twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రుద్రమదేవి' : షూటింగ్‌లో నగలు మాయం

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'రుద్రమదేవి' సినిమా చిత్రీకరణ నిమిత్తం తీసుకొచ్చిన విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 1.5 కిలోల బరువున్న సంప్రదాయ నగలు చోరీకి గురవడంతో సినిమా యూనిట్‌ సభ్యులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. గోపన్‌పల్లిలోని రామానాయుడు స్టూడియోకు చెందిన స్థలంలో 'రాణిరుద్రమ' సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

    ఈ చిత్రంలో రుద్రమదేవి పాత్రను పోషిస్తున్న అనుష్క అలంకరణకు సంప్రదాయ నగలు ఉపయోగిస్తున్నారు. నగలను చెన్నైలోని నాదెండ్ల అంజనేయశెట్టి సంస్థ సరఫరా చేస్తోంది. ఆ సంస్థ ప్రతినిధి రవి సుబ్రమణ్యం వాటిని చెన్నై నుంచి తీసుకొచ్చి నిర్వాహకులకు ఉదయాన్నే ఇచ్చి షూటింగ్‌ అనంతరం తిరిగి తీసుకెళ్తున్నారు.

    శనివారం ఉదయం సుబ్రమణ్యం కిలోన్నర బరువున్న ఆభరణాలతో వచ్చారు. మధ్యాహ్నం నగల సంచిని షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న విశ్రాంతి వ్యాన్‌లో డ్రైవర్‌ సీటు వెనుక ఉంచారు. భోజనం అనంతరం చూడగా సంచిలో నగల పెట్టెలు కనిపించలేదు.

    Theft in the Rudhramadevi set?

    దీంతో సినిమా ఎగ్జికూటివ్‌ ప్రొడ్యుసర్‌ రాంగోపాల్‌ శనివారం రాత్రి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాక్సుల్లో ఎన్ని బంగారు, ఎన్ని రోల్డ్‌గోల్డ్‌ నగలు ఉన్నాయనే స్పష్టత రాలేదని, సంస్థ నిర్వాహకులు వస్తేనే లెక్క తేలుతుందని ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ తెలిపారు.

    అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. ఈ మేరకు ఖర్చు కూడా భారీగా పెడుతున్నారు.

    దర్శుడు మాట్లాడుతూ... ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్‌లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్‌లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్‌లలో షూటింగ్‌ చేశాం. మిగిలిన వాటిలో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    Recent reports say that a theft took place on the sets of Rudhramadevi while Allu Arjun was wrapping up his schedule for the movie Rudhramadevi. A minimum of 1Kg was stolen from the sets of the film according to the unit folks. It is also reported that the producer of the film lodged a complaint at the Rayadurgam police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X