నాగచైతన్య హీరోగా పరిచయమవుతున్న చిత్రం హీరోయిన్ కార్తీక పై రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి.. ఒకప్పటి అందాల తార రాధకూతురైన ఆమె తొలిచిత్రం ఇదే కావటంతో అంతటా ఈ టాపిక్ పైనే చర్చ నడుస్తోంది.ఇక ప్రతీది భూతద్దాల్లోంచి చూసే ఫిల్మ్ సర్కిల్స్ లో అయితే నెగిటివ్ గా ప్రచారం జరుగుతోంది. ఊరించి చూపించినంత అందంగా లేదని,రాధ లాంటి అందగత్తె కూతురంటే ఏదేదో ఊహించుకున్నామని అన్నీ భగ్నం చేసిందని అంటున్నారు.ఇంకొంతమంది అయితే ఓయ్ చిత్రం హీరోయిన్ షామిలీని కూడా ఇలాగే హైప్ చేసి వదిలారు. చివరకూ ఆమె ఎవరికీ నచ్చకుండా పోయిందని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరో వర్గం అయితే రాధ కూతురు కార్తీక ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు చేసిందని,అయితే అవి రిలీజ్ కాకపోవటంతో తొలిసారి అనే ఫీలింగ్ కలిగిస్తోందని అంటున్నారు. అక్కడే మొదట ఆమెను రాధ గ్రాండియర్ గా పరిచయం చేయటానికి ప్లాన్ చేసిందని,అయితే ఆమె అనుకున్నట్లు ఒక్క సినిమా కూడా ధియోటర్ కి చేరకపోవటంతో ఆ పని చేయలేకపోయిందని అంటున్నారు. ఇక మూడు సినిమాలు ఆగిపోవటంతో ఈమెను బుక్ చేసేవారు కరువయ్యారని,అందుకే తెలుగుకి వలస వచ్చిందని అంటున్నారు.అయితే జోష్ ఆడియో పంక్షన్ రోజున మాత్రం ఆమె అదరకొట్టిందని మాత్రం అందరూ అంటున్నారు. ఇక సినిమా రిలీజయ్యాక నటనలోనూ కేక అంటారేమో చూడాలి.
&13;