశిస్తోంది.

    English summary
    
 SS Rajamouli tweeted "Though I love to work with Bunny, there hasn't been any plans or talks yet. All you see are mere speculations. Won't be planning anything till Baahubali is over"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X