Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ కళ్యాణ్ ఆ స్టార్ డైరక్టర్ కాంబినేషన్ చిత్రం ఆగినట్లేనా?
పవన్ కళ్యాణ్ తో తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ డైరక్ట్ చేసే భిళ్ళా ప్రీక్వెల్ ఆగినట్లేనని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మొదట ఈ చిత్రాన్ని పిబ్రవరి నుంచి ప్రారంభిద్దామనుకున్నారు. అయితే విష్ణు చెప్పిన స్టోరీ లైన్, స్క్రిప్టు పవన్ కి నచ్చలేదని దాంతో తాను గబ్బర్ సింగ్ ప్రాజెక్టుతో ముందుకు వెళ్ళనున్నానని విష్ణుకు స్పష్టం చేసినట్లు చెప్పుకున్నారు. అయితే విష్ణు మాత్రం అజిత్ తో ఏప్రియల్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అది రిలీజై హిట్టయితే అప్పుడు పవన్ ఆ చిత్రాన్ని అదే డైరక్టర్ తో రీమేక్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గతంలో విష్ణు వర్ధన్ అజిత్ తో చేసిన భిళ్ళా చిత్రం సంచలన విజయం సాధించి తెలుగులోకి సైతం ప్రభాస్ తో రీమేక్ అయింది. ఇప్పుడా చిత్రం ప్రేక్వెల్ అంటే అసలు భిళ్ళా మాఫియాలోకి ఎలా ఎంటరయ్యాడు. నిల దొక్కుకునే సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..అన్న ఏంగిల్ లో కథను తయారు చేయాడని తెలుస్తోంది. అయితే భిళ్ళాకి భిళ్ళా2కి పోలిక కేవలం క్యారెక్టర్ కంటిన్యూషనే అని చెప్తున్నారు. ఇక స్టైలిష్ టేకింగ్ తీసే విష్ణు ఈ చిత్రం ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్ లో తీయాలని నిర్ణయించారు.