కుర్రకారు కలలరాణి నమిత ఇప్పుడు వారి చేతిల్లో ఇమిడిపోతోంది కేవలం తొమ్మిది వందలకే. నమిత రేకెట్స్ పేరుతో తయారవుతున్న బాణాసంచా తమిళ మార్కెట్లో బాగా పేలింది. దీపావళి కోసం తయారు చేసే టపాసులకు, బాంబులకు, రాకెట్స్ కీ తయారీదారులు శ్రేయ, స్నేహ, అనూష్క, నయనతార, త్రిష,నమిత పేర్లు పెట్టి వారి సెక్సీ బొమ్మలు వేసి అమ్ముతున్నారు. అయితే చిత్రంగా నమిత రేకెట్స్ కే డిమాండ్ బాగా ఉంది. ప్రత్యేకమైన సౌండ్ చేస్తూ సిక్సీన్ హెడ్స్ ఉన్న ఈ రాకెట్స్ కి కాలేజి కుర్రకారు బారులు తీరుతున్నారు. బికినీ వేసిన నమిత ఫొటో ఆ క్రాకర్స్ పై అంటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నమిత వచ్చే సంవత్సరం నుండీ వారి నుండి రాయల్టీ అడిగితే బావుంటుందనే నిర్ణయానికి వచ్చింది. ఇక నమిత హీరోయిన్ గా చేసిన జగన్మోహిని చిత్రం త్వరలో రిలీజ్ అవుతోంది.






















