twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసీఆర్‌ గ్రేట్: తెలుగు సినీ ప్రముఖుల ప్రశంసలు

    By Bojja Kumar
    |

     Telugu Film Chamber praises KCR
    హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్‌లో అద్భుతంగా అభివృద్ధి చేస్తామని, 2 వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీ నిర్మిస్తామని, పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలి పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై తెలుగు ఫిల్మ్ చాంబర్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫిల్మ్ చాంబర్ ప్రముఖులు డి. సురేష్ బాబు, సి కల్యాణ్, పరుచూరి గోపాల కృష్ణ తదితరులు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు కేసీఆర్‌ నిర్ణయాన్ని ఆహ్వానించారు.

    కేసీఆర్ సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ది చేస్తామని చెప్పడం సంతోష దాయకమని అన్నారు. ప్రభుత్వాల అండ ఉంటే తెలుగు సినీ పరిశ్రమను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లడానికి సాధ్యం అవుతుందని అభిప్రాయ పడ్డారు. కేసీఆర్ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని సినీ ప్రముఖులు వెల్లడించారు.

    కేసీఆర్ ఏమన్నారంటే..
    ఎవరెటుపోయినా టాలీవుడ్‌ మాత్రం హైదరాబాద్‌ని వీడకుండా చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎన్ని స్టూడియోలున్నా, ఎన్నెన్ని వసతులున్నా మరిన్ని వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీని నిలబెట్టడానికి తెలంగాణలో ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నామన్నారు.

    అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు లాంటి ఫేమస్ స్టూడియోలు హైదరాబాద్‌ నగరంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ప్రాణం పోస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సినిమా స్టూడియో ఇక్కడి సినిమా అవసరాలు తీరుస్తోంది. సినిమా నిర్మాణానికి ఇంతటి వసతులు కలిగిన హైదరాబాద్‌ నుంచి రాష్ట్రం విడిపోగానే ఇండస్ట్రీ అంతా తట్టాబుట్టా సర్దేస్తుందనుకున్నారు. కానీ కేసీఆర్‌ తనదైన రీతిలో సినీ పరిశ్రమను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు.

    సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ నుంచి తరలిపోకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికావాలని అందు కోసం రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని నిర్మించాలని ఆదేశించారు. సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ నుంచి తరలిపోదని కేసీఆర్ అన్నారు. ఇంత మంచి వాతావరణం ఉన్న నగరం ఎక్కడా దొరకదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లు, సీరియళ్ల నిర్మాణం ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా సినిమా సిటీని నిర్మించాలని అధికారులకు సూచించారు. గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ లాంటి సాంకేతిక స్టూడియోలు సినిమా సిటీలో ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

    English summary
    Telugu Film Chamber members D Suresh Babu, C Kalyan, Paruchuri Gopala Krishna and other praises KCR. Telangana Chief Minister K Chandrasekhar Rao on Thursday, 31 July, asked his officials to prepare a plan to build a film city in 2,000 acres of land in and around Hyderabad. He expects the new film city to be on the lines of Hollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X