ధనుష్ ‘కొంటెకుర్రాడు పెంకిపిల్ల’

గురువారం, సెప్టెంబర్ 3, 2009, 15:16 [IST]
తమిళ చిత్ర పరిశ్రమలో ఈనాటి యువకథానాయకుల్లో ప్రథమ స్థానంలో ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, యంగ్‌హీరో ధనుష్ కథానాయకుడిగా నటించి సూపర్ హిట్ అయిన 'తిరుడ తిరుడి' తమిళ చిత్రాన్ని ఫ్యూచర్ ఫిల్మ్ సంస్థ తెలుగులోకి అనువదిస్తోంది. 'కొంటెకుర్రాడు పెంకిపిల్ల" అనే పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం గురించి సమర్పకులు వై. శ్రీనివాస్ మాట్లాడుతూ... కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకర్షిస్తుందంటున్నారు.

డిగ్రీ వరకు చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఓ పెంకిపిళ్ళను ప్రేమలో పడిన హీరో, అనంతరం తన తండ్రి ఉద్భోధతో బాధ్యతను తెలుసుకుని ప్రేమకు నమస్కారం చెప్పి..ముందు తన బాధ్యతలను నెరవేర్చాలనుకుంటాడు. అయితే ఈ లోపల అతని జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? వాటిని హీరో ఎలా పరిష్కరించుకోగలుగుతాడు? అనేదే 'కొంటెకుర్రాడు పెంకిపిల్ల" కథాంశమని సమర్పకులు వివరించారు.సెప్టెంబర్ పదోతేదీ నుంచి డబ్బింగ్‌ని మొదలు పెట్టి నెలాఖరు కల్లా తొలికాపీని సిద్ధం చేస్తామని శ్రీనివాస్ చెప్పారు. యంగ్‌హీరో ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఛాయాసింగ్ కథానాయికగా నటిస్తోంది. సుకీ, కరుణాస్ తదితరులు నటించిన ఈ సంగీతం దినా అందిస్తున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST